For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీసులో పని ఒత్తిడి.. మెడ నొప్పితో సతమతం అవుతున్నారా..!

|

Neck Pain
కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువ సేపు పనిచేసినా.. వంగి రాసినా.. ఒకవైపు భుజంపై బరువు ఎక్కువ వేసినా.. ఇలా ఏదో ఒక సమయంలో మెడనొప్పితో బాధపడని వాళ్లుండరు. ఇలాంటప్పుడు కొంచెం రిలాక్స్ అయితే చాలు.. నొప్పి తగ్గుతుంది. కానీ కొన్నిసార్లు సాధారణ మెడనొప్పే కదా అనుకుంటే దాని వెనుక ఏ డిస్క్ సమస్యే, మరే కారణమో ఉండొచ్చు. అందుకే మెడనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు. మనం నిల్చునే తీరు, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోతే మెడ, వెన్ను, నడుంనొప్పులు మొదలవడం సహజం. వెన్నుపాము పైన ఒత్తిడి ధికంగా పడటమే ఈ నొప్పులకు కారణం. మెదడు తరువాత మెడ నుంచి మొదలైన వెన్నుపాము నడుము భాగం వరకు ఉంటుంది. వెన్నుపాముకు ఇరుపక్కల ఉండే వెన్నుపూసల్లో ఏమైనా సమస్యలు ఎదురైనా ఈ నొప్పులు రావచ్చు. మెడనొప్పి రావడానికి గల ప్రధాన కారణం సరైన భంగిమ లేకపోవడమే.

కీలకం.. డిస్క్‌లు: మెడ దగ్గర ఉండే వెన్నెముకలో ఏడు వెన్నుపూసలుంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్ అనీ, రెండవ వెన్నుపూసను ఆక్సిస్ అనీ అంటారు. ఆ తరువాత 3, 4, 5, 6, 7 వెన్నుపూసలుంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి జాయింట్స్‌గా అమరి ఉంటాయి. వీటిలో స్పైనల్ కెనాల్ ఉంటుంది. దానిద్వారా వెన్నుపాము మెదడు నుంచి కాళ్లూ చేతులకు నరాలను తీసుకెళ్తుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఇంటర్ వర్టివూబల్ పారామినా నుంచి ఒక్కొక్క నరం బయటకు వస్తుంది. ఈ నరాలు ఒక్కో వైపుకి విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండి డిస్క్ అనే మెత్తని పదార్థం యాంత్రిక షాక్స్ నుంచి వెన్నుపామును రక్షిస్తూ ఉంటుది. దీనికి రక్తవూపసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తల బరువును బ్యాలెన్స్ చేయడానికి ఇది దోహదపడుతుంది.

ఈ లక్షణాలుంటే: కొన్ని సందర్భాల్లో తీవ్రమైన మెడనొప్పి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరగడం వల్ల మూత్ర విసర్జన కండరాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా మూత్ర విసర్జనలో తేడాలు వచ్చి ఇతర సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌ల వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూసలో నుంచి మెదడులోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టివూబల్ ధమనులు చిన్న మెదడుకు రక్త ప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ధమనుల రక్తవూపసారంలో తేడాలు వచ్చి మెదడుకు రక్తవూపసారం అంతగా ఉండదు. దీని మూలంగా నొప్పితో పాటు తల తిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతులు కావడం వంటి లక్షణాలుంటాయి. మెడనొప్పి పాకుతూ ఉంటే దాని వెనుక తీవ్రమైన కారణమే ఉంటుందని అనుమానించాలి. మెడ నుంచి భుజాల వైపో, చేతుల చివరలకో నొప్పి పాకుతూ ఉంటే అశ్రద్ధ చేయకూడదు.

వ్యక్తిగత శ్రద్ధ అవసరం:
1. మెడనొప్పి వచ్చినప్పుడు వేడినీటిలో ముంచిన గుడ్డతో మెడపైన కాపాలి. లేదా ఐస్ ముక్కను బట్టలో చుట్టి కాపవచ్చు. ఇలా చేయడం వల్ల సాధారణ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
2. మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అందువల్ల నొప్పి ఉన్నప్పుడు పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
3. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.
4. సాధారణ నొప్పి అయితే పెయిన్‌కిల్లర్ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటితో రోజుకి అయిదారుసార్లు సున్నితంగా మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.
5. బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకుని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. కాబట్టి అటూ ఇటూ మార్చుకుంటూ ఉండాలి. అసలే నొప్పి ఉన్నవాళ్లు ఎక్కువ బరువు మోయకుండా ఉండటం మేలు.
6. నడిచేటప్పుడు ఒక వైపుకే వంగకూడదు.

English summary

How to Prevent Neck Pain...? | మెడనొప్పికి వ్యక్తిగత శ్రద్ద చాలా అవసరం...!

Neck pain, be it caused by bad sleep, bad posture, a sudden twist, or too much stress, is among the most common everyday complaints. Research shows that neck-strengthening exercises may be more important than stretching when it comes to preventing neck pain.
Story first published:Tuesday, March 12, 2013, 12:17 [IST]
Desktop Bottom Promotion