For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనసైటిస్ నివారణకు బెస్ట్ హోం రెమడీస్

|

ప్రస్తుత రోజు సైనసైటిస్ ఇది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దాదాపుగా ప్రతిమనిషి జీవనకాలంలో దీని బారిన పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇది సాధారణంగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. ముఖ్యంగా ముఖ్యంగా స్టైప్టోకోకస్ నిమోనియా, ఇన్‌ఫ్లుయెంజా వలన వస్తుంది. ఇంకా శ్వాసకోశ వ్యాధులు, ముక్కులో దుర్వాసన, అలర్జీ, పొగ, విషవాయువుల కాలుష్యం, వాతావరణ కాలుష్యం, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు, చలికాలం, వర్షాకాలం, గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయం, స్విమ్మింగ్, జలుబు, గొంతునొప్పి పిప్పపన్ను , టాన్సిల్స్ , రోగనిరోధక శక్తి తగ్గడం సైనసైటీస్ రావడానికి ప్రధాణ కారణాలు.

అసలు సైనసైటిస్ అంటే ఏమిటి? ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగం ఇన్ఫెక్షన్లతో వాచిపోవడాన్ని ‘సైనటైసిట్' అంటారు.

Simple Remedies To Treat Sinusitis

ఈ సైనసైటిస్ యొక్క ముఖ్య లక్షణాలు ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, ఫేషియల్ పెయిన్, ముక్కు కారడం, ముఖంలో వాపు, సైనస్ భాగంలో నొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు దురద, నీరు కారటం, గొంతులోనికి ద్రవం కారటం, గొంతు గరగర, దగ్గు, జలుబు, చెవిలో చీము, కోపం, మానసిక స్థైర్యం కోల్పోవటం, అలసట, విసుగు పనిపై శ్రద్ధ లేకుండటం, హోరు, దగ్గు. మొదలగు సాధరణ లక్షణాలు. సైనసైటిస్ త్వరగా తగ్గక, కొన్ని వారాల పాటు ఇబ్బంది పెడుతుంటుంది.

సైనసైటిస్ ఉన్న పిల్లలకు డాక్టర్లు యాంటీబయాటిక్స్ సూచిస్తారు. అయితే, మీరు సైనసైటిస్ తో ఎక్కువ రోజుల నుండి బాధపడుతూ డాక్టర్ వద్దకు వెళ్లే సమయం లేనప్పడు, ఇంట్లోనే కొన్నినివారణోపాయాలున్నాయి. ఈ హోం రెమడీస్ సైనసైటిస్ సమస్యను నేచురల్ పద్దతిలో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నివారించడానికి సహాయపడుతాయి. మరి సైనసైటిస్ కు హోం నివారణోపాయాలేంటో ఒక సారి చూద్దాం...

విశ్రాంతి: సైనస్ నివారణకు ఒక సులభ చిట్కా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడమే. మీకు ఎంత సాద్యమైతే అంత నిద్రపోవాలి. ఇది మీ శరీరం యొక్క ఇన్ఫ్లమేషన్ తో పోరాడటానికి సహాయపడుతుంది మరియు చాలా త్వరగా నయం అయ్యేందుకు సహాయపడుతుంది.

నోటిని తరచు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండడం. అలర్జీకి సంబంధించిన దుమ్ము, ధూళికి దూరంగా ఉండి, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని చుట్టూ నీరు, బురద లేకుండా ఉంచుకోవడం.

ఈత కొలనులో ఎక్కువ సమయం కేటాయించవద్దు. ఎందుకంటే అది ముక్కు లోపలి దళసరి చర్మాన్ని దెబ్బతీస్తాయి.

చల్లని పదార్థాలు తీసుకోవద్దు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవటం, వేడి ఆవిరి పట్టడం వలన కొంతవరకు నివారించవచ్చు.

సైనసైటిస్ క్యావిటీస్ కు మాయిశ్చరైజ్ : కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనెను ఒక బౌల్ వేసి అందులో హాట్ వాటర్ వేసి, ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టేటప్పుడు తలకునిండుగా బెడ్ షీట్ లేదా మంద పాటి టవల్ ను పూర్తిగా కప్పుకోవాలి. ఆవిరి బయటపోకుండా చూసుకోవాలి. ఆవిరి పడుతూ పూర్తిగా డీప్ శ్వాసను పీల్చాలి. ఇలా చేయడం వల్ల శ్వాసనాళాల్లో తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.

లెమన్ బామ్: జర్మ్స్ వల్ల వచ్చిన సైనసైటిస్ ను నివారించడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.కొన్నిఎండిన నిమ్మ ఆకులను నీటిలో వేసి 10నిముషాలు ఉడికించాలి. ఈ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నోట్లో పోసికొని గార్గిల్ చేయాలి. ఇది సైనస్ కంజషన్ నుండి గొప్ప ఉపశమనం కలిగిస్తుంది.

ద్రవాలు: ఎక్కువగా పండ్ల రసాలు మరియు నీళ్ళు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళు కూడా ఒక బెస్ట్ రెమడీ అనిచెప్పవచ్చు. సైనసైటిస్ సమస్య ఉన్నప్పుడు ఆల్కహాల్ త్రాగడం మానేయాలి. లేదంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

English summary

Simple Remedies To Treat Sinusitis

Sinusitis is a common problem among most people. It is generally caused by bacteria or viral infection. Blocked nose, severe headache, facial pain, nasal discharge etc. are some of the common symptoms of sinusitis. Dealing with sinusitis is a huge nuisance as it may persist for weeks.
Story first published: Thursday, November 7, 2013, 11:33 [IST]
Desktop Bottom Promotion