For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందట!

|

మీలో ఉన్న అన్ని ఆరోగ్యసమస్యలను దూరం చేసే ఒక అద్భుత ఔషదం గుమ్మడి, గుమ్మడి గింజలు చాలా మంది. గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిల్లు ఉంటుందా?ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి. ఇటువంటలకు అద్భుతమైన రుచి, అటు ఆనారోగ్యాలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడే ఈ గుమ్మడిని ఉపయోగించేటప్పుడు గుమ్మడి కాయను కట్ చేసుకొని, గింజలను పారేస్తుంటారు. అయితే ఆ పారేవేసే గుమ్మడి గింజల్లోని వైద్యపరమైన ఔషధ గుణగణాలు తెలుసుకొన్నాక ఆశ్చర్యపడక తప్పదు. ఎందుకంటే, ఈ అద్భుతమైన ప్రయోజనాలు చాలా మందికి తెలిసుండకపోవచ్చు.

గుమ్మడి మరియ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఇందులో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడిలో విటమిన్ ఎ, సి, ఇ, కె లు మరియు యాంటీయాక్సిడెంట్స్, ఇంకా జింక్ మరియు పుష్కలమైనటువంటి మెగ్నీషియం ఉండి మొత్తం శరీర ఆరోగ్యనాకి మేలు చేస్తుంది.

ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, మరియు క్యాన్సర్ వంటి జబ్బులతో బాధపడుతుంటారో అటువంటి వారికి, ఈ ఆరోగ్యకరమైన గుమ్మడి గింజలు బాగా సహాయపడుతాయి. వీటిని వారి యొక్క రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. గుమ్మడి గింజలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గింజలను ఒలిచి లోపల ఉన్న పప్పును తినవచ్చు. లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడి చేసి, పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదంటే, రోజంతా అప్పుడప్పుడు గుమ్మడి గింజలను కొరుకుతుండటం కూడా అరోగ్యకరమే. ఈ గింజల విషయంలో తప్పకుండా గుర్తుంచుకోదగ్గ మరో ముఖ్య విషయమేమిటంటే, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకానికి గురికావల్సి ఉంటుంది. కాబట్టి, గుమ్మడి గింజలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొనే వారు, ఎక్కువగా నీళ్ళు, పండ్ల రసాలు తీసుకోవాలి.

గుమ్మడి గింజల్లోని కొన్ని ఆరోగ్యప్రయోజనాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా మీకందిస్తున్నాం వాటిని పరిశీలించి వాటి ప్రయోజనాలు తెసుకొని ఆరోగ్యంగా జీవించండి...

ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది :

ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది :

ప్రస్తుత రోజుల్లో మరణాల రేటు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక కారణం అవుతోంది. కఠినమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల, నిద్రలేమి, పనిభారం వల్ల చాలా మంది అధిక ఒత్తిడికి గురౌతున్నారు. అయితే ఈ ఒత్తిడిని జయించడానికి ఒక పవర్ ఫుల్ ట్రీట్మెంట్ లా పనిచేస్తాయి గుమ్మడి గింజలు. ఈ గింజల్లో యాంటీ స్ట్రెస్ న్యూరోకీమా లక్షణాలు పుష్కలంగా ఉండటం చేత ఇవి, అలసట, ఒత్తిడి మరియు ఇతర సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

బోలు ఎముకల వ్యాధి, ముసలితనంలో ఎముక మెత్తబడుట:

బోలు ఎముకల వ్యాధి, ముసలితనంలో ఎముక మెత్తబడుట:

ఓస్టియోపోరోసిస్(బోలు ఎముకల వ్యాధి)ఈ వ్యాధితో ఎవరైతే బాధపడుతుంటారో, అటువంటి వారు తప్పని సరిగా గుమ్మడి గింజలను తీసుకోవడం ఉత్తమం. వీటిని రెగ్యులర్ గా తీసుకోవాలి. ఎందుకంటే గుమ్మడి గింజల్లో అత్యధికంగా జింక్ ఉండటం వల్ల ఇది, ఎముకలకు చాలా మేలు చేస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు బోలు ఎముకల వ్యాధితో పోరాడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

మన సమాజంలో ప్రాణాంతక వ్యాధిగా విస్తరిస్తున్న మరో జబ్బు, క్యాన్సర్. క్యాన్సర్ నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారంను తీసుకోవడం వల్ల మన జీవిత కాలన్ని మరింత పెచుకొని, ఆరోగ్యకరంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా ఉపయోగపడుతాయి. క్యాన్సర్ లో ఎటువంటి క్యాన్సర్ అయినా సరే గుమ్మడి గింజలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్లను నివారించగలిగే రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. గుమ్మడి ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది.

మధుమేహం:

మధుమేహం:

డయాబెటీస్ రాకుండా ఉండేందుకు , వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది . గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారిలో కిడ్నీ ఆరోగ్యానికి కూడా కాపాడుతుంది.

కిడ్నీఆరోగ్యానికి:

కిడ్నీఆరోగ్యానికి:

కిడ్నీ సమస్యలతో బాధపడే వారు, వారంలో కనీసం రెండు మూడు సార్లు గుమ్మడి గింజలను తీసుకోవడం చాలా ఉత్తమం. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను సహజంగానే కరిగించడానికి సహాయపడుతుంది.

నొప్పిని నివారిస్తుంది:

నొప్పిని నివారిస్తుంది:

గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వివిధ రకాల నొప్పులను మరియు బాధల నుండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నివారిస్తాయి.

పిక్కీ ఈటర్స్(ఎక్కువగా తినేవారి ఆకలిని అదుపులో ఉంచుతుంది:

పిక్కీ ఈటర్స్(ఎక్కువగా తినేవారి ఆకలిని అదుపులో ఉంచుతుంది:

చాలా మంది పిల్లలు, అలాగే కొంత మంది పెద్దలు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి అదే పనిగా తింటుంటారు. ఆకలి ఉన్నా లేకున్నా తింటుంటారు. అటువంటి వారికి గుమ్మడి గింజలు బాగా సహాయపడుతాయి. వీటిని తరచూ తింటుంటే ఆకలి ఎక్కువగా అనిపించక, కడుపు నిండుగా ఉండేట్లు భావన కల్పిస్తుంది.

సూపర్ ఫుడ్:

సూపర్ ఫుడ్:

సూపర్ ఫుడ్స్ లిస్ట్ లో గుమ్మడి గింజలను టాప్ లో ఉంచవచ్చు. ఎందుకంటే, వర్కౌట్స్ ముందుగా ఒక గుప్పెడు గుమ్మడి గింజలను తినడం వల్ల మీ ఎనర్జీ లెవల్స్ అమాంతంగా పెంచుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి:

గుండె ఆరోగ్యానికి:

గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు గుమ్మడి గింజలను తినడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఈ గుమ్మడి గింజలు హార్ట్ పేషంట్స్ రెగ్యులర్ గా తినడం వల్ల గుండె మరియు కొరోనరీ ఆర్టరీ వ్యాధి నివారించుకోవడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

English summary

Health Benefits Of Pumpkin Seeds

One of the best ways to get rid of all your health problems is by consuming pumpkin seeds. This Halloween make sure you svae up all your seeds when you decorate your pumpkin, it will come in handy.
Desktop Bottom Promotion