For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

60సెకెండ్లలో పొందగలిగే మహత్తర ఆరోగ్యపు అలవాట్లు

|

మీరు మంచి ఆరోగ్యం పొందటానికి చాలా సమయం పడుతుంది అనుకుంటే, మీరు 60 సెకండ్లలో మంచి ఆరోగ్యపు అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని పొందవొచ్చు.

మీ సీటు బెల్ట్ పెట్టుకోవటం నుండి మరియు మీ చేతులు కడుక్కోవటం వరకు ఆరోగ్యంగా ఉండటానికి మీరు అనుకున్నదానికన్నా తక్కువ సమయమే పడుతుంది. అనుకూల మరియు ప్రతికూల ఎంపికలను ప్రతి రోజు మీరే బేరీజు వేసుకుని అనుసరించాలి. ఇక్కడ మీ ఉత్తమమైన ఆరోగ్యాన్ని సాధించడానికి సహాయపడే ఎనిమిది మంచి అలవాట్లను పొందుపరుస్తున్నాము. అనుసరించండి.

మీ షూస్ గుమ్మం వద్దే వదిలివేయండి

మీ షూస్ గుమ్మం వద్దే వదిలివేయండి

గుమ్మం వద్దే మీ పాదరక్షలు తొలగించడం వలన ధూళి, రాళ్ళు మరియు రసాయనాలు మరియు శక్తివంతమైన అలెర్జీ కారకాల వరకు ప్రతిదానిని మీ ఇంట్లోకి ప్రవేశించకుండా నివారించవొచ్చు. కనుక, ఈ పురాతన ఆచారం నుండి, మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవొచ్చు మరియు బాహ్య కలుషితాల నుండి రక్షించుకోవొచ్చు.

మీ చేతిలోనే తుమ్మండి

మీ చేతిలోనే తుమ్మండి

మీ వద్ద ఒక టిష్యూ లేదా ఒక రుమాలు లేకపోతే, మీ నోరు మరియు ముక్కును కవర్ చేసుకోవలసి వొస్తే మీ మోచేతి మీద కాని లేదా ఎగువ చేతిలో కాని దగ్గండి లేదా తుమ్మండి. మీ చేతులు ఉపయోగించి చుట్టూ సూష్మక్రిములు వ్యాప్తి చెందకుండా నివారించవొచ్చు. మీ ముక్కును కవర్ చేయటం వలన క్రిములతో నిండిన తుంపరలను గాలి లోకి విడుదల చేయకుండా నివారించవొచ్చు లేదా కవర్ చేసుకోకపోవటం వలన ఆ తుంపరలు భూమి ఉపరితలం పైన కాని లేదా వేరేవారి పైన పడవొచ్చు. దానివలన వారికి హాని కలగవొచ్చు.

మీ కళ్ళకు విరామం ఇవ్వండి

మీ కళ్ళకు విరామం ఇవ్వండి

పలువురు ఆఫీసులకు వెళ్లేవారు మరియు విద్యార్థులు రోజులో ఎక్కువ గంటలు కంప్యూటర్ స్క్రీన్ల ముందు గడపటం వలన వొచ్చే మిరుమిట్లుగొలిపే కాంతి, భంగిమ మాంద్యం,పేలవమైన లైటింగ్ వలన వారి కళ్ళకు అలసట మరియు తలనొప్పి రావటానికి కారణం అవుతున్నది. కంప్యూటర్ తెర నుండి మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ పనిచేయాలి. కంటి నిపుణులు "20-20-20 నియమాన్ని" సిఫార్సు చేస్తున్నారు. మీ కంప్యూటర్ వద్ద నుండి ప్రతి 20 నిమిషాలకొకసారి, కనీసం 20 సెకన్ల విరామం తీసుకుని, 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువుమీద మీ దృష్టిని కేంద్రీకృతం చేయండి. మీ కళ్ళ దృష్టిని మలపటం ద్వారా వేరేవాటి మీద దృష్టి నిలపగలుగుతారు. మీ చేతుల్ని గాలిలో నిలపటం మరియు నిలబడటం వలన మీ శరీరంలో రక్త ప్రవాహం వేగవంతమవుతుంది.

సంవత్సరం పొడవునా సన్ స్ర్కీన్ అప్లై చేస్తుండాలి

సంవత్సరం పొడవునా సన్ స్ర్కీన్ అప్లై చేస్తుండాలి

ఒక క్రమ పద్ధతిలో సన్స్క్రీన్ వర్తింపచేయటం వలన కేవలం చర్మం లేత గోధుమ రంగులోకి మారకుండా రక్షింపబడుతుంది, కాని శరీరం మీద కనిపించే వృద్ధాప్యచిహ్నాల నుండి మరియు చర్మ క్యాన్సర్ ప్రమాదం బారిన పడకుండా కూడా సహాయపడుతుంది. కావున, వర్షం లేదా సూర్యరశ్మి ఉన్నా, మీ దినచర్యలలో ఒక భాగంగా సన్ స్క్రీన్ లోషన్ ఆపాదించుకోవటాన్ని కూడా చేర్చండి.

నీరు ఎక్కువగా త్రాగండి

నీరు ఎక్కువగా త్రాగండి

రోజులో ఎనిమిది గ్లాసుల నీటిని తీసుకోవటం తప్పనిసరి, కాని మీరు తీసుకునే నీటిని లెక్కలోకి తీసుకోవటం మంచిది కాదు. మీ శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. శరీరంలో ఉన్న ఈ ద్రవాలు జీర్ణక్రియ, శోషణ, ప్రసరణ, లాలాజల సృష్టి, పోషకాలను రవాణా, మరియు శరీర ఉష్ణోగ్రత నిర్వహణ వంటి విధులను నిర్వహిస్తాయి. మీ జీర్ణ వాహికతో పాటు ప్రవహించే పనులను చేయటానికి తగినంత ఆర్ద్రీకరణలో ఉంచుతుంది మరియు మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. మీ శరీరంలో తగినంత నీరు లేనప్పుడు,పెద్దప్రేగు హైడ్రేషన్ ను నిలుపుకోవటానికి మలం నుండి నీరు తీసుకుంటుంది - మరియు ఫలితంగా మలబద్ధకం ఏర్పడుతుంది.

మైక్రోవేవ్, వంటగది స్పాంజితో శుభ్రం చేయండి

మైక్రోవేవ్, వంటగది స్పాంజితో శుభ్రం చేయండి

సహజంగా ఇంట్లో టాయిలెట్ సీటు అత్యంత క్రిమి-స్థావరంగా అనుకుంటుంటారు, కాని అధ్యయనాలు వంటగది స్పాంజ్ అత్యంత క్రిమి-స్థావరంగా ఉంటుందని చెపుతున్నాయి. పప్పు లేదా సబ్జీ వ్యర్ధం శుభ్రం చేయడానికి ఒక వంటగది స్పాంజ్ తరచుగా ఉపయోగించటం అలాగే, దాని తేమ మరియు పోరస్ నిర్మాణం వలన నిలవ ఆహారం వలన కలిగే బాక్టీరియా మరియు బూజు తయారు అవుతుంది. క్రిముల వ్యాప్తిని అరికట్టటానికి, తడిగా ఉన్న వంటగది స్పాంజ్ ని ప్రతిరోజూ సాయంత్రం 45 సెకన్లపాటు మైక్రోవేవ్ లో ఉంచండి.

మీరు కోపంగా ఉన్నప్పుడు 20 అంకెలు లెక్కపెట్టండి

మీరు కోపంగా ఉన్నప్పుడు 20 అంకెలు లెక్కపెట్టండి

మీరు కోపంగా ఉన్నప్పుడు 20 అంకెలు లెక్కపెడుతూ,అంకెకు అంకెకు మధ్య మీ శ్వాసను లోతుగా పీలుస్తుం డండి. ఈ సులభమైన టెక్నిక్ మీ కోపాన్ని తగ్గిస్తుంది మరియు మీ నరాల తీవ్రతను తగ్గిస్తుంది. నెమ్మదిగా, లోతైన శ్వాసను తీసుకోవటం వలన మీ నరాల వ్యవస్థ తీవ్రత తగ్గి, మీకు చాలా హాయిగా ఉంటుంది.

మీ నాలుకను బ్రష్ చేయండి

మీ నాలుకను బ్రష్ చేయండి

దంత క్షయం మరియు గమ్ వ్యాధిని నివారించటానికి రోజు బ్రష్ చేసుకోవటం తప్పనిసరి. అయితే,మీ నోటిని శుభ్రంగా ఉంచుకోవటానికి, మీ నాలుకను శుభ్రపరచుకోవటం కూడా ఒక భాగమే. పంటి సంబంధ వ్యాధుల వలన మీ నోటి ఆరోగ్యానికి ముప్పు మాత్రమే కాదు, కానీ దాని ప్రభావం నోటి ద్వారా మొత్తం ఆరోగ్యం మీద చూపుతుందని పరిశోధనలు చెపుతున్నాయి.

English summary

Healthy habits you can acquire in 60 secs


 If you think good health takes time to build, follow healthy habits that you can acquire in less than 60 seconds.
Desktop Bottom Promotion