For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెడ్ కోల్డ్(తలభారం-జలుబు)నివారణకు 10 సింపుల్ రెమెడీస్

|

వేసవి వెళ్ళింది వర్షాలు మొదలైయ్యాయి. వర్షాలతో పాటు వ్యాధులు కూడా తొడున్నామంటు మన వెంటే ఉంటాయి. వర్షాకాలంలో ఎంత జాగ్రత్త తీసుకొన్నప్పటికీ జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల బారిన పడక తప్పదు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దీనికి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడమే ఏకైక మార్గం. వర్షాకాలంలో అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని వైద్య నిపుణులు సలహాలిస్తున్నారు.

జలుబు అనేది చాలా సింపుల్ గా మరియు ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ తీసుకోగల ఒక సాధారణ బబ్బు లేక వ్యాధి. హెడ్ కోల్డ్ ఉన్నప్పుడు చాల మంది డాక్టర్ ను కలిసి మెడిసిన్స్ తీసుకుంటారు. కానీ, హెడ్ కోల్డ్ మరియు ముక్కుదిబ్బడి వెంటనే తగ్గదు, అలాగే సహజంగా ఉంటుంది. హెడ్ కోల్డ్ మరియు ముక్కుదిబ్బడ నివారించుకోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలున్నాయి.

హెడ్ కోల్డ్ మరియు ముక్కదిబ్బడను నివారించడానికి కొన్ని సహజ హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ హోం రెమడీస్ ఉపయోగించడం వల్ల త్వరగా జలుబును నివారించవచ్చు. హెడ్ కోల్డ్ మరియు ముక్కుదిబ్బడ, దగ్గుకు దోహదం చేస్తుంది. కాబట్టి, హెడ్ కోల్డ్ మరియు ముక్కుదిబ్బడ తాత్కాలికంగా నివారించుకోవడానికి ఈ క్రింది హోం రెమెడీస్ ను ఒక సారి ఉపయోగించి చూడండి.

1.ద్రవాలు తీసుకుంటుండాలి

1.ద్రవాలు తీసుకుంటుండాలి

హెడ్ కోల్డ్ మరియు ముక్కుదిబ్బడ నివారణకు ఎక్కువగా గోరువెచ్చని నీళ్ళు మరియు ఇతర లిక్విడ్స్ తీసుకుంటుండాలి. జలుబు మరియు ముక్కుదిబ్బడతో బాధపడే వారు ఎక్కువగా నీరు, గ్లూకోజ్, పైనాపిల్ మరియు ఆరెంజ్ జ్యూస్ వంటివి తీసుకోవాలి.

2.కెఫిన్ నివారించాలి

2.కెఫిన్ నివారించాలి

కెఫిన్ కలిగిన పానియాలు హెడ్ కోల్డ్ ను పెంచుతుంది. కాబట్టి హెడ్ కోల్డ్ , జలుబు మరియు దగ్గు నివారించడానికి కెఫిన్ కలిగినటువంటి కాఫీ మరియు టీలను నివారించాలి.

3.విశ్రాంతి

3.విశ్రాంతి

జలుబు దగ్గుతో అసౌకర్యంగా అనిపిస్తే వెంటేనే కొంచెం విశ్రాంతి తీసుకోవడం వల్ల నివారించవచ్చు. కొన్ని గంటలు సమయం నిద్ర, విశ్రాంతి తీసుకోవడం వల్ల హెడ్ కోల్డ్ ను నివారించవచ్చు.

4.సూప్ త్రాగాలి

4.సూప్ త్రాగాలి

వేడి వేడిగా రుచికరంగా ఉండే సూప్ కాఫీకి బదులుగా తీసుకోండి. హెడ్ కోల్డ్ మరియు ముక్కుదిబ్బడకు మంచి ఎఫెక్టివ్ హోం రెమడీ సూప్ . సూప్ ప్లెయిన్ వెజిటేబుల్ సూప్ లేదా చికెన్ సూప్ అయితే బెటర్ గా ఉంటుంది.

5.కోల్డ్ టానిక్

5.కోల్డ్ టానిక్

చాలా వరకూ తేనె వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు బెస్ట్ హోం రెమెడీ. అలాగే జలుబు ముక్కుదిబ్బడకు కూడా బెస్ట్ హోం రెమడీ. కాబట్టి మీరు తేనె మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ మిశ్రమంతో టానిక్ ను త్రాగవచ్చు.

6.ఉప్పు నీళ్ళు పుక్కలింపు

6.ఉప్పు నీళ్ళు పుక్కలింపు

మీకు గొంతులో సమస్యగా ఉందని, జలుబు చేసిందని భావించినపుడు, గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పువేసి పుక్కిలించడంవల్ల మీ గొంతు శుభ్రపడుతుంది, వైరస్ వల్ల వచ్చే వివిధ సమస్యలను కూడా నిరోధిస్తుంది.

7.గ్రీన్ టీ

7.గ్రీన్ టీ

జలుబుతో ఇబ్బందిపడేవారికి ఇంట్లో తయారుచేసిన ఒక కప్పు వేడిగా ఉన్న గ్రీన్ టీ లేదా అల్లం టీ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒకకప్పు గ్రీన్ టీతో కోల్డ్ ను జయించండి.

8.హాట్ పెప్పర్

8.హాట్ పెప్పర్

మనం సాధారణంగా చాలా కారంగా ఉండే ఆహారాలను తినడం ఇష్టం ఉండదు. మనం ఫ్లూతో బాధపడుతున్నప్పుడు టేస్ట్ బడ్స్ చాలా ఆక్టివ్ గా ఉంటాయి. అటువంటి సమయంలో చాలా మంది చాలా కారంగా అనిపించే సాస్ లను రుచిచూడాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ స్టైల్లో హాట్ పెప్పర్, గార్లిక్, పచ్చిమిర్చితో తయారు చేసి వంటలు చేసి రుచి చూడండి. రుచికి రుచికి. ఆరోగ్యానికి ఆరోగ్యం.

9.ఆవిరి పట్టడం

9.ఆవిరి పట్టడం

ఆవిరి పీల్చడం వల్ల మూసుకుపోయిన ముక్కుకు ఉపశమనం కలుగుతుంది. వేడి ఆవిరి ముక్కుపుటాలలోని క్రిములను నాశనం చేస్తుంది. ఆవిరి పట్టేటపుడు ఎక్కువ వేదిలేకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే దానివల్ల సున్నితమైన ముక్కుపుటాలు దెబ్బతింటాయి. స్టీం ఇన్హేలర్ లేనపుడు, వేడినీటి కేటిల్ ఉపయోగించండి. జలుబు రాకుండా నివారణకు ఆవిరి పీల్చవచ్చా అని అనుమానం వస్తుంది. ఒకవేళ ముందే వస్తే, వారు ఉపశమనానికి బామ్ లను లేదా వేపోరైజర్ లను పూయవచ్చు.

10.పండ్లు

10.పండ్లు

సిట్రస్ పండ్లను ముఖ్యంగా తీసుకోవడం ఎందుకంటే ఇందోల విటమిన్ సి పుష్కలంగా ఉండటమే. ఇది మనలో రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. సిట్రస్ పండ్లు ఆహారంగానే కాదు విటమిన్ ఫుడ్ గా బాగా సహాయపడుతుంది. కోల్డ్, ఫ్లూ వంటి కామన్ జబ్బులను పోగొట్టడానికి, పొటాటో, పచ్చిబఠానీ, పెప్పర్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ మరియు పైనాపిల్, గ్రీన్ పీస్ వంటి ఆహారాలు బాగా సహాయపడుతాయి.

English summary

10 Remedies For Head Cold

Cold is a common disease which can be treated with simple and effective treatments. Many people choose to talk to a doctor and take medicines, but head cold and congestion is quite common. There are some simple home remedies for head cold and congestion.
Story first published: Saturday, June 28, 2014, 17:37 [IST]
Desktop Bottom Promotion