For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊపిరితిత్తుల ఆరోగ్య సంరక్షణ: టాప్10 సూపర్ ఫుడ్స్

|

ఊపిరితిత్తులు మన శ్వాసక్రియకు ఎంతో కీలకం. ఎందుకంటే... శ్వాస తీసుకోవడం క్షణం ఆలస్యం జరిగినా ప్రమాదమే. అంతటి కీలకమైన ఈ అవయవానికి క్యాన్సర్ సోకితే... గుర్తించడం ఒకింత కష్టం. కారణం... దీన్ని క్షయగా పొరబడే అవకాశం ఉండటం. ఈ కారణంగా చికిత్స ఆలస్యమయ్యే అవకాశం ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే... అక్కడి కణాలు నియంత్రణ లేకుండా అపరిమితంగా పెరిగిపోవడమే. అప్పుడా వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలు ఇతర అవయవాలకూ పాకుతాయి. ఇలా క్యాన్సర్ ఒకచోటి నుంచి మరో అవయవానికి వ్యాపించడాన్ని మెటాస్టాసిస్ అంటారు. క్యాన్సర్ మొదట ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియల్ కణాల్లో కనిపిస్తే దాన్ని ‘ప్రైమరీ లంగ్ క్యాన్సర్' అంటారు. కాబట్టి, మన మొత్తం శరీరానికి సపోర్ట్ గా ఉండే ఊపిరితిత్తులను కాపాడుకోవడం చాలా ముఖ్యం.

ఊపిరితిత్తుల క్యాన్సర్ : ప్రారంభ లక్షణాలు: క్లిక్ చేయండి

ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి నీళ్ళు చాలా బాగ సహాయపడుతాయి. కాబట్టి, ప్రతి రోజూ తగినన్ని నీరు త్రాగాలి. అలాగే క్యాన్సర్ నిరోధంలో పోషకాహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొంతమంది విటమిన్-ఇ తీసుకుంటే లంగ్ క్యాన్సర్ రాదు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. అంతేకాదు, ధూమపానం చేసే వారు కెరోటినాయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రింది డైటరీ ఆహారాలను తీసుకోవాలి...

రెడ్ బెల్ పెప్పర్:

రెడ్ బెల్ పెప్పర్:

రెడ్ బెల్ పెప్పర్ ఒక ధూమపానప్రియలక్ ఒక సురక్షితమైనటువంటి వెజిటేబుల్. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో బీటా క్రిప్టాక్సిథిన్ లంగ్ క్యాన్సర్ ను మరియు ఇతర లంగ్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది.

ఆకు కూరలు:

ఆకు కూరలు:

ఆకుకూరల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది లంగ్స్ హల్త్ కు రక్షణ కల్పిస్తుంది. ఆకు కూరలతో తయారు చేసిన వంటలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. ఆకు కూరల్లోని మొత్తం ప్రయోజనాలను పొందాంటే మీరు ఆకుకూరలతో తయారుచేసిన సలాడ్స్ లేదా సూప్ లను భోజనం సమయంలో తీసుకోండి. ఈ టాప్ టెన్ సూపర్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోండి.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

మీరు శాఖాహారులైతే మీరు ఫ్యాటీ ఫిష్ తినకున్నట్లైతే, అప్పుడు వాల్ నట్స్ ఒక ఉత్తమ ఎంపిక. వాల్ నట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతంగా కలిగి నటువంటి మూలకం. కేవలం ఒక గుప్పెడు వాల్ నట్స్ ను ప్రతి రోజూ తినడం వల్ల ఆస్త్మాతో పోరాడుతుంది మరియు ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

ఆపిల్స్ :

ఆపిల్స్ :

రోజుకు ఒక ఆపిల్ తింటే, డాక్టర్ల అవసరం ఉండదు అంటుంటారు!అది అక్షరలా నిజమే. ఇది చాలా ప్రయోజనకరమైన మరియు ఎఫెక్టివ్ ఫ్రూట్. మీరు ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, మీరు ఖచ్చితంగా ప్రతి రోజూ ఒక ఆపిల్ తినాల్సిందే . ఇందులో పుష్కలమైన న్యూట్రీషియన్స్. ఇంకా ఆపిల్ జ్యూస్, ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఫిట్ గా ఉంచతుంది. ఆపిల్ ను ఊపిరితిత్తుల ఆరోగ్యానికి టాప్ ఫుడ్స్ లో ఆపిల్స్ ను చేర్చబడింది.

ఫ్యాటీ ఫిష్:

ఫ్యాటీ ఫిష్:

లంగ్స్ (ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడే మరో ఆహారం ఫ్యాటీ ఫిష్ . ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచతుంది . ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నేరుగా ఊపిరితిత్తుల ఆరోగ్యం మీద ప్రభావం చూపి, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పౌల్ట్రీ:

పౌల్ట్రీ:

పౌల్ట్రీ ఫుడ్ ఐటమ్స్ చికెన్, టర్కీ మరియు గుడ్లు వంటివి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది. పౌల్ట్రీ ఫుడ్స్ లో ఉండే విటమిన్ ఎ లంగ్స్ కు బూస్ట్ వంటింది. ఇంకా శాకాహారం అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్ నుండి అందే విటమిన్ ఎ కంటే, అనిమల్ బేస్డ్ విటమిన్ ఎ మరింత ఎఫెక్టివ్ గా శరీరంలోకి చాలా తర్వాత ప్రవేశిస్తుంది.

ఆప్రికాట్ :

ఆప్రికాట్ :

ఒక రకమైనటువంటి నేరుడు పండు. ఊపితిత్తుల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఇందులో పుష్కలమైనటువంటి విటమిన్ ఎ ఉండి, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఆప్రికాట్ పండ్లు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురికాకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ ఎ మాత్రమే కాదు, ఇందులో యాంటీఆక్సిడెంట్స్ , ఐరన్, మరియు ఫైబర్ కూడా పుష్కలంగా ఉండి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బీన్స్ :

బీన్స్ :

బీన్స్ ఊపిరి తిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లాక్ బీన్స్, పింటో బీన్స్, మరియు కిడ్నీ బీన్స్ వంటి వాటిలో పుష్కలమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఊపిరితిత్తులను ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కు గురికాకుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు డ్యామేజ్ చేసే, ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీ క్రూసిఫిరస్స్ వెజిటేబుల్. ఇది ఒక బెస్ట్ గ్రీన్ వెజిటేబుల్. ఈ బ్రొకోలీని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది . ఇందులో ఉండే పుష్కలమైనటువంటి యాంటీ ఆక్సిడ్స్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. ఎవరైతే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ తో బాధపడుతున్నారో వారు బ్రొకోలీ రెగ్యులర్ గా తీసుకోవడం చాలా ఉత్తమం.

బెర్రీస్:

బెర్రీస్:

బెర్రీస్ ఒక అద్భుతమైన మరియు ఆరోగ్యకరమైన పండ్లు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉంచుతాయి. బెర్రీస్ లో అన్ని రకాల బెర్రీస్ ఆరోగ్యానికి మంచివే, కానీ, బ్లూబెర్రీస్ మరియు ఎషియా బెర్రీస్ మంచి ఆరోగ్యాన్ని అంధివ్వడంలో ఛాంపియన్స్ గా భావిస్తారు .

English summary

10 Foods To Keep Your Lungs Healthy

Breathing – that’s life itself. The simple act of breathing keeps our life going. But we seldom stop to even notice this invisible function of the body. The lungs, like those unseen soldiers, work hard to keep our body safe.
Desktop Bottom Promotion