For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో అనేక సమస్యలకు పరిష్కారం పీనట్ బటర్

|

పీనట్ బటర్ లో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. సాధరణంగా పీనట్ బటర్ చూడగానే ఇది అనారోగ్యం అని దీన్ని పక్కకు పెట్టేస్తుంటారు చాలా మంది. చాలా మంది తల్లిదండ్రులు పీనట్ బటర్ తినడం వల్ల శరీరానికి అనారోగ్యంతో పాటు, అధిక బరువు కారణం అవుతుందని పిల్లలకు కూడా పెట్టకుండా దూరంగా ఉంచుతారు.

కానీ పిల్లలకు ఈ క్రీమీ పీనట్ బటర్ రుచి అంటే చాలా ఇష్టం. కానీ పిల్లలకు వీటిని దూరంగా ఉంచుతారు. తినకూడదను చెబుతుంటరు . అయితే, పీనట్ బటర్ లో కూడా కొన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయని ఆరోగ్యనిపుణులు అభిప్రాయం. పీనట్ బటర్ లో ప్రోటీనులు మరియు కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటాయని. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతారు.

ముఖ్యంగా పిల్లలకు, సహజంగా శక్తి పొందాలంటే పీనట్ బటర్ తో ట్రీట్ చేయాల్సిందే. ఇది పిల్లకు చాలా మంచిది. పిల్లల్లో తగినంత ఎనర్జీని పెంచడం మాత్రమే కాదు, ఇతర రకాలుగా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి, పీనట్ బటర్ లోని కొన్ని ఆరోగ్యప్రయోజనాలను క్రింది విధంగా వివరించబడింది. కాబట్టి, మీ పిల్లలు పీనట్ బటర్ తినడానికి ఇష్టపడుతుంటే, అప్పుడు వారికి వివిధ రకాలుగా పీనట్ బటర్ ను అంధించడం మంచిది. ఈ పీనట్ బటర్ ను తినడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అయితే ముందుగా పీనట్ బటర్ యొక్క ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకోండి...

మలబద్దకం:

మలబద్దకం:

పీనట్ బటర్ వల్ల ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్, ఇది మలబద్దకాన్ని చాలా సులభంగా నివారిస్తుంది. మీ పిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే పీనట్ బటర్ శాండ్విచ్ అందివ్వడం ఒక ఉత్తమ మార్గం.

ఎనర్జీ పెంచుతుంది:

ఎనర్జీ పెంచుతుంది:

స్కూల్ కు వెళ్ళే పిల్లలకు అధిక శక్తి చాలా అవసరం. అందుకే పీనట్ బటర్ పిల్లలకు అవసరం అయ్యే ఎనర్జీని అంధిస్తుంది. అందువల్ల, ఈ క్రీమ్ బటర్ ను ఉదయం ఇచ్చే ఆహారంలో జోడించి ఇవ్వడం వల్ల రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉంటారు.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లలప్పుడే కంటిచూపులో లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న వయస్సు నుండే పిల్లలు కంటి అద్దాలను వినయోగిస్తున్నారు . అందువల్ల అధిక ప్రోటీనులున్న పీనట్ బటర్ పిల్లలకు అంధివ్వడం వల్ల కంటిచూపును మెరుగుపరుస్తుంది.

ఎముకలను బలోపేతం చేస్తుంది:

ఎముకలను బలోపేతం చేస్తుంది:

పీనట్ బటర్ లోని మరో హెల్త్ బెనిఫిట్, ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల, పిల్లల్లో ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.

జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది:

జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది:

పీనట్ బటర్ ను పిల్లలకు అందివ్వడానికి ప్రధాన కారణం పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది . పిల్లలకు ఇచ్చే టాప్ సూపర్ ఫుడ్స్ లో పీనట్ బటర్ ఒకటి.

ఆకలిని పెంచుతుంది:

ఆకలిని పెంచుతుంది:

పిల్లల్లో ఆకలిని పెంచడానికి సహాయపడుతుంది. భోజనం తినకుండా మారాం చేసేవారికి పీనట్ బటర్ ఒక మంచి పరిష్కారం.

బరువు పెంచుతుంది:

బరువు పెంచుతుంది:

మీ పిల్లలు ఉండాల్సిన దానికి కన్నా తక్కువ బరువు ఉన్నప్పుడు, పీనట్ బటర్ లో ఉన్న మంచి కొవ్వులు బరువు పెరగడానికి సహాయపడుతుంది.

పోషణ అంధిస్తుంది:

పోషణ అంధిస్తుంది:

పీనట్ బటర్ యొక్క ఉత్తమ ఆరోగ్య ప్రయోజనం పిల్లలకు ఒక మంచి పోషకాహారాన్ని అంధిస్తుంది . ఇందులో ఉండే మంచి కార్బోహైడ్రేట్స్, బాగా సహాయపడుతాయి .

స్టొమక్ ప్రాబ్లెమ్స్:

స్టొమక్ ప్రాబ్లెమ్స్:

పిల్లల్లో ఉదర సమస్యలు: కడుపు నొప్పి, లూజ్ మోషన్ మరియు ఇతర సమస్యలను చాలా తేలికగా నయం చేస్తుంది . చాలా మంది పిల్లలు ఇటువంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతుంటారు. కాబట్టి పీనట్ బటర్ ఉత్తమ పరిష్కార మార్గం.

ఏకాగ్రత:

ఏకాగ్రత:

ఉదయం పూట మాత్రమే పీనట్ బటర్ ను పిల్లకు ఎందుకు ఇవ్వాలంటే, పిల్లల్లో ఏకాగ్రతను మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

English summary

Health Benefits Of Peanut Butter

The health benefits of peanut butter are many in number but we usually push it aside thinking that it is unhealthy for us to consume. There are a lot of parents who feel that peanut butter will only lead to weight gain which is unhealthy for the body.
Story first published: Friday, December 13, 2013, 17:28 [IST]
Desktop Bottom Promotion