For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హార్మోనుల అసమతుల్యత వల్ల ఇన్నిఆరోగ్య సమస్యలా..?!

|

ప్రస్తుత కాలంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వ సాధారణంగా మారింది. అందుకు ముఖ్య కారణం ఒత్తిడితో కూడిన జీవన శైలి మరియు తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం. దాంతో శరీరంలో హార్మోనల్ అసమతుల్యత ఏర్పడి అనేక సమస్యలకు దారి తీస్తుంది. అయితే హార్మోనుల అసమతుల్యత వల్ల పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ సమస్యల ఎవురౌతుంటాయి.

ముఖ్యంగా మనిషి జీవించడానికి శ్వాస ఎంత అవసరమో ఆరోగ్యంగా ఉండడానికి హార్మోనులు కూడా అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండంగా ఏర్పడినప్పటి నుంచి మనిషి జీవించి ఉన్నంత వరకు శరీరం మీద హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఈ హార్మోన్‌లు ఎక్సోక్రైన్, ఎండోక్రైన్ అని రెండు రకాలు. ఎక్సోక్రైన్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు నాళాల ద్వారా స్రవిస్తాయి. ఎండ్రోక్రైన్ గ్రంథులకు నాళాలు ఉండవు, వీటి నుంచి వెలువడిన హార్లోన్లు రక్తంలో కలసి శరీరమంతా వ్యాపిస్తాయి.

ఎక్సోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలుగా స్వేదగ్రంథులు, కాలేయాన్ని చెప్పవచ్చు. కాలేయం, క్లోమం జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తాయి. పిట్యుటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్, ఎడ్రినల్ గ్రంథులు ఎండోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలు. మగవారిలో వృషణాలు, స్త్రీలలో అండాశయాలు కూడా ఎండోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలు. హార్మోనులు తగినంత విడుదల కావాలి. అవసరానికి మించి విడుదలైనా, తక్కువగా విడుదలైనా దుష్పరిణామాలు కలుగుతాయి.

హార్మోన్ల విధులు:
హార్మోన్లు మానసిక శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి జీవప్రక్రియ, శరీర నియంత్రణ, సంతానోత్పత్తి, వయసుకు తగిన మార్పులు, శారీరక విధులు ఆలోచన, ఆవేశం, సెక్స్ హార్మోన్‌ల వల్లనే కలుగుతాయి శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ ఇన్సులిన్ పాత్ర

హార్మోనుల అసమతుల్యత వల్ల ఏర్పడే సమస్యలు:

థైరాయిడ్‌లోపం కారణంగా పిల్లల్లో మతిమరుపు, బరువు పెరగడం, జుట్టురాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని హైపోథైరాయిడిజమ్ అంటారు. ఆడపిల్లల్లో నెలసరి సమస్యలు, మొటిమలు, ఎదుగుదలలోపం, అతి బరువు, అవాంఛిత రోమాలు వంటి లక్షణాలు ఉంటాయి.

మగపిల్లల్లో మొటిమలు, ఛాతీ ఎక్కువగా ఉండడం, జుట్టురాలడం, మీసాలు, గడ్డాలు రావడంలో లోపాలు హార్మోన్‌ల వల్ల వచ్చే సమస్యలే. అలాగే గ్రోత్ హార్మోన్ ఎక్కువ తక్కువలు కూడా పొడవు పెరగడం మీద ప్రభావం చూపిస్తాయి. నిదానంగా పెరగడాన్ని డ్వార్ఫిజమ్, వయసుకు మించి పెరగడాన్ని జైగాంటిజమ్ అంటారు.

మహిళల్లో సంతానసాఫల్య సమస్యలు, బరువు పెరగడం, అవాంఛితరోమాలు, అండాశయంలో తిత్తులు, హైపర్‌థైరాయిడ్, కుషింగ్ వ్యాధి, మెనోపాజ్ దశలో సమస్యలు, మగవారిలో వీర్యకణాలు తక్కువగా ఉండడం, సెక్స్ సమస్యలు వంటివన్నీ హార్మోన్ తేడాల వల్ల వచ్చే సమస్యలు. ఈ విధంగా హార్మోన్‌లు పుట్టినప్పటి నుంచి చివరివరకు మానవశరీరంలో అమోఘమైన పాత్రను పోషిస్తాయి. మరి మనలో హార్మోనుల ఎక్కువ తక్కువ (హార్మోనుల అసమతుల్యత)ఉందనే తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు క్రింది విధంగా...

హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

వేడిగా ఆవిర్లు: సడెన్ గా మీ శరీరం నుండి లేదా చెవుల ద్వారా వేడి గాలులు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ లక్షణం మీరు మోనోపాజ్ దశ చేరుకోబోతున్నట్లు కూడా తెలిపే లక్షణమే. హార్మోనుల అసమతుల్యత వల్ల కూడా మీలో ఈ సమస్య ఎదురు కావచ్చు.

హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

సడెన్ గా బరువు పెరగడం: మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేయకపోయినా.. సరిగా భోజనం చేయకపోయినా..కూడా మీరు బరువు పెరుగుతుంటారు. ఇది కూడా హార్మోణుల అసమతుల్యత వల్లే అని గ్రహించాలి.

హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

రుతుక్రమంలో తేడాలు: ఫీమేల్ హార్మోనుల వల్లే స్త్రీలో ప్రతి నెలా రుతుక్రమం వస్తుంటుంది. కాబట్టి శరీరంలో ఏదైనా హార్మోనుల అసమతుల్యత వల్ల రుతుక్రమంలో కూడా తేడాలు ఏర్పడుతాయి. రుతక్రమం చాలా ఆలస్యంగా రావడం లేదా లేదా అనుకున్న డేట్ కంటే ముందుగా అయిపోవడం జరుగుతుంది.

హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

చెమటలు: హార్మోనుల తేడా వల్ల మీలో అధిక చెమటలు..వేడి కలగడానికి కారణం అవుతుంది. హార్మోనులు మార్పు చెందడం వల్ల మీరు అధిక చెమటలు మరియు అలసటకు కారణం అవుతుంది.

హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

చీకాకు: మహిళలు మరియు వారి మానసిక ఆందోళన మీద చాలా జోకులే ఉన్నాయి. అయితే , అవి తమాషా కాదు డిప్రెషన్ మరియు శరీరంలో ఉష్ణోగ్రతలో మార్పులు ఇవన్నీ చాలా సాధారణంగా ఏర్పడుతుంటాయి. అందుకు కారణం హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్

హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

లైంగిక జీవితం మీద అనాసక్తత: మీరు ఎప్పుడైతే వేడి ఆవిర్లకు గురిఅవుతున్నారో మరియు మీరు ఎటువంటి కారణం లేకుండా విసుగు చెందుతున్నా..ఖచ్చితంగా మీ లైంగిక జీవితం మీద ప్రభావం చూపుతుంది.

హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

సంతాన లోపం: సంతానం కలగకపోవడం. కొంత కాలంగా గర్భధారణకోసం ప్రయత్నం చేస్తున్నా సంతాన కలగకపోవడం, అప్పుడు మీరు ఖచ్చితంగా హార్మోనల్ టెస్ట్ చేయించుకోవడం దానికి తగ్గవిధంగా డైయట్ ను ఫాలో అవడం చాలా అవసరం.

హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

జుట్టు ఊడిపోవడం: హార్మోనుల వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది . మీకు హై హార్మోనల్ స్థాయిలు ఉన్నప్పుడు, మీ హెయిర్ గ్రోత్ చాలా వేగవంతంగా..మందగా పొడవుగా పెరుగుతాయి. అయితే హార్మోనుల అసమతుల్యత వల్ల మీ జుట్టు చాలా వరకూ నష్టపోవాల్సి ఉంటుంది.

హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

యోని పొడిబారడం: సాధారణంగా యోని ఉపరితలం మీద తడిగా ఉంటుంది. అయితే సడెన్ గా మీ యోని మార్గం పొడిబారడం లేదా దురద వంటి ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు గమనించినట్లైతే అందుకు మీలో హార్మోనులు తక్కువ స్థాయిలో ఉండటాకి కారణం కావచ్చు.

హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

తల దిమ్మగా ఉండటం: హార్మోనులు మీ శరీరంలో ప్రతి అవయవానికి చేరే రక్తంలో మలితమై ఉంటుంది కాబట్టి, హార్మోనులు మీ శరీరంలో ప్రతి భాగం ప్రభావితం అవుతుంది. హార్మోనులు అసమతుల్యత వల్ల మీ చురుకైన మెమరీ విఫలమైతే మీరు మతిమరుపుకు దారితీస్తుంది.

English summary

Signs You Are Hormonally Imbalanced | హార్మోనుల అసమతుల్యతను గుర్తించడం ఎలా...?

Hormonal imbalances are very common these days. It is mainly due to our stressful lifestyle and unhealthy food that we eat. Although it might seem like a simple problem, it can make you really sick. Hormonal imbalances among women are much more widespread. This is primarily because the women go through the hormonal cycles of menstruation every month.
Desktop Bottom Promotion