For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్ఞాపక శక్తి లోపించడానికి కారణాలు తీసుకోవల్సిన జాగ్రత్తలు..!

|

జ్ఞాపకశక్తి అనేది మన నిత్య జీవితంలో ప్రతి పనికి అవసరం. ఇది లోపిస్తే ప్రతి పనికి అంతరాయం. ఏదెైనా విషయం గుర్తుంచుకున్నప్పుడు వెంటనే గుర్తుకు రాకపోవడాన్ని జ్ఞాపకశక్తి లోపంగా వ్యవహరిస్తారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే సంఘటనలు మెదడులోని న్యూరాన్లలో నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని బయటకు వెంటనే తేవడమే జ్ఞాపకశక్తి

Signs and Symptoms of Alzheimer's Disease

జ్ఞాపక శక్తి లోపించడానికి కారణాలు:

1. సరెైన పోషక ఆహారం తీసుకోకపోవడం.
2. మెదడులో కణుతులు ఏర్పడటం వల్ల మెదడుకు సోకే ఇన్‌ఫెక్షన్స్‌ వలన
3. థయామిన్‌ లోపం వలన
4. మెదడుకు ఆక్సీజన్‌, గ్లూకోజ్‌ సరిగా అందని పరిస్థితుల్లో
5. తలకు బలమైన గాయాలు తగలడం వలన
6. కొన్ని రకాల మత్తు పదార్థాలను అధికంగా వాడటం వలన (ఆల్కహాలు వంటివి)
7. థెైరాయిడ్‌ లోపం
8. మానసిక ఒత్తిడికి అధికంగా గురికావడం

జ్ఞాపక శక్తి లోపించిన లక్షణాలు ఎలా ఉంటాయి :
1. సరెైన సమయంలో చదివింది గుర్తుకు రాకపోవడం.
2. వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం.
3. కొందరు కొన్ని విషయాలు ఒకటి రెండు రోజులు తర్వాతనే మరచిపోవడం.
4. కొంతమంది గృహిణులు బజారుకు వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేసామో, లేదో, గ్యాస్‌ ఆఫ్‌ చేసామో లేదో అని ఆందోళన పడటం వంటి లక్షణాలు ఉంటాయి.

ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తమకు జ్ఞాపకశక్తి లోపించిదేమో అని ఆందోళన చెందడం సహజం. అలా కాకుండా చేసే పని మీద దృష్టి సారించి ఏకాగ్రతతో చేయుట భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వలన మానసికి ఒత్తిడి లేకుండా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే ‘జ్ఞాపకశక్తి' మెరుగుపడుతుంది.

మన మేధస్సు పెరగాలన్నా. మన జ్ఞాపక శక్తి పెరగాలన్నా మనం తీసు కోవాల్సిన ఆహారపదారాధలు ఏమిటి? ఏ ఏ ఆహార పదార్ధాలు తీసుకుంటే మన మెదడు చురుకుగా ఉంటుంది. ఈ విషయం మీద అనేక పరిశోధ నలు చేసి మెధస్సు పెరగాల న్నా, మన మెదుడు చురుకుగా పనిచే యాలన్నా ఏ ఆహారం తీసుకోవాలో వెల్లడిస్తున్నారు పరిశోధకులు.

విటమిన్‌ ‘సి': మన మెదడులోని నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండటంలో విటమిన్‌ ‘సి' తోడ్పడుతుంది. ఇది ఒక యాంటిఆక్సిడెంట్‌. నిమ్మ, నారింజ, బత్తాయి. క్యాబేజి, బంగాళ దుంపలలో ఇది లభ్యం అవుతుంది.
విటమిన్‌ ‘ఇ':ఇది ఎక్కువగా లభించే ఆహారం తీసుకుంటే ఆర్జీమర్స్‌ వంటి వ్యాధులు దరిచేరవు. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ అనేవి వాటి ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి. వీటి కారణంగా దెబ్బతిన్న మెదడు కణాలను సరిదిద్ద డంతో విటమిన్‌ ‘ఇ' కీలక పాత్ర పోషి స్తుంది. విటమిన్‌ ‘ఇ' తక్కువైతే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మామిడి, పొద్దు తిరుగుడు గింజలు, కాలిఫ్లవర్‌, వేరుశనగ పప్పులో విటమిన్‌ ‘ఇ' సమృద్ధిగా లభి స్తుంది.

English summary

Signs and Symptoms of Alzheimer's Disease | జ్ఞాపక శక్తి లోపించడానికి కారణాలు మరియు లక్షణాలు..

Everyone struggles to come up with a name once in a while. But how can you tell if it’s more serious?“One symptom alone does not necessarily indicate that a person has Alzheimer’s or dementia,” . There are many other causes of memory loss, including vitamin B12 deficiency, and brain, thyroid, kidney, or liver disorders. However, having several other symptoms could be a sign of Alzheimer’s disease (AD). Recognizing the signs of dementia can help lead to a quicker diagnosis.
Story first published: Wednesday, April 17, 2013, 14:46 [IST]
Desktop Bottom Promotion