For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్-ప్రపంచ కిడ్నీ(మూత్రపిండాల) దినోత్సవ స్పెషల్

|

ప్రపంచ కిడ్నీ (మూత్రపిండాల) దినోత్స వాన్ని ఈ ఏడాది మార్చి 14న నిర్వహిస్తు న్నారు. ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ (మూత్రపిండాల) జబ్బులు పెరుగు తున్నాయి. దానికి సంబంధించిన చికిత్సా విధానాల్లో అత్యాధునిక మార్పులు వస్తున్నాయి. ప్రజల్లో వ్యాధుల గురించి అవగాహన పెంచి, కిడ్నీ మరణాలు తగ్గించడం, జీవనశైలిని మెరుగుపరచడం 'కిడ్నీ డే' ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా మార్చి నెల రెండో గురువారం నాడు దీన్ని నిర్వహిస్తారు. 2006వ సంవత్సరం నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ ‘డయాలసిస్‌' కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు.

గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినటం వంటివీ మొదలవుతాయి. పోనీ దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే కిడ్నీ దాతలు దొరకటం కష్టం. ఆపరేషన్‌ పెద్ద ప్రయత్నమనుకుంటే ఇక ఆ రత్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, దుష్ర్పభావాలు. ఇంత ఖర్చు చేసి చికిత్స తీసుకున్నా జీవనకాలమూ తగ్గవచ్చు. ఇలాంటి ప్రమాదాలన్నీ దరిచేరకుండా ఉండాలంటే ముందే మేల్కొని, అసలు కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే.. ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి. జీవన శైలి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మంచి ఆహారం తీసుకోవాలి. కిడ్నీకు ఉపయోగపడే కొన్ని ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కడ్నీ సమస్యలను అరకట్టవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. కిడ్నీని పదిలంగా ఉంచే కొన్ని ఆహారాలు మీ కోసం...

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

వెల్లుల్లి: వెల్లుల్లి సూపర్ ఫుడ్ గా పేరొందింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీక్లోటింగ్ లక్షణాలు అంటే గుండె సంబంధిత వ్యాధులను పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి శరీరం మొత్తాన్ని శోధిస్తుంది.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

బెర్రీస్: బెర్రీస్ బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, రాస్బెరీస్ మరియు బ్లూబెర్రీస్ అన్నింటిలోనూ కిడ్నీ ఫ్రెండ్లీ న్యూట్రీషియన్స్ మరియు యాంటీఇన్ ఫ్లమేటరి గుణాలు పుష్కలంగా ఉండి, వ్యాధి నిరోధకతను కలిగించి బ్లాడర్ ఫంక్షన్స్ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతాయి.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

రెడ్ బెల్ పెప్పర్: చాలా మంది వారికి తెలిసి మరియు తెలికుండానే కిడ్నీ వ్యాధులకు గురిఅవుతుంటారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందడానికి ఈ సూర్ ఫుడ్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోవాలి. రెడ్ బెల్ పెప్పర్ లో పొటాషియం తక్కువగా ఉండి విటమిన్స్ (ఎ, సి మరియు బి6), ఫోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ ఉండటం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాదు కొన్ని క్యాన్సర్ల ను ఎదుర్కొంటుంది.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

మొలకెత్తిన విత్తనాలు: పచ్చివి చిరుధాన్యాలు మొలకెత్తించి తినడం వల్ల శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మూత్ర పిండాలను శుభ్రపరిచి, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

క్యాబేజ్: క్యాబేజ్ మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణంగా క్యాబేజ్ ను మూత్రపిండాల డ్యామేజ్ ను అరికట్టడానికి మరియు మూత్రపిండాల పోషణకు ఒక మంచి సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

ఆపిల్స్: ద్రాక్ష, చెర్రీ మరియు ఆపిల్స్ వంటివి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి మూత్రపిండాలు నిర్విషీకరణం మరియు శుభ్రపరచడానికి బాగా సహాయపడుతాయి. మీరు డాక్టర్ కు దూరంగా ఉండాలంటే ప్రతి రోజూ ఒక ఆపిల్ తినడం మంచిది!

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

ఆలివ్ ఆయిల్: వివిధ రకాల ఆయిల్స్ లో ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మరియు గుండెకు ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసిన విషయమే. ఆలివ్ ఆయిల్ లో యాంటీఇన్ ఫ్లమేటరీ ఫాటీ యాసిడ్స్ కలిగి ఉండి కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

ఉల్లిపాయలు: ఉల్లిపాయలు, కిడ్నీలోని రాళ్ళను సహజంగా తొలగించడానికి సహాయపడుతాయి. అంతే కాదు, మూత్రపిండాలను నిర్విషీకరణం మరియు మూత్ర పిండాల శుభ్రతలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

రెడ్ గ్రేప్: ఇది కిడ్నీ హెల్తీ ఫుడ్. అందువల్లే దీన్ని మీ డైలీ డైయట్ లో ఖచ్చింతా చేర్చుకోవాలి. రెడ్ గ్రేప్స్ లో అధికంగా ఫ్లవనాయిడ్స్ కలిగి ఉండి బ్లడ్ కాట్స్ ను తగ్గిస్తాయి. రెడ్ గ్రేప్స్ తరచూ తీసుకోవడం వల్ల గుండె మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులను తగ్గించే అవకాశాలు ఎక్కువ.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

చెర్రీస్: చెర్రీస్ లో అధికంగా విటమిన్స్ మరియు లోప్రోటీన్స్ కలిగి ఉంటాయి. చెర్రీస్ ను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని పొటాషియం లెవల్స్ ను తగ్గించేదుకు సహాయపడుతుంది. దాంతో కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

ఎగ్ వైట్: ఎగ్ వైట్ లో అమినోయాసిడ్స్ మరియు లోఫాస్పరస్ అధికంగా కలిగి ఉంటాయి. అందుకే వీటిని కిడ్నీఆరోగ్యంగా ఉంచే ఆహారాల్లో దీన్ని కూడా సూపర్ ఫుడ్ గా లెకిస్తారు.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

చేపలు: చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి, శరీర శోషణకు బాగా సహకరిస్తుంది. చేపల్లో సాల్మన్, రైన్బో ట్రౌట్, మకెరేల్, హెరింగ్ మరియు తున చేపలు ఆరోగ్యానికి మేలు చేసే చేపలు. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

గుమ్మడి విత్తనాలు: గుమ్మడి విత్తనాలు గుమ్మడి విత్తనాలు, కిడ్నీలకు చాలా మంచి ఆహారం. కిడ్నీకి బలాన్ని ఇవ్వడమే కాక రక్త పుష్టిని కలిగిస్తుంది.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

పెరుగు: పెరుగు మన నిత్యజీవితంలో భాగమే అయినా కొందరు పెరుగు అవసరాన్ని గుర్తించరు.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!

నీళ్ళు: కిడ్నీ వ్యాధులను నివారించుకోవాలంటే, నీరు తాగటం అవసరం. నీరు బాగా తాగితే బ్లాడర్, మూత్రకోశ వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చు. నీరు శరీరంలోని ఉప్పు, యాసిడ్ స్ధాయిలను సమన్వయపరచి అన్నిరకాల నొప్పులు, మంటలు తగ్గిస్తుంది. నీరు వ్యాధి కలిగించే బాక్టీరియాను బయటకు పంపేస్తుంది.

English summary

World Kidney Day: Superfoods To Have | హెల్తీ కిడ్నీకొరకు 15 సూపర్ ఫుడ్స్.. వరల్డ్ కిడ్నీ డే స్పెషల్!

World Kidney Day is celebrated on the second Thursday of every March. It is a day when people spread awareness about healthy kidneys. Kidneys detoxify the body and purifies blood. So, it is very important to have healthy kidneys. People who are suffering from diabetes are more prone to kidney damage. Even dehydration can damage the kidney or form kidney stones that can be really painful.
Desktop Bottom Promotion