For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

|

శరీరం మీద సాగిన గుర్తులు(చారలు) హఠాత్తుగా బరువు పెరగడం వలన వస్తాయి. మీ బరువు పెరిగినప్పుడు, చర్మం కూడా సాగవలసి ఉంటుంది, కాని దానికి సాగేగుణం తక్కువ. సాగేగుణానికి మించి ఇది విస్తరించి నప్పుడు, కొన్ని తెలుపు లేదా వెండి రంగు గీతలను మనం శరీరంపైన చూడవచ్చు. వీటినే సాగిన మచ్చలు లేదా సాగిన చారలు అంటారు. సాగిన మచ్చలు హఠాత్తుగా బరువులో తగ్గుదల వలన కూడా కలుగుతాయి. స్త్రీలలో హర్మోను మార్పుల వలన, గర్భవతులలో, యుక్తవయసులో కూడా సాగిన మచ్చలు కలుగుతాయి. హఠాత్తుగా బరువు పెరగడం లేదా జిమ్ లో ఎక్కువగా అభ్యాసం చేయడం పురుషులలో ఇవి కలగటానికి ప్రధాన కారణాలు. సాగిన మచ్చలను సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు ఈ క్రింద తెలిపిన కొన్ని పద్ధతులు మీకు సాయపడతాయి:

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

జింక్ ఫుడ్: సహజంగా సాగిన మచ్చలను పోగొట్టుకోవడానికి మీరు జింక్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇది కొత్త చర్మ కణాలు యేర్పడేందుకు ఎంతో దోహదపడుతుంది. గుల్లలు, నత్తగుల్లలు, గోధుమ బీజాలు, ఊక తృణధాన్యాలు, దేవదారు గింజలు, పెకాన్ గింజలు జింక్ సమృద్ధిగా ఉన్న కొన్ని ఆహార పదార్ధాలు.

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

విటమిన్ ఇ/లావెండర్ ఆయిల్: సాగిన మచ్చలు పడిన ప్రాంతాన్ని విటమిన్ ఈ ఆయిల్ తో మర్దన చేయండి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. హేజల్ గింజలు, బాదం, పొద్దుతిరుగుడు నూనె, పత్తి గింజల నూనె, వేరుశనగ, మొక్కజొన్న పేలాలు విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు.

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

విటమిన్ ఏ&సి: విటమిన్ ఏ చర్మ కణాలు శక్తివంతంగా ఉండటానికి సాయపడగా, కొత్తగా ఏర్పడిన కణాలకు విటమిన సి మెరుపునిస్తుంది. విటమిన్ ఏ, విటమిన సి కలసి మచ్చలను పోగొట్టేందుకు ఒక ఉత్తమ ఆహారంగా పనిచేస్తాయి. క్యారెట్లు, నిమ్మజాతి పళ్ళు(ఆరెంజ్, నిమ్మ), పాలు, బంగాళదుంపలు, మామిడిపళ్ళు మొదలైన వాటిలో విటమిన్ ఏ, సి సమృద్ధిగా ఉన్నాయి.

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

ఆముదం: సాగిన మచ్చలను తగ్గించడ౦లో ఆముదం ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. మచ్చలు పడిన ప్రాంతంపై ఆముదాన్ని రాసి దానిని ప్లాస్టిక్ షీట్ తో కట్టండి. వేడి నీటి సీసా లేదా వేడి ప్యాడ్ ను వాడి దీనిపై 20, 40 నిమిషాల పాటు వేడి తగలనివ్వండి. మీరు ఇలా రోజుకు ఒకసారి చొప్పున కనీసం వారం రోజుల పాటు సాగిన మచ్చలను పోగొట్టుకోవడానికి చేయవలసి ఉంటుంది.

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

అలోవేరా: అలోవేరా జెల్ లేదా వెన్నను విటమిన్ ఈ లేదా ఆలివ్ నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు క్రమం తప్పక రాయండి.

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

కోకో వెన్న: కోకో వెన్నతో రోజుకు కనీసం ఒకసారి ప్రభావిత ప్రాంతంపై మర్దన చేయండి. ఇది సాగిన మచ్చలు పోగొట్టుకోనేందుకు ఎంతో సిఫార్సు చేయబడిన చిట్కా. షియా వెన్న: ఇది కూడా చాలా మంచిది, దీనిని కోకో వెన్నకు బదులుగా అది వాడినట్లే వాడవచ్చు, ఇది కూడా ఒకటి లేదా రెండు వారాలలో తగిన ఫలితాలను ఇస్తుంది.

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

ఆప్రికాట్: స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోవాలంటే ఆప్రికాట్ ఫ్రూట్ తో మసాజ్ చేయడం లేదా ఆప్రికాట్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ తొలగపోతాయి.

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

నీరు: ప్రతి రోజు మీరు 8 - 10 గ్లాసుల నీటిని తాగండి. నీరు చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది. సాగిన మచ్చలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

మస్టర్డ్ ఆయిల్: స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తొలగిపోయి సాధారణ చర్మం పొందడానికి మస్టర్డ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది.

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

ఆలివ్ ఆయిల్: వివిధ రకాల నూనెల్లో ఆలివ్ ఆయిల్ ను మించినది లేదు. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, బ్యూటీ కేర్ కు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ ను పోగొడుతుంది.

స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...

బాదాం ఆయిల్: బాదాం ఆయిల్లో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలతో పాటు సౌందర్య ప్రయోనాలెన్నో దాగున్నాయి. బాదాం అయిత్ తో శరీరం మొత్తం మసాజ్ చేయడం వల్ల ముడుతలు, డార్క్ సర్కిల్స్, తొలగిపోతాయి. స్ట్రెచ్ మార్క్స్ కూడా తొలగిపోతాయి.

English summary

Stretch Marks To No Marks Naturally | స్ట్రెచ్ మార్క్ ను మాయం చేసే నేచురల్ చిట్కాలు...


 Stretch marks are mainly caused due to sudden gain in weight. When our weight increases, the skin also needs to expand, but it has limited elasticity. When this expansion goes beyond the elasticity, we can see some white or silver coloured fine lines on the surface of the body.
Story first published: Tuesday, March 26, 2013, 11:53 [IST]
Desktop Bottom Promotion