For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్స్ ఊతప్పం: మధుమేహగ్రస్తులకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

|

సాధారణంగా మధుమేహగ్రస్తులకు డైట్ విషయంలో చాలా నియమాలుంటాయి. ఆరోగ్యపరంగా ఇన్సులిన్ అధుపులో ఉంచుకోవడానికి కొన్ని పదార్థాలు తినవచ్చు, కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలు తిని బోరుకొడుతుంటే, తినే వాటినే కొంచెం వెరైటీగా వండింతే మరింత రుచిగా ఉండటమే కాదు, బోర్ అనిపించదు కూడా.
దక్షిణభారత దేశంలో ఊతప్పం అనేది చాలా టేస్టీ బ్రేక్ ఫాస్ట్. ఇది దోసెలాంటిదే. కానీ కొన్ని అదనపు పదార్థాలను, వెజిటేబుల్ ముక్కలను దోసెమీద గార్నిషింగ్ చేయడం వల్ల దోసెకు, ఊతప్పంకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఊతప్పంను కూడా బియ్యం పిండితోనే తయారు చేస్తారు. కానీ మధుమేహగ్రస్తుల ఆరోగ్యం కోసం బియ్యం పిండికి బదులగా ఓట్స్ పొడి ఉపయోగించి టేస్టీగా తయారు చేసి ఊతప్పం ఇది. ఇది చక్కెర వ్యాధిగ్రస్తులకు ఒక మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి, ఇన్సులిన్ సామర్థ్యంను పెంచుతుంది. మరియు టైప్ 2 డయాబెటిస్ తగ్గిస్తుంది. మరియ ఈ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Oats Uthappam: Breakfast Recipe For Diabetics
కావల్సినపదార్థాలు:
గోధుమపిండితో తయారు చేసిన బ్రెడ్: 4పెద్ద ముక్కలు (ప్రాధాన్యంగా మిగిలిపోయినవి)
ఓట్స్: 1cup
సెమోలినా(రవ్వ): ½cup
కుక్కింగ్ సోడా: ½tsp
జీలకర్ర: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
పెరుగు: ½cup
నీటి: 1cup
ఆయిల్: 2tbsp

పైనగార్నిష్ కోసం
క్యారెట్: 1(పైపొట్టుతొలగించి,తురుముకోవాలి)
కాప్సికమ్: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: 1చిన్న ముక్క(తురుముకోవాలి)
పచ్చిమిరపకాయలు: 2 (సన్నగా,చిన్నగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర: 3tbsp(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా బ్రెడ్ స్లైస్ చివర్లు ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ ను తొలగించండి. తర్వాత ఓట్స్ బ్రెడ్ ను పొడిచేసి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో గార్నిష్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఓట్స్-బ్రెడ్ పొడి, రవ్వ, సోడా, ఉప్పు, జీలకర్ర, పెరుగు అన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి అన్నింటిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే నీళ్ళు పోసి దోసె పిండిలా జారుడుగా కలుపుకోవాలి.
4. తర్వాత నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి వేసి వేడి చేసి, ఒక గరిట నిండుగా పిండితీసుకొని దోసెలా వేయాలి.
5. తవా మొత్తం పిండిని దోసెలా సర్ది, పైన, దోసె చివర్లలో కొద్దిగా నూనెను చిలకరించి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
6. తవామీద దోసె వేసిన ఒక నిముషంలోనే గార్నిషింగ్ కోసం సిద్దం చేసిపెట్టుకొన్న మిశ్రమాన్ని ఒకటి రెండు స్పూన్లను ఊతప్పం మద్యలో పెట్టి, కొద్దిగా సర్ధాలి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి 5నిముషాల పాటు ఊతప్పం కాలనివ్వాలి.
7. తర్వాత రెండవ వైపు కూడా తిప్పి ఊతప్పంను 1-2నిముషాలు కాల్చుకోవాలి.(లేదా ఒకసైడ్ కాలినా కూడా బాగుంటుంది).
8. అంతే రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఊతప్పంను సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చి, మీకు ఇష్టమైన కొబ్బరి చట్నీ లేదా కెచప్ తో సర్వ్ చేయాలి. అంతే హెల్తీ అండ్ టేస్ట్ ఓట్స్ ఊతప్పం తినడానికి రెడీ.

English summary

Oats Uthappam: Breakfast Recipe For Diabetics

Diabetes seems like a curse when you are exempted from eating your favourite dishes. We understand how frustrating it can be when you are asked by the doctor to stick to a boring list of foods. But it's time to cheer up as Boldsky has come up with a tasty solution for you which will keep you delighted throughout the day.
Story first published: Thursday, August 29, 2013, 12:09 [IST]
Desktop Bottom Promotion