For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో కొవ్వు కరిగించి.. పొట్టతగ్గించుకొనేందు పరిష్కార మార్గం..!

|

శరీరంలో అధికంగా పేరుకు పోయిన కొవ్వును కరిగించుకోవడానికి అనారోగ్యం పాలు కాకుండా తమను తాము రక్షించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరిగించుకోవడానికి గంటల తరబడీ జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ..అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా అధనంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలతో పోరాడటానికి సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గం కొన్ని ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడమే...

కొవ్వును కరిగించే కొన్ని ప్రభావవంతమైన ఆహరాలు కొన్ని ఉన్నాయి. అవి కనుక రెగ్యులర్ డైట్ లో చేర్చుకొన్నట్లైతే తప్పనిసరిగా, మీ శరీరంలో.. మీ నడుం చుట్టూ పేరుకొన్న అధనపు కొవ్వు తగ్గి ఖచ్చితంగా కొన్ని అంగుళాలు నడుము తగ్గడాన్ని మీరు గమనించవచ్చు. సాధారణంగా చాలా మంది డైటీషియన్స్ లోఫ్యాట్ మరియు ఫ్యాటీ ఫ్రీ ఫుడ్స్ తీసుకోమని డైయటేరియన్స్ కు సలహాలిస్తుంటారు. క్రొవ్వును కరిగించుకోవడానికి అత్యధికంగా కష్టపడి చేసే వ్యాయామాలు మరియు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవల్సిన పనిలేదు. ఎందుకంటే క్రొవ్వులు అనేవి మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. ఎందుకంటే శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలన్నా, మరియు బోన్ లూబ్రికేషన్ కొరకు. అందువల్ల బాడీ స్లిమ్ గా ఉండి ఎక్సెస్ ఫ్యాట్ ను కరిగించుకొనేందుకు కొన్ని పద్దతులను పాటించాలి.

బాన పొట్టను తగ్గించే 20 సూపర్ ఫుడ్స్:క్లిక్ చేయండి

అధిక పొట్ట లేకపోతే లావుగా ఉన్నవారు కూడా ఆకర్షణీయంగా కబడుతారు. ఉబ్బెత్తుగా ఉండే పొట్ట, చిరు బొజ్జలాగా అసహ్యంగా కనబడుతుంది. శరీరంలో అధిక బరువు, పొట్ట అందానికి ఆరోగ్యానికి సమస్యాత్మకంగా మారుతాయి. ఇవి ఆత్మ న్యూనతకి గురిచేసి అత్యంత నష్టాన్ని కలిగిస్తాయి. ఈ అధిక బరువు లావు పొట్ట వల్ల గురక నుంచి గుండె జబ్బుల వరకు బీపీ నుంచి షుగర్ వరకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. బరువు తగ్గించుకోవడం కష్టం, కొవ్వు తగ్గించుకోవడం మరింత కష్టం.

కారణాలు: అధిక బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో కొన్ని శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్ని సార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు. మరి ఇటువంటి సమస్యల భారీన పడకుండా క్రొవ్వు కరిగించుకొని పొట్టతగ్గించుకొనేందుకు కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం...

ఇంటివద్దనే మీ పొట్టను తగ్గించే సూపర్ టిప్స్: క్లిక్ చేయండి

వేగంగా కొవ్వు కరిగించు ఆహారాలు...

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

ఓట్స్: ఓట్స్ తినడానికి మాత్రమే రుచిగా మాత్రమే కాదు ఇవి తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో అధికంగా తినాలనే కోరికను ఓట్స్ తగ్గిస్తాయి. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండి కొలెస్ట్రాల్ లెవల్స్ ను మరియు కొవ్వులు సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

గుడ్లు: గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

ఆపిల్స్ : యాపిల్స్ లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పోషకాంశాలను అటుంచితే..యాపిల్స్ లో నీటితో కూడిన పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఫ్యాట్ సెల్స్ ను ఘననీయంగా తగ్గిస్తుంది.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

మిర్చి: పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే అంశం కలిగి ఉండటం వల్ల శరీరంలోని జీవక్రియల రేటును పెంచుతుంది మరియు వీటిని తిన్న 15నిముషాలకే క్యాలరీలను కరిగిస్తుంది.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

వెల్లుల్లి: వెల్లుల్లిలో అల్లిసిన్(allicin)అనే అంశం కలిగి ఉండి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

ధాన్యాలు: లెంటిల్స్ (ధాన్యాలు)తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. అయితే అమినో యాసిడ్స్ కలిగినటువంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఇది ఒకటి. మీరు ధాన్యాలను సూప్స్ లా లేదా గ్రేవీలా లేదా పౌడర్ల రూపంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. ఫ్లాబ్ అభివృద్ధి గురించి ఆందోళన చెందనవసరం లేదు.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

సిట్రస్ పండ్లు: మన శరీరానికి కావల్సిన ఎనర్జీని అంధించడం మాత్రమే కాదు, శరీరం యొక్క జీవక్రియల రేటును పెంచుతుంది. సిట్రస్ పండ్లలో నిల్వ ఉండే విటమిన్ సి అందుకు బాగా సహకరించడంతో పాటు కొవ్వును కరిగిస్తుంది. మీ ఫ్లాబ్ తగ్గించడం కోసం ఆసక్తి ఉంటే, అందుకు బ్రేక్ ఫాస్ంట్ లో ఆరెంజ్, తాజా నిమ్మరసం, తీసుకోండి. లేదా తాజా పండ్లను నారింజ, నిమ్మ, జామ వంటివి అలాగే తీసుకోవడం వల్ల కూడా కొవ్వు కరిగించుకోవచ్చు. సిట్రస్ జాతి పండ్లు, నిమ్మ, ద్రాక్ష, బెర్రీలు, ఆరెంజస్ వంటి పండ్లు, కేరట్, కేబేజి, బ్రక్కోలి, యాపిల్, వాటర్ మెలన్ వంటి కూరలు పండ్లు శరీరంలోని కొవ్వును కరగించి, కణాలలోని అధిక నీటిని కూడా పీల్చేస్తాయి.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

చేపలు: చేపల్లో అన్ సాచురేటెడ్ (అసంతృప్త కొవ్వు )కలిగి ఉంటాయి. మరియు అత్యవసర ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో సాల్మన్ మరియు మెకరేల్ వంటి ఆహారాలను మధ్యహ్నాభోజనంలో లేదా రాత్రి డిన్నర్ లో తీసుకోవడం వల్ల బరుబు తగ్గడానికి మరియు అధికంగా అధనంగా పేరుకొన్న కొవ్వును కరిగించుకోవచ్చు.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

నట్స్: చాలా మందిలో నట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనో లేదా కొవ్వు అధికం అవుతుందనో చెడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందువల్లే చాలా మంది వాల్ నట్స్ మరియు బాదాం వంటివి తినకుండా ఉంటారు. అయితే ఇది పూర్తి విరుద్దం. ఎందుకంటే నట్స్ లో డైటరీ ఫైబర్ తో పాటు కొవ్వును కరిగించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉండంటం వల్ల వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల చెడు కొవ్వును నియంత్రించవచ్చు.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

తేనె: కొవ్వు తగ్గించుకోవడానికి ఉదయం పూటీ తీసుకొనే తేనె ఉత్తమమైన మార్గం. తేనెను వేడినీటిలో వేసి బాగా గిలకొట్టి ఉదయం పరగడుపున సేవించాలి. ఇది ఊబకాయస్తులకు ఒక దివ్వ ఔషదం వంటిది. ఈ పద్దతిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. వేడి నీటిలో తేనె కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది. తియ్యనైన తేనెను ఏదీ కలపకుండా కూడా తీసుకోవచ్చు. తేనెలోని కార్బో హైడ్రేట్లు జీర్ణక్రియ మెరుగుపరచి బ్లడ్ షుగర్ స్ధాయి నియంత్రిస్తాయి. బరువు వేగంగా తగ్గాలంటే, షుగర్ కు బదులు తేనెవాడండి.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

నీరు : ఇది ఆహారం కాకపోయినా, బరువు తగ్గేటందుకు సహకరిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. శరీరం లో తేమనుంచుతుంది. ప్రతి భోజనం తర్వాత వేడి నీరు తీసుకుంటే కొద్ది వారాలలో మీకు ఫలితం కనిపిస్తుంది. వేడి నీటిలో నామ్మరసం, తేనె కలిపి తాగితే కూడా బరువు తగ్గటంలో ఫలితాలు వేగంగా వుంటాయి.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

గ్రీన్ టీ: ఇది బ్లాక్ లేదా గ్రీన్ త్రాగండి, గ్రీన్ టీ బరువు తగ్గించడంలో సమర్ధవంతమైనదని ఏకగ్రీవంగా అంగీకరించబడింది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ద్రవాన్ని నియంత్రణ చేయడానికి మరియు బరువు పెరగకుండానియంత్రించడానికి ఉపయోగపడుతుంది, మరియు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు సులభతరం చేస్తుంది. టీ ను రోజుకు రెండు కప్పులు త్రాగేవారిలో 11% మాత్రమే బరువు తగ్గించవచ్చు.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

అల్లం:వాపు గుండెపోటుతో అనేక కారణాలు ఒకటి. అందువలన, శోథ నిరోధక పదార్ధాలు సహా బే వద్ద వాస్కులర్ అంటువ్యాధులు ఉంచటం పారామౌంట్ ఉంది. జీర్ణవ్యవస్థను క్రమబద్దం చేసి అదనపు క్రొవ్వును కరిగిస్తుంది.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

బెర్రీస్: తీపి తక్కువ బెర్రీస్ లో బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ముదురు వర్ణంలో ఉండే బెర్రీస్ లో యూరిక్ ఆమ్లం తగ్గించడానికి సహాయం కీలక అంశంగా ఉంటుంది.వీటిని అలాగే తినవచ్చు, ఎండబెట్టిన లేదా జ్యూస్ చేసి త్రాగవచ్చు. దాంతో లాంగ్ టైమ్ హెల్తీ హార్ట్ ను కలిగి స్లీమ్ గా మారవచ్చు.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

బార్లీ:బాదం పప్పు, ఇతర గింజల్లో ఏక అసంతృప్త కొవ్వు పదార్ధాలు వుంటాయి కనుక అవి మీ శరీరానికి చాలా మంచివి - మీ ధమనులను శుభ్ర పరుస్తాయి. గింజలు తరువాతి భోజనం వరకు మీకు కడుపు నిండుగా అనిపిస్తుంది. వాటి లో విటమిన్ ఇ, పీచు పదార్ధం, మెగ్నీషియం పుష్కలంగా వుంటాయి. గింజల్లో వుండే విటమిన్ ఇ యాంటి ఆక్సిడెంట్ గా పని చేసి కాన్సర్, ఉబ్బసం, ఇతర ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో మీ రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తుంది. క్రొవ్వును కరిగిస్తుంది.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

మెంతులు: ఒక చెంచా మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటిని వేడి చేసి లేదా వేడినీళ్ళలో కలుపుకొని పరగడుపున త్రాగాలి. ఈ గింజల్ని తినడం వల్ల పొట్ట శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియ నిదానంగా పనిచేస్తుంది. అందువల్ల శరీరంలో నిల్వ ఉన్న అధిక క్రొవ్వును కరిగిస్తుంది.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

వీట్ గ్రాస్/గోధుమ గడ్డి: బరువు తగ్గించడానికి: గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. కొవ్వు శాతాన్ని కరిగించి అధిక బరు వును, పొట్టను తగ్గిస్తుంది. ఇది శరీరంలోని మెటబాలిజంను సరిచేస్తుంది.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

టమాట - కొవ్వు త్వరగా తగ్గాలంటే పచ్చి టమాటాలు తినండి. టమాట సలాడ్ కేన్సర్ కూడా నివారిస్తుంది. కనుక కొద్ది ఆకలి వేస్తే టమాటాలు తినండి.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు..!

డార్క్ చాక్లెట్:డార్క్ చాక్లెట్ ఉన్న ఫ్లెవనాయిడ్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుటకు నుండి కూడా ధమని వశ్యత నిర్వహించేవిగా ఉన్నాయి. డార్క్ చాక్లెట్లు కూడా రక్తంలో సెరోటోనిన్ స్థాయిలను వృద్ధిచేయడానికి మరియు భౌతిక అవరోధాలు నుండి రక్షణ పొందడానికి సహాయపడుతుంది. శరీరంలో అధనంగా పేరొకొన్న క్రొవ్వు కరిగిస్తుంది.

English summary

Top 20 Foods That burn Fat | శరీరంలో కొవ్వు కరిగించి.. పొట్టతగ్గించుకొనేందు పరిష్కార మార్గం..!

People go to great extents to reduce their flab – from spending half their day in the gym to starving themselves till they can’t take any more. But an easier and more effective way to fight those fat cells is to include the following food items in your diet and watch those extra fats in your body disappear.
Desktop Bottom Promotion