For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రన్నింగ్ చేసేటప్పుడు, మీరు చేసే కొన్ని తప్పిదాలు

By Derangula Mallikarjuna
|

రన్నింగ్(పరుగు)ఒక సులువైన మరియు ఉత్తమ ఫిట్నెస్ వ్యాయామం అని చెప్పవచ్చు. సౌకర్యవంతమైన రన్నింగ్ షూలు మరియు సౌకర్యవంతమైన దుస్తులను ధరిస్తే మీరు వెళ్ళగలరు. అయితే, అది సింపుల్ గా ఉంటే మాత్రం, పరుగెత్తేటప్పుడు మీ నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన భౌతిక గాయాలు పాలవ్వాల్సి వస్తుంది. సరైన రక్షణ లేకుండా రన్నింగ్ చేయడం వల్ల దీర్ఘకాలంలో వారి కీళ్లు, ఎముకల దెబ్బతినడం జరగుతుంది.

రెగ్యులర్ గా రన్నింగ్ చేసే వారు సరైన జాగ్రత్తలు పాటించాలి. మంచి రన్నింగ్ షూలను తీసుకోవాలి. మీరు మీ రెగ్యులర్ వాక్ కు లేదా రన్నింగ్ కు సాధారణ షూలను వేసుకోవడం వల్ల చీలమండ మరియు ఇతర కీళ్ల కు సంబంధించిన సమస్యలను రెట్టింపు చేస్తుంది. కాబట్టి, మీరు మొదటిసారి రెగ్యులర్ గా క్రమం తప్పకుండా రన్నింగ్ చేయాలని నిర్ణయించుకొన్నప్పడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సేపు చేయకూడదు. మరియు అధికంగా చేయకూడదు. చాలా త్వరగా ఎక్కువ దూరం పరిగెత్తినప్పుడు మీఅంతట మీరు అలసిపోవటం మరియు కండరాలు దెబ్బతినడం జరగుతుంది. అందువల్ల, మీ రెగ్యులర్ రన్నింగ్ సెషన్స్ ప్రారంభించటానికి ముందు వాటిని గురించి తెలుసుకోవడం, నిపుణుల సంప్రదించడం మరియు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Running mistakes to avoid

మీరు రెగ్యులర్ గా రన్నింగ్ చేయాలని నిర్ణయించుకొన్నప్పడు మీరు వ్యాయామ నిపుణులన లేదా డాక్టర్ ను సంప్రధించడం కానీ లేదా మీ రన్నింగ్ యొక్క భంగిమ లేదా టెక్నిక్స్ తెలుసుకోవడం మంచిది. ఇంకా మీరు రన్నింగ్ చేయడానికి మీ శరీరానికి సరిపోయే, సౌకర్యవంతంగా ఉండే స్ట్రిడ్స్ మీద దృష్టి పెట్టడం అవసరం . మీరు కొత్తగా మొదటి సారి రన్నింగ్ మొదలుపెడుతుంటే మీరు మొదట మీరు కొన్ని సన్నాహక చేయడానికి శ్రద్ధ వహించడానికి మరియు మీ శరీరంలో దృఢత్వం గా ఉండటానికి మరియు మీ కండరాలు ఫ్లేక్సిబుల్ గా ఉండటానికి సౌకర్యవంతంగా ఉండేలా నిర్ధారించుకోండి.

1. సాధారణంగా కొత్తగా రన్నింగ్ చేసేవారు, ప్రారంభంలో చాలా త్వరగా చాలా ఎక్కువగా చేస్తుంటారు. ఈ తప్పును దీర్ఘకాలంలో మంచి రన్నింగ్ చేయాలనుకొనే వారు ఈ తప్పును జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొదటి సారి కొత్తగా పరుగు మొదలు పెట్టేవారి శరీరం మరియు కండరాలు ఫిజికల్ ఫిట్ నేస్ లేకపోవడం చేత, వారి శరీరం కండరాలు స్టిఫ్ గా ఉంటాయి. ఈ స్టిఫ్ నెస్ వదులవ్వడానికి, రెగ్యులర్ రన్నింగ్ ప్రారంభించే ముందు కొన్ని స్ట్రెచెస్ మరియు సడలింపులు చేయాలి .

2. పరుగు మొదలు పెట్టాకా రన్నర్స్ చేసే మరో ప్రధాన పొరపాటు, వారు సరిగా తినకపోవడం. ఒక సారి మీరు రెగ్యులర్ రన్నింగ్ మొదలు పెట్టాక, అధిక ప్రోటీనులు మరియు కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి బ్యాలెన్స్ న్యూట్రీషియన్ డైట్ ను తీసుకోవాలి. ఇవి మీ శరీరంలో తగ్గిపోయే క్యాలరీలను భర్తీ చేయడానికి మరియు శరీరంల ఎనర్జీనింపడానికి చాలా అవసరం.

3. రన్నింగ్ కొత్తగా మొదలు పెట్టినవారు, లేదా రెగ్యులర్ గా చేసేవారు తరచూ చేసే తప్పిదం వారి షూలను నిర్లక్ష్యం చేయడం. ముఖ్యంగా రన్నింగ్ కొత్తగా ప్రారంభించేవారు వారి అందుబాటులో ఉండే ఏవో ఒక షూను వేసేసుకుంటుంటారు. సరైన రన్నింగ్ షూలు లేకుండా, మీరు భౌతిక గాయాలకు గురికావల్సి వస్తుంది.

4.బిగినర్స్ లేదా రన్నర్స్ మరో సాధరణంగా చేసే తప్పిదం , వారి దుస్తులు. రన్నింగ్ చాలా ప్రాధమికం అయినప్పటికీ, రెగ్యులర్ రన్నర్ కు సరైన ఫిట్టింగ్ దుస్తులు వేసుకోవడం చాలా అవసరం. అవి కూడా చలా బిగుతుగానే లేదా మీ రన్నింగ్ కు ఇబ్బంది కలిగించేవి గానున ఉండకూడదు. కాబట్టి, మీరు రన్నింగ్ కు మరియు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ఎంపికచేసుకోవాలి.
5. రెగ్యులర్ గా ఒక దీర్ఘ మరియు రొటీన్ గా హెల్తీ రన్నింగ్ చేయాంటే మీకు ఖచ్చితంగామీ శరీరం ఏ భంగిమలో ఉండాలని తెలుసుకొని ఉండాలి. దాంతో మీ శరీరంలో ఒత్తిడి తగ్గించుకోవడాని సహాయపడుతుంది . మీరు విశ్రాంతి పొందటంతో పాటు మీ శరీరం మొత్తం నిటారుగా సజావుగా ఉంటుంది.

6. క్రమంగా నిదానంగా పరుగెత్తడం వల్ల మీ శరీరానికి కొంత శ్రమ మరియు ఒత్తిడికి గురిఅవుతుంది. కాబట్టి మీరు పరుగెత్తెడనాకి గ్రౌండును ఎంపిక చేసుకోంకండి ఒక మీ కీళ్ళు మీ శరీరం మరియు ఒత్తిడిని క్రమంగా తగ్గించడానికి నేల మీద నెమ్మదిగా నడవాలి.

7. రెగ్యులర్ రన్నింగ్ తర్వాత కూడా, మీరు క్రమంగా చాలా త్వరగా పరెగెత్తకూడదు . మీరు చాలా సున్నితంగా పరుగెత్తడం చాలా ముఖ్యం. మరియు సౌకర్యవంతంగా పరుగెత్తడం వల్ల శరీరంలో ఒత్తిడి, ఆందోళను తగ్గించుకోవచ్చు. చాలా త్వరగా పరిగెత్తడం వల్ల ఒళ్లు నొప్పలు మరియు శరీరంలో ఎనర్జీ అంతా కోల్పోవడం, దాంతో మిమ్మల్ని అలసటకు గురిచేస్తుంది.

English summary

Running mistakes to avoid

Running is one of the most affordable and best fitness exercises one can think of. With a pair of comfortable running shoes and flexible clothes and you are good to go.
Story first published: Tuesday, November 26, 2013, 21:38 [IST]
Desktop Bottom Promotion