For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూర్యరశ్మితో ఆరోగ్యానికి 6 విలువైన ప్రయోజనాలు

|

చాలా మంది ఎండలోకి వెలితే కందిపోతాం, నల్లబడిపోతాం అని ఎండమొహం చూడకుండానే ఉంటారు. అయితే ఎండ వల్ల ఎంత ఆరోగ్యప్రయోజనం ఉందో బహుశా వారికి తెలసుండకపోవచ్చు. సూర్య రశ్మి ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి'లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయా నాలన్నీ రుజువు చేస్తున్నాయి.

శరీరానికి గాలి, నీరు, ఆహారం అవసరమైనట్లే, సూర్యరశ్మీ కూడా కావలసి ఉంటుంది. సూర్యరశ్మి శరీరారోగ్యానికి ఔషధంలాంటిది. సూర్యరశ్మి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతివారికీ కావలసిన విటమిన్‌ డి సూర్యరశ్మి ద్వారానే శరీరానికి అందుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో సూర్యరశ్మి కూడా అంతే అవసరం. సూర్యరశ్మి మనిషి శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా అవసరమే. మనకు వీటిలో ఏది అందకపోయినా అనారోగ్యం బారిన పడతాం. కాబట్టి సూర్యరశ్మిని నిర్లక్ష్యం చేయకూడదు. 'డి' విటమిన్‌ లోపం వల్ల ఎముకలకు సంబంధించిన రికెట్స్‌ వ్యాధి వస్తుంది. ఒక్క రికెట్స్ వ్యాధి మాత్రమే కాదు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురౌవుతాయి.

అయితే సూర్యరశ్మి పొందే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఉదయం అంటే సూర్యోదయం సమయంలో చాలా తక్కువగా వేడి ఉంటుంది మరియు వాతావరణం కూడా చాలా తక్కువ కాలుష్యంతో ఉంటుుంది కాబట్టి, సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యరశ్మిలో ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ మేలు జరగుతుంది. అదే మిట్ట మద్యాహ్నాం ఎండ శరీరాన్ని తాకితే, సూర్యరశ్మిలోని ఆల్ట్రావయోలెట్ కిరణాలు చాలా హానికరంగా ఉంటాయి. మరి సూర్యరశ్మి వల్ల ఆరోగ్యానికి ఏవిధంగా ప్రయోజనం చేకూరుతాయో కొన్ని ఈక్రింది విధంగా అంధివ్వడం జరిగింది....

గాఢనిద్ర: ఒక రోజుకు మీరు ఎన్నిగంటలు నిద్రపోతారన్నది చాలా అవసరం. మన శరీరంలోని మెలటోనిన్ అనే హార్మోన్ రాత్రుల్లో నిద్రపోవడానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. సూర్యరశ్మి ప్రభావం వల్ల మన శరీరంలో పగలు మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల అవదు. రాత్రుల్లో మాత్రమే అవుతుంది. అందుకే రాత్రుల్లో బాగా నిద్రపడుతుంది.

బరువు తగ్గడానికి: సూర్యరశ్మి వల్ల మరో ఆరోగ్య ప్రయోజనం , ఉదయం సూర్యదోయం అయ్యే సమయంలో సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరం యొక్క బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అది కూడా మీకు సరైన నిద్రపొందడం కూడా ఒక రకంగా సమాయడపుతుంది. అందుకు మీ బరువును కూడా సరిగా మ్యానేజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం సన్ లైట్ మరియు బిఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్)కు మద్య అవినాభావ సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు.

వింటర్ డిప్రెషన్ తో పోరాడుతుంది: ఇది మీరు ఏ ప్రదేశంలో నివసిస్తున్నారో, ప్రదేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రోజులో ఎక్కువ సమయంలో డార్క్ గా ఉంటుందో, ముఖ్యంగా మలేషియాలో వంటి ప్రదేశంలో వారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటారు. దాంతో చాలా త్వరగా డిప్రెషన్ కు లోనవుతుంటారు. ఈ సమస్యకు చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ నేచురల్ సన్ లైట్.

హెల్తీ బోన్స్: సూర్యరశ్మి వల్ల ఆరోగ్యానికి మరో ముఖ్య ప్రయోజనం ఎముకలకు కావల్సినంత విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఈ విటమిన్ శరీరంలో కాల్షియం శోషణ చెందడానికి సహాయపడుతుంది. నేచురల్ సన్ లైట్ వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డిని సాల్మన్ చేపల్లో మరియు ఫోర్టిఫైడ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా కనుగొనపబడినది. అయితే సన్ లైట్ లో ఉండటం వల్ల చాలా సులభంగా మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

6 Reasons Why Sunlight Is Good For Health

ఇతర రోగాల నుండి రక్షణ కల్పిస్తుంది: తాజా పరిశోధన ప్రకారం శరీరంలో సరిపడా విటమిన్ డి ఉన్నట్లైతే అది కొన్నిప్రమాధకరమైన జబ్బులు హార్ట్ డిసీజ్ మరియు క్యాన్సర్ వంటి వాటిని రక్షణ కలిగిస్తుంది . కాబట్టి, ఈ నేచురల్ విటమిన్ డి ని సన్ లైట్ నుండి పొందవచ్చు. ఇది విటమిన్ డి సప్లిమెంట్ కంటే చాలా ఎక్కువ విలువలు కలిగి ఉంటుంది.

అటోఇమ్యూన్ డిసీజ్ ను నివారిస్తుంది: సూర్యరశ్మి వల్ల మన ఆరోగ్యానికి మరొక అద్భుతమైన ప్రయోజనం ఆటో ఇమ్యూన్ డీసీజ్ నుండి మనల్ని రక్షిస్తుంది . సూర్య రశ్మిలోని యూవిరేస్ హైపరాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ నివారించడానికి సహాయపడుతుంది. దాంతో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ను కూడా నివారించడానికి సహాయపడుతుంది.

English summary

6 Reasons Why Sunlight Is Good For Health

There are a lot of other things sun can do apart from providing light and heat on earth. There are various reasons why sunlight is good for health. The main source of vitamin D is sunlight. Lack of Vitamin D will cause metabolic bone diseases in children and many other common chronic diseases in adults.
Story first published: Wednesday, December 10, 2014, 11:32 [IST]
Desktop Bottom Promotion