For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాలు నొప్పులకు కారణాలు..నివారణ

|

మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమతేకపోవడం వంటి కారణాల వల్ల వర్తమాన సమాజంలో నిడివయసుకు ముందే చాలా మంది మోకాలు నొప్పి బారిన పడుతున్నారు. శరీర కదలికలకు అత్యంత కీలకమైన మోకాలు నొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది కీళ్ల వాతానికి, ఇతర కీళ్ల సమస్యలకు దారితీయవచ్చు. మోకాలు నొప్పికి ఆయుర్వేద మోకాలు నొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది కీళ్లవాతానికి, ఇతర కీళ్ల సమస్యలకు దారితీయవచ్చు. మోకాలు నొప్పికి ఆయుర్వేద చికిత్సలు చక్కని ఫలితాలు ఇస్తాయి.

శరీర కదలికలు పూర్తిగా మోకాలి పైనే ఆధారపడి ఉంటాయి. దీని నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. తొడ ఎముక కింద ఉండే ఎముక (టిబియా)తో ఒక పలుచని మృదులాస్థి ద్వారా కలిసి ఉంటుంది. దీన్ని ఆవరించి పెటెల్లా అనే చిన్న ఎముక తొడుగులా కప్పబడి ఉంటుంది. మోకాలి కదలికలు సాఫీగా జరిగేందుకు వీలుగా ఈ జాయింట్ మధ్యలో ద్రవం ఉంటుంది. దీన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. దీన్ని కాపాడుతూ కండరాలు, స్నాయువులు కూడా ఉంటాయి.

How to avoid Aches and Pains in Knees

మోకాలు నొప్పులకు కారణాలు
సామాన్యంగా వయసు పైబడటం వల్ల కీళ్లలో అరుగుదల ఉంటుంది. అందువల్ల మోకాలి నొప్పి రావచ్చు. అధిక బరువు కలిగివుండటం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, కింద పడినప్పుడు లేదా దెబ్బలు తగలడం, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల వల్ల, క్రీడాకారులకు దెబ్బలు తగిలినప్పుడు మోకాలి నొప్పి రావచ్చు. మోకాలినొప్పులు చాలా రకాలుగా ఉన్నా ఎక్కువ మందిని బాధించేవికీళ్లవాతం, సంధివాతం.కీళ్లవాతాన్ని ఆమవాతం అని కూడా అంటారు. ఇది మోకాలిలోనే కాకుండా ఏ కీలులోనైనా రావచ్చు. వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడు వస్తుంది. కీళ్లవాపు, వేడిగా ఉండటం, కీళ్లు పట్టేసి సరిగ్గా కదల్చలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కీలును ఆవరించి ఉండే మృదులాస్థి అరిగిపోవడం వల్ల వచ్చేది సంధివాతం. విపరీతమైన మంట, పోట్లతో కూడిన నొప్పి దీని ప్రధాన లక్షణం. ఎక్కువ దూరం నడవలేకపోవడం, కింద కూర్చుని లేచేటప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది.

నివారణ
మోకాలి నొప్పిని వ్యాధి ప్రారంభావస్థలోనే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్లలో నొప్పి మొదట్లో కొద్దిగా కనిపించగానే, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వారు తమ జీవనశైలిని తప్పక మార్చుకోవాలి. సమతులాహారం తీసుకోవడం, క్రమబద్ధమైన జీవనం గడపడంతో పాటు ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి. స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేయాలి. పాదాలకు సౌకర్యంగా ఉండే పాదరక్షలనే ఎంచుకోవాలి. బాసిపట్లు వేసుకొని కూర్చోవడం, కింద కూర్చోవడం వంటివి చేయకూడదు. లావెటరీ విషయంలోనూ వెస్ట్రన్ ఉపయోగించడం మేలు.

భవిష్యత్తులో మోకాళ్ల నొప్పులను రాకుండా చేయడానికి లేదా వీలైనంత ఆలస్యం చేయడానికి సైక్లింగ్, ఈత వంటి ఎక్సర్‌సైజ్‌లు, బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఒకేచోట కుదురుగా కూర్చోడాన్ని నివారించడం చేస్తుండాలి. కూర్చున్న చోటే చేసే వ్యాయామంలాగా... కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక కాలిని రోజూ 20-30 సార్లు ముందుకు చాపడం చేస్తూ ఉండాలి. రెండో కాలి విషయంలోనూ అదే వ్యాయామాన్ని చేయాలి. ఇలాంటి జాగ్రత్తలతో మోకాళ్ల నొప్పులను చాలావరకు నివారించవచ్చు.

English summary

How to avoid Aches and Pains in Knees

Nearly everyone has experienced knee pain. Whether it’s caused by arthritis, excessive foot pronation or overuse of the muscles that protect this vulnerable joint, our knees take a knocking.
Story first published: Tuesday, December 24, 2013, 16:51 [IST]
Desktop Bottom Promotion