For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లిపాయలో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు..శరీరం శుద్ధి చేయడం నుండి హార్ట్ హెల్త్ వరకూ

By Staff
|

ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరుపెట్టిస్తుంది. కానీ... 'ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు'అని సామెత. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది ఈ సామెత. ఉల్లిగడ్డలను కోసినప్పుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. వాటితోపాటుగా ఘాటై సల్ఫర్‌ గ్యాస్ కూడా బయటికి వస్తుంది. ఇదే కళ్లకు చిరాకు కలిగించి కన్నీరు పెట్టిస్తుంది. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెబుతారు. మన ఇళ్లలో ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువగా వుంటారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహారవిలువలు కూడా ఎన్నో ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే ఆహారవిలువలు ఉల్లికారాన్ని బట్టీ, పక్వానికి వచ్చిన స్థితిని బట్టీ, ఎంతకాలం నిల్వ ఉన్నదన్నదాన్ని బట్టీ మారిపోతుంటాయి.

ఇంతటి మహత్తరమున్న ఉల్లిగడ్డలను భారతీయులు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే వాడుతున్నారు. భారతదేశంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరవూపదేశ్, ఒడిశా, కర్నాటక, తమిళనాడు, మధ్యవూపదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్‌లలో ఈ ఉల్లిగడ్డలు ఎక్కువగా పండుతున్నాయి. పచ్చివి తిన్నా, ఉడకబెట్టి తిన్నా, ఫ్రైం చేసుకున్నా, రోస్ట్ చేసుకున్నా... కూరలకు అదనపు ఫ్లేవర్‌ను యాడ్ చేస్తుంది ఉల్లిగడ్డ. సూప్స్ తయారీలో కూడా ఉల్లిది ప్రధాన పాత్ర.

Onion

శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిగడ్డ ఆస్త్మా రాకుండా నివారించగలుగుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. కళ్లకు మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కీళ్లకు, గుండెకు కూడా మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు తినడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు... రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే అతి తక్కువ ధరలో దొరికే ఉలిగడ్డలను వైద్య, ఆరోగ్య సంస్థలు ట్యాబ్లెట్స్ తయారీలో వాడుతున్నాయి. అంతేకాదు బ్యాక్టీరియా నుంచి వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్, డయేరియా రాకుండా కాపాడుతుంది. మనషుల శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించగల యాంటీఆక్సిడెంట్స్ ఉందులో పుష్కలంగా ఉన్నాయి.

ఉల్లిపాయలో మినిరల్ (క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్)పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. నోటి నంచి దుర్వాసన వస్తుందని కొద్దిమంది తినడానికి అంతగా ఇష్టపడరు. అటువంటి వారు ఇందులోని వైద్యపరమైన విలువైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే ఉల్లిపాయ తినకుండా ఉండరు.

మరి ఉల్లిపాయలో ముఖ్యమైన విలువైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒక సారి చూద్దాం..

ఓరల్ హెల్త్(దంతాల ఆరోగ్యానికి) మంచిది:

ఓరల్ హెల్త్(దంతాల ఆరోగ్యానికి) మంచిది:

దంతక్షయాన్ని మరియు దంతాల్లోని ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి ఉల్లిపాయల ముక్కలను నోట్లో వేసుకొని 2-3 నిముషాలు నమలడం వల్ల నోటి నలమూలల్లో ఉన్న జర్మ్స్(సూక్ష్మక్రిములు)దంత సంబంధ క్రిముల్ని నశింప చేస్తాయి. పంటినొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చేరువలో చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది.

హృదయ రోగాల చికిత్స:

హృదయ రోగాల చికిత్స:

ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాన్నింటికి ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. మరియు రక్తం గడ్డకట్టకుండా, రక్తకణాలను నుండి ఎరరక్తకణాలను నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు లేదా కార్డియో వాస్కులార్ వ్యాధులు దారి తీయవచ్చు. గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది.

మెరిసే చర్మం:

మెరిసే చర్మం:

మొటిమలు మచ్చల నివారణకు ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసాన్ని సమపాళ్ళలో తీసుకొని మిక్స్ చేసి, ముఖానికి పట్టించడం వల్ల మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. మొటిమలను తొలగించడంలో ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ గా చెప్పవచ్చు.

దగ్గు నివారిస్తుంది:

దగ్గు నివారిస్తుంది:

ఉల్లిపాయ రసం మరియు తేనె రెండింటిని సమభాగంలో తీసుకొని రెండూ బాగా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి మరియు దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

కీటక నివారినిగా ఉపయోగించవచ్చు:

కీటక నివారినిగా ఉపయోగించవచ్చు:

కీటకాలు కుట్టినప్పుడు ఉదా: తేనె కుట్టినప్పుడు తక్షణ నొప్పి నివారినిగా ఉల్లిపాయ రసాన్ని ఆ ప్రదేశంలో అప్లై చేయాలి. తాజా ఉల్లిపాయ రసం లేదా పేస్ట్ పురుగులు కుట్టడం మరియు తేలు కుట్టడం కోసం బాహ్యంగా అప్లై చేయడం కోసం ఉపయోగించవచ్చు.

క్యాన్సర్ నివారణ:

క్యాన్సర్ నివారణ:

ఉల్లిపాయలు విజయవంతంగా క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగించే చురుకైన సమ్మేళనాలను ఉల్లిపాయ సమృద్ధిగా కలిగి ఉంది.

చెవినొప్పి నుండి ఉపశమనం:

చెవినొప్పి నుండి ఉపశమనం:

ఉల్లిపాయ రసం కొన్ని చుక్కల నిజానికి తీవ్రమైన చెవినొప్పి బాధపడుతున్న వ్యక్తులకు అత్యంత ప్రయోజనకరమైనది చూపవచ్చు. చెవులు గింగురుమంటున్నప్పుడు ఉల్లిరసాన్ని దూది మీద పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకుంటే మంచిది.

లైంగిక డ్రైవ్ పెంచడానికి:

లైంగిక డ్రైవ్ పెంచడానికి:

ఉల్లిపాయలు ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం తపన పెంచడానికి సహాయపడుతుంది. ఒక టేబు స్పూన్ ఉల్లిపాయ రసం మరియు అల్లం రసం ఒక టేబుల్ స్సూప్ మిక్స్ చేసి రోజులో 3సార్లు తీసుకుంటే కామాతురత మరియు సెక్స్ డ్రైవ్ పెంచడానికి సహాయపడుతుంది. ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంచుతాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచటంలో వెల్లుల్లి తర్వాత ఉల్లి రెండో స్థానంలోకి వస్తుంది. ఇది సెక్సు కోర్కెను పెంచటమే కాకుండా జననేంద్రియాలను పటిష్టం చేస్తుంది కూడా. తెల్ల ఉల్లిని పొరలుగా చీల్చి, దంచి, వెన్నతో కలిపి వేయించుకుని స్ఫూను తేనెతో కలిపి ఖాళీ కడుపుతో ఆ మిశ్రమాన్ని క్రమంగా తీసుకుంటే అది అధ్బుతమైన సెక్సుటానిక్‌గా పనిచేస్తుంది.

రక్తహీనతకు చికిత్స వంటిది:

రక్తహీనతకు చికిత్స వంటిది:

ఉల్లిపాయను, పటిక బెల్లం మరియు నీటితో కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత పరిస్థితుల నుండి బయటపడవచ్చు. అలాగే ఉల్లిపాయలు తినడం ద్వారా రక్తం అభివృద్ధి చేయవచ్చు. ఉల్లిలోని ఐరన్‌ని మనశరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ చాలా మంచిది.

పొట్ట నొప్పి నుంచి ఉపశమనాన్ని:

పొట్ట నొప్పి నుంచి ఉపశమనాన్ని:

ఉల్లిపాయలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉండటం వల్ల, స్టొమక్ అప్ సెట్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరియు గ్యాస్ట్రో సిండ్రోమ్ సంబంధిత నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మూత్రకోశ వ్యాధులు:

మూత్రకోశ వ్యాధులు:

మూత్రవిసర్జన సమయంలో మూత్రంలో మంట, నొప్పితో బాధపడే వారికి, ఉల్లిపాయలు గణనీయమైన ఉపశమనం అందిస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారు ఉల్లిపాయలు నీటిలో వేసి బాగా మరిగించి 6-7గ్రాముల నీటిని తప్పనిసరిగా తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

ఆస్త్మా:

ఆస్త్మా:

ఉల్లిపాయలో సల్ఫర్ రిచ్ కాంపౌండ్స్ కలిగి ఉంది: వైద్య అధ్యయనాలు ఈ సల్ఫర్ సమ్మేళనాలు బహుశా ఒక ఆస్త్మా పరిస్థితి దారి తీసే జీవరసాయన గొలుసు నిర్మాణాన్ని(బయోకెమికల్ చెయిన్ ఫార్మేషన్) నిలిపివేస్తుందని బహిర్గతం చేసింది. ఎక్కువ దగ్గతో బాధపడే రోగిలో దగ్గు వల్ల నోట్లో తడి ఆరిపోవడం సహజం. ఇలా తడి ఆరిపోకుండా నోటిని ద్రవీభన సౌకర్యాలను అంధిస్తుంది. చలనం లేని రోగి తిరిగి కోలుకొనేలా చేయడంలో మరియు శక్తిని తిరిగి పొందడానికి ఉల్లిపాయ రసాన్ని వారికి అప్లై చేస్తారని చెప్పబడింది.

జాండీస్:

జాండీస్:

కామెర్ల వ్యాధిను నివారిస్తుంది: ఉల్లిపాయ ముక్కలను నాల్గింటిని తీసుకిని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం చిటికెడు ఉప్పు మరియు చిటికెడు పెప్పర్ వేసి తాగాలి. ఇది ఒక పాత పద్ధతి అయినా మంచి ఫలితం ఇస్తుంది.

కొలెస్ట్రాల్ :

కొలెస్ట్రాల్ :

ఉల్లిపాయ బ్లడ్‌ కొలెస్టరాల్‌ లెవల్స్ ను తగ్గిస్తుంది.

పైల్స్ నివారణ:

పైల్స్ నివారణ:

పైల్స్‌తో బాధపడుతున్న వారు 30 గ్రాముల ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి, అందులో 60 గ్రాముల పంచదార కలుపుకుని రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిస్తుంది:

మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిస్తుంది:

మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడితే ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి ప్రతిరోజూ ఉదయంపూట తింటే రాళ్లు కరిగిపోతాయి.

శరీరంలో వేడిని తగ్గిస్తుంది:

శరీరంలో వేడిని తగ్గిస్తుంది:

శరీరంలో ఉన్నట్లుండి ఏర్పడే వేడిని వెంటనే తగ్గించుకోకపోతే చాలా ప్రమాదం. ముఖ్యంగా వేసవి కాలంలో వేడి చేస్తే ఉల్లిపాయ గుజ్జును మీ పాదాలకు మరియు మెడ మీద అప్లై చేయాలి. ఇది మొత్తం శరీరానికి కూలింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది.

క్రమమైన రుతుక్రం కోసం:

క్రమమైన రుతుక్రం కోసం:

రెగ్యులర్ పీరియడ్స్ పొందాలంటే ఉల్లిపాయ రసంలో బెల్ల కలిపి, జ్యూస్ లా తయారు చేసి తాగాలి. రెగ్యులర్ పీరియడ్స్ పొందడానికి ఇది చాలా సహాజసిద్దమైన పద్దతి.

ఆర్థరైటిస్ నొప్పి:

ఆర్థరైటిస్ నొప్పి:

నిమ్మరసంలో కొన్ని నువ్వుల గింజలు వేసి వేడి చేయాలి. గోరువెచ్చగా మారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మీకు నొప్పి కలిగించే జాయింట్స్ లో అప్లై చేయాలి. ఉల్లిపాయలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్ధరైటిస్ నొప్పి నివారినిగా సహాయపడుతుంది.

కాలిన గాయాలను నయం చేస్తుంది:

కాలిన గాయాలను నయం చేస్తుంది:

కాలిన చిన్న చిన్న గాయలను నివారించడానికి ఇది ఒక మంచి పరిష్కార మార్గం. కాలిన ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని అప్లై చేస్తే చల్లబరుస్తుంది, బొబ్బలు నిరోధిస్తుంది మరియు కాలిపోయిన చర్మంకు అంటురోగాలు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.

English summary

Health Benefits of Onions

Some of the health benefits of onions include their role in substantially relieving a number of diseases including the common cold, asthma, bacterial infections, respiratory problems, angina, and cough.
Desktop Bottom Promotion