For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోబ్లడ్ ప్రెజర్(లోబిపి)కి 10 ప్రధాన లక్షణాలు

|

లో బ్లడ్ ప్రెజర్ (లోబిపి) నమ్మలేని విధంగా ఉంటాయి . కొన్ని సందర్భాల్లో లోబిపి వల్ల మానసికంగా మరియు శారీరకంగా నీరసించడం జరుగుతుంది. లోబిపినే హైపోటెన్షన్, ఏవరైనా ఈ సమస్యతో బాధపడుతన్నట్లైతే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. లేదంటే మీ జీవనశైలిలో మార్పులో చేసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య అండర్ కంట్రోల్లో ఉంటుంది.

సాధారణ లోబ్లడ్ ప్రెజర్ ఉన్నట్లైతే అది మీ ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపదు. అందుకు ట్రీట్మెంట్ ఏమి అవసరం ఉండదు . ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో, అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. దాంతో లోబిపి లక్షణాలు మొదలవుతాయి.

అటువంటి పరిస్థితిలో బిపి 90/60 లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు లోబిపి వల్ల మన శరీరంలోని మొత్తం అవయవాలకు ఆక్సిజన్ ప్రసరణ చేయడం మీద ప్రభావం చూపతుంది. లోబిపికి ప్రధాణ కారణాలు: ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, మాల్ న్యూట్రీషియన్, మెనుష్ట్రుయేషన్ వల్ల రక్తం తగ్గిపోవడం లేదా గాస్ట్రోఇన్స్టెన్సినల్, కిడ్నీలకు లేదా బ్లాడర్ కు తక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది.

నోట్: బ్లడ్ ప్రెజర్ తగ్గినప్పుడు, ప్రమాదకరమైన విషయం ఏంటంటే శరీరంలో అన్ని అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందక, శరీరంలో అవయవాల పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. జీవక్రియలకు అంతరాయం జరగడం వల్ల ముఖ్యంగా గుండె మరియు బ్రెయిన్ ప్రభావం చూపడం వల్ల శ్వాసతీసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి, లోబిపి రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ఈ క్రింది లోబిపి లక్షణాలలో ఏఒక్క లక్షణం మీకు అనిపించినా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

డీజినెస్(మైకం)

డీజినెస్(మైకం)

లోబ్లడ్ ప్రెజర్ కు డీజినెస్ ఒక ప్రధాన లక్షణం. లోబిపి ఉన్నవారికి తరచూ మైకంను గురి అవుతుంటారు. అనుకోకుండా, కంట్రోల్ చేసుకోవడానికి వీలు కాకున్నట్లు గా కళ్ళు తిరగడం ప్రారంభం అవుతుంది.

లైట్ హెడ్

లైట్ హెడ్

లోబ్లడ్ ప్రెజర్ కు మరో ముఖ్య లక్షణం తరచూ విషయాలను మర్చిపోతుండటం. ఏవిషయంలోనైనా చాలా తేలికగా మర్చిపోతుంటారు.

స్థిమితంగా ఉండలేకపోవడం

స్థిమితంగా ఉండలేకపోవడం

అవయవాలు మొద్దుబారిపోవడం మరియు శరీరం నుండి చల్లని ఆవిర్లు రావడం జరుగుతుంది. ఒక వేళ ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, వేడిగా ఏదా త్రాగడం మంచిది. శరీరానికి కొంచెం వేడి కల్పించాలి.

కళ్ళు మంటలు

కళ్ళు మంటలు

సడెన్ గా కళ్ళు బైర్లు కమ్మడం, కళ్ళ ముందు ఏదో కడబడుతన్నట్లు, కదులుతున్నట్టు అనిపించడం కూడా లోబ్లడ్ ప్రెజర్ కు ఒక కారణం. ఇటువంటి లక్షణం కనిపించినప్పుడు మీరు కొంత సమయం కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. పరిస్థితి స్థిమతపడే వరకూ విశ్రాంతి తీసుకోవాలి.

వీక్ నెస్

వీక్ నెస్

లోబ్లడ్ ప్రెజర్ కు మరో లక్షణం బలహీనంపడటం. లోబ్లడ్ ప్రెజర్ ఉన్నవారు తరచూ ఈ సమస్యతో బాధపడుతుంటారు.

అలసట

అలసట

లోబ్లడ్ ప్రెజర్ కు మరో లక్షణం అలసట మరియు ఏ పనిచేయాలన్నా తగినంత సామర్థ్యం లేకుండుటం. అటువంటి పరిస్థితుల్లో సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల మీ శరీరం స్థిరంగా ఉంటుంది.

వికారం

వికారం

క్రమంగా వికారానికి దారితీస్తుంది. లోబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు వికారం ఒక ప్రధాన లక్షణం. అందుకు తాజా నిమ్మరసం తీసుకోవాలి.

కోల్డ్ స్కిన్

కోల్డ్ స్కిన్

బ్లడ్ ప్రెజర్ తగ్గినప్పుడు, శరీరం చల్లబడిపోతుంది. షివరింగ్ మొదలవుతుంది. అందుకు కారణం మీ శరీరానికి తగినంత రక్తం అందకపోవడం.

ఫెయింటింగ్ (మూర్చపోవడం)

ఫెయింటింగ్ (మూర్చపోవడం)

లోబ్లడ్ ప్రెజర్ కు మరో లక్షణం ఫెయింటింగ్. కళ్ళు తిరగడం మరియు శరీరం పట్టుకోల్పోవడం జరిగి మూర్చపోవడం జరుగుతుంది.

పేల్ స్కిన్

పేల్ స్కిన్

క్రమంగా రక్తప్రసరణ ఉండకపోవడం వల్ల చర్మం నిర్జీవంగా కనబడుతుంది. లోబ్లడ్ ప్రెజర్ కు ఇది కూడా ఒక ముఖ్యమైన లక్షణం.

English summary

10 Signs Of Low Blood Pressure

Signs of low blood pressure can be uncertain. Someone who undergoes low blood pressure feels weak mentally and physically too. Low blood pressure, which is also known as hypotension, usually needs to be treated if the person has persistent problems. Otherwise, adjusting your lifestyle with this condition can help to keep the problem under control.
Story first published: Wednesday, May 28, 2014, 16:30 [IST]
Desktop Bottom Promotion