For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెన్షన్...టెన్షన్.. టెన్షన్ పోగొట్టే పంచసూత్ర..!

|

ప్రస్తుత సమాజంలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిలో తొంభై శాతం ప్రజలు ఒత్తిడి కారణంగా వచ్చే పలు జబ్బులతో బాధపడేవారు వైద్యుల వద్దకు వెళుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. మన శరీరం లేదా మనస్సు ఏదైనా పనిలో లగ్నమై దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమైనప్పుడు మనిషి శరీరంలో మెటబాలిజమ్ అత్యంత వేగంగా పెరుగుతుందని వైద్యులు తెలిపారు. దీంతో రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం పెరిగిపోతుంది. శరీరంలో ఇలా మార్పులు జరగడం వలన శరీరంలో రక్త ప్రవాహం చాలా వేగంగా ప్రవహిస్తుంది.

How To Avoid Tension And Stress

అలాగే శరీరంలో ఎడ్రినల్ శాతం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితి తరచూ వస్తుంటే మానసికంగా, శారీరకంగాను పలు సమస్యలు ఉత్పన్నమౌతాయంటున్నారు వైద్యులు. టెన్షన్ తగ్గించుకోవడానికి 5 మార్గాలున్నాయి అవి ఫాలో అయితే కనుక టెన్షన్ తగ్గించుకోవచ్చు..

1. ఒత్తిడిని తగ్గించే ఆహారం : మన శరీరానికి తగ్గట్టు కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సివుంటుంది. దీంతో శరీరంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. వీటిలో కమలాపండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుండాలి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనిషిలోని మెదడుకు బలాన్ని చేకూర్చుతుంది. బంగాళా దుంపలో విటమిన్ బీ గ్రూపునకు చెందిన విటమిన్లుంటాయి. దీంతో ఒత్తిడిని దూరం చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2. బియ్యం, చేపలు, బీన్స్, ధాన్యాలలో విటమిన్ బీ అధికంగా ఉంటుంది. దీంతో ఇవి ఆహారంగా తీసుకోవడం వలన మెదడుకు సంబంధించిన జబ్బులను నివారించేందుకు ఇవి తోడ్పడతాయి. అలాగే మానసికపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి. ఆకు కూరలు, గోధుమలు, సోయాబీన్, వేరుశెనగ గింజలు, మామిడి పండు, అరటిపండ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వలన శరీరంలోనున్న ఒత్తిడిని తగ్గిస్తాయి.

వీటిని తీసుకోవడంలో మెళుకువలు : ఒత్తిడిని దూరం చేసేందుకు కొద్ది-కొద్దిగా ఆహారాన్ని చాలాసార్లు తీసుకోవాలంటున్నారు వైద్యులు. కొద్ది-కొద్దిగా ఆహారాన్ని తీసుకోవడంతో శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.

3. మనసులో ఏదీ ఉంచుకోకండి: ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒత్తిడికి గురవ్వడం సహజం. దీంతో మీ సమస్య ఏంటో మీ జీవిత భాగస్వామికి తెలపడం ఉత్తమం. లేదా ఏవరైనా మీ సన్నిహితుడు, అత్యంత ఆప్తమిత్రునితో సంభాషించండి. వారితో మీ సమస్య గురించి చర్చించండి. దీంతో మీలోని ఒత్తిడి సగం వరకు మటుమాయమౌతుంది. మిగిలిన సమస్య ఏదైతే ఉందో మీరు తీసుకునే ఆహారం, వ్యాయామం, ప్రశాంతంగా నిద్రకుపక్రమించడంతో తొలగిపోతుంది.

4. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి : ఎవరైతే ఎక్కువ ఒత్తిడికి గురౌతుంటారో వారు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించాలి. కొందరు ఒంటరిగా షికారు కొట్టేందుకు ఇష్టపడుతుంటారు. కొందరికేమో ఒంటరిగా కూర్చుని పుస్తక పఠనం చేసే అలవాటుంటుంది. చాలావరకు చీకటి గదిలో శయనించడంతో మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కాని ఎక్కువసేపటి వరకు ఒంటరిగా ఉండటం కూడా అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. ముఖ్యంగా ఎవరైతే వెంటనే ఒత్తిడికి లోనవుతారో అలాంటి వారు ఒంటరిగా ఉండకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మీ కోసం కాసింత సమయం కేటాయించుకోండి.

5. కాసేపు ధ్యానం చేయండి : ప్రశాంతంగా కుర్చీలోనే కూర్చొని ధ్యానం చేయండి. కళ్ళు మూసుకుని కూర్చోండి. మెలమెల్లగా శ్వాసను తీసుకోండి. మీరు తీసుకునే శ్వాసనే గమనిస్తూ ఉండండి. మధ్యలో అంతరాయం కలిగితే ఆలోచనను మానేయండి. మళ్ళీ యధావిధిగా ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి. ఇలా ప్రతి రోజు పది నుంచి పదిహేను నిమిషాలపాటు ధ్యానం చేయండి.

English summary

How To Avoid Tension And Stress | టెన్షన్...టెన్షన్.. టెన్షన్...!

oping up with tension and stress in this modern society is very essential and here are a few tips to reduce tension and anxiety.
Story first published: Thursday, April 18, 2013, 8:37 [IST]
Desktop Bottom Promotion