For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాయసంకు వాడే సగ్గుబియ్యం కథ ఏంటో మీకు తెలుసా

పాయసంకు వాడే సగ్గుబియ్యం కథ ఏంటో మీకు తెలుసా

|

తినదగిన తెల్ల ముత్యాలంటే నాకు ఎల్లప్పుడూ అశ్చర్యంగా ఉండేది. అవేనండి సగ్గుబియ్యం. వండక ముందు తెల్లగా వండిన తరువాత పారదర్శకంగా ఉంటాయి వీటినే ఆంగ్లం లొ 'సాగో అని హిందీ లొ 'సబుదనా' అని అంటారు.

యావత్భారతదేశం లొ వ్రతం నాడు తినబడే అహార పదార్ధం గా పరిగణించబడేది. వీటిని ఉపయోగించి రక రకాల ఆహార పదార్ధాలు తయారు చేస్తారు. అందరికీ నచ్చె విధంగా సగ్గుబియ్యం తో వంటకాలు తయారు చెస్తారు.

The Story of sabudana(Sago)

సగ్గుబియ్యం అంటే?

సగ్గుబియ్యం అంటే వెజిటేరియన్ ప్రొసెస్డ్ ఫుడ్. అందువల్లే వ్రతాల సమయం లొ దీనిని ఎక్కువగా వాడతారు. సాగొ అనే పేరుతొ ప్రాచుర్యం పొందిన సగ్గుబియ్యం కర్ర పెండలం నుండి తీసుకోబడిన పొడి నుండి తయారుచేయబడుతుంది. ఛౌవ్వరి, సగుదనా, అవ్వరిషి గా సగ్గుబియ్యం ప్రసిద్ది.

కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తూ కొవ్వు తక్కువగా ఉండే పదార్ధం ఇది. బరువు తగ్గాలని అనుకునే వారు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. పాలు తరువాత చిన్న పిల్లలకి తినిపించదగిన ఆహార పదార్ధం ఇది. అలాగె పండుగల సమయం లో కూడా వీటిని వాడతారు.

స్టార్చ్ శాతం ఎక్కువగా ఉండి కౄత్రిమ తీపి పదార్ధాలు అలాగే రసాయనాలు లేకపొవడం వల్ల సగ్గు బియ్యాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే రోగులకు కూడా ఇది తక్షణ శక్తి నిచ్చే అహార పదార్ధం గా దీనిని వాడతారు. అలాగే ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఇందులో ఉన్నందువల్ల దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

సగ్గుబియ్యం ఎలా వండాలి
సగ్గుబియ్యం అంటే స్టార్చ్ పదార్ధం కాబట్టి వండటం సులువు కాదు. ప్రత్యేకించి నీల్లతో వండటం సులువు కాదు. సగ్గుబియ్యాన్ని వండే ముందు నీళ్ళతో బాగా కడగాలి. ఆ తరువాత బాగా వడగట్టి వెడల్పాటి గిన్నెలొ ఉంచాలి. గిన్నెలో సరిపడా నీళ్ళు పొయ్యాలి. ఆ తరువాత ఆ గిన్నెకి మూత పెట్టాలి. నాలుగు నుండి ఆరు గంటల పాటు నాననివ్వాలి. ఆ తరువాత తెరచిన తరువాత అందమైన ముత్యాల్లాంటి సగ్గుబియ్యం గింజలు తళ తళ లాడుతూ కనిపిస్తాయి.

సగ్గుబియ్యాన్ని ఎలా కొనాలి

సగ్గుబియ్యాన్ని కొనేటప్పుడు సమానంగా ఉండే తెల్లటి గింజలని ఎంచుకోవాలి. విరిగిపోని గింజలని జాగ్రత్తగా ఎరుకోవాలి. ఆ గింజలతో కిచిడీ చేసుకోవచ్చు. వడలు అలాగే ఖీర్ మరియు పాయసం చేసుకోవచ్చు.

సగ్గుబియ్యం లోని పొషకాలు
100 గ్రాముల సగ్గుబియ్యం లోని 351 కె కాలరీలు, 87 గ్రాముల కార్బోహైడ్రేట్స్ 0.2 గ్రాముల కొవ్వు మరియు 0.2 గ్రాముల ప్రొటీన్లు కలవు. ఇందులో తక్కువ మొత్తం లో మినెరల్స్, విటమిన్స్, కాల్షియం, ఐరన్ మరియు ఫైబెర్ కలవు. ఇందులో కూరగాయలు, బథానీలు అలాగె పాలు కలుపుకోవచ్చు.

English summary

The Story of sabudana(Sago)

Sabudana forms an integral part of the vrat ka khana almost all over India. They are converted into various delicacies both savoury and sweet and very much enjoyed by all
Desktop Bottom Promotion