For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Mental Health Day 2021: ఒత్తిడిలో మానసిక ఆరోగ్యం ఎలా మెరుగుపరుచుకోవాలంటే...

మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే...!

|

నేను ఎంత ఆనందంగా న్నాను? అనే ప్రశ్నతో మన ఆలోచనను ఆరంభిద్దాం. మొత్తం 100 శాతంలో నేను ఎంత శాతం ఆనందంగా ఉన్నాను? ఒకవేళ ఆనందంగా లేకపోతే ఎందుకు ఆనందంగా లేను? నేను ఎందులో ఆనందం వెదుక్కుంటున్నాను? - ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే అనేకానేక అంశాలను చర్చించాల్సి ఉంటుంది.

6 Tips for Improving Mental Health

ప్రస్తుతం సమాజంలో మనుష్యులు మానసిక ఆరోగ్యం దెబ్బ తిని బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. ఆధునిక సాంకేతిక పురోభివృద్ధి జరుగుతున్నా, అనేకానేక అవకాశాలు అందు బాటులోకి వస్తున్నా మనిషి మాత్రం ఆనందంగా ఉండలేకపోతున్నాడు. మానసిక సమస్యలకు గురవుతున్నాడు. వీటన్నిటికీ ప్రధాన కారణం యాంత్రికమయమైపోయిన జీవనవిధానం.

ప్రజలకు తమకు ఏమి కావాలనే అంశంపై స్పష్టమైన అవగాహన లేకపోవడం, అహం దెబ్బ తినడం, ఈర్ష్య, అసూయలు ఎక్కువ కావడం, లక్ష్యాలను సాధించలేకపోవడం, లైంగికపరమైన సమస్యలు, నిరాశానిస్పృహలకు గురి కావడం మొదలైన పలు అంశాలు మనిషి మానసికంగా కృంగిపోవడానికి, మానసిక సమస్యలకు గురి కావడానికి కారణమవుతున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రధా నంగా మానసిక ప్రశాంతతను పొందాలి. మానసిక ప్రశాంతత ద్వారా పలు మానసిక సమస్యలను నివారించుకోవచ్చు. తద్వారా శారీరక రుగ్మతలను కూడా నివారించు కోవచ్చు.

మానసిక ప్రశాంతత పొందడానికి కొన్ని చిన్న చిన్న సూచనలు పాటిస్తే సరిపోతుంది. వాటిని ఇక్కడ పొందుపరుస్తున్నాం.

ధ్యానం :

ధ్యానం :

ఇటీవలి కాలంలో తరచుగా వినిపిస్తున్న పదం ఇది. వైద్యులందరూ కూడా ధ్యానం ప్రాముఖ్యత గురించి చెబుతున్నారు. కేవలం కళ్లు మూసుకు కూర్చున్నంత మాత్రాన అది ధ్యానమనిపించుకోదు. అలా కూర్చున్న సమయం లో మీకు వస్తున్న ఆలోచనలపై దృష్టి సారించండి. వాటిని నిలువరిస్తూ ఆలోచనా రహిత స్థితికి చేరడానికి యత్నించండి. అలాగే మనస్సును గమనిస్తుండండి. చంచలమైన మనస్సును కట్టడి చేయడానికి యత్నించండి. ముందుగా మూడు రోజులపాటు ధ్యానం చేయండి. ఆ తరువాత మరొక మూడు రోజులు పొడిగించండి. ఇలా అలవాటు చేసుకుంటూ వెళ్లండి. ఇలా తొమ్మిది రోజులు చేసిన తరువాత నెమ్మదిగా మీ శ్వాసను గమనించండి. ధ్యానం చేస్తున్న సమయంలో మీరు నిద్రలోకి జారుకోవచ్చు. దానిని కూడా గమనించడానికి ప్రయత్నించండి. నిద్ర వస్తుంటే బలవంతంగా ఆపడానికి ప్రయత్నించకండి. ఈ ప్రక్రియ చాలా సహజంగా జరిగేలా చూసుకోండి. మీ వ్యక్తిత్వాన్ని పరిశీలించుకోండి. మీ ఆలోచనా సరళి, కోపతాపాలు మొదలైన వాటిని విశ్లేషించుకోండి. వాటినుంచి బైటపడటానికి కృషి చేయండి.

డైరీ :

డైరీ :

మీరు రోజూ డైరీ రాయడం అలవాటు చేసుకోండి. దానిలో మీకు ఉన్న సమస్యలను క్రమబద్ధంగా రాయండి. అతి సాధారణ స్వల్ప సమస్యనుంచి అతి పెద్ద సమస్య వరకూ రాసుకోండి. దీనివల్ల మీకు సమస్య ఎక్కడ ఉందనే విషయం తెలుస్తుంది. ఏ కారణంగా ఆ సమస్య ఉద్భవించిందో అర్థం చేసుకుని, దానిని పరిష్కరించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించుకోెండి.

కుటుంబంతో గడపండి :

కుటుంబంతో గడపండి :

వారానికి ఒక రోజు పూర్తిగా కుటుంబ సభ్యులతో గడపండి. అందరూ కూర్చుని వివిధాంశాలను చర్చించండి. ఆ వారంలో మీరు ఏం చేశారు? రానున్న వారంలో ఏం చేయాలను కుంటున్నారు? అనే విషయాలు చర్చించండి. అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఏమైనా సమస్యలున్నాయా? వాటిని పరిష్కరించడ మెలా? అనే విషయాలపై దృష్టి సారించండి.

ఆర్థిక లేదా కుటుంబ సమస్యలు:

ఆర్థిక లేదా కుటుంబ సమస్యలు:

మీ సమస్యలు ఆర్థికపరమైనవా, కుటుంబ సమస్యలా, లైంగిక జీవనానికి సంబంధించినవా లేక ఇతర అంశాలకు చెందినవా అనే విషయాలను తెలుసుకోండి. మీ జీవిత భాగస్వామితో ఆయా అంశాల గురించి సమగ్రంగా చర్చించండి.

సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించండి:

సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించండి:

సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడి దానిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి తప్ప దానినుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించవద్దు. సమస్య ఎంతటిదైనా, ఎలాంటిదైనా దానికి తప్పకుండా పరిష్కారం ఉంటుంది. మీ సమస్యను మీరు ఒక్కరూ పరిష్కరించుకోలేకపోతే మీ సన్నిహితుల సలహాలు , సూచనలు తీసుకోండి.

ఎప్పుడూ ఆనందంగా ఉండండి.

ఎప్పుడూ ఆనందంగా ఉండండి.

మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరూ ఆనందంగా ఉండేలా చూడండి. ఇతరులకు చిన్న చిన్న సహాయాలు చేయండి. అవసరానికి సహాయపడినందుకు వారు మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తారు. ఇది మీకు ఎంతో తృప్తినిస్తుంది. ఈ తృప్తి మానసికోల్లాసాన్ని, మానసికానందాన్ని కలిగిస్తుంది.

FAQ's
  • ప్రపంచ మానసిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం ప్రపంచ మానసిక దినోత్సవం (World Mental Health Day) అక్టోబర్ 10వ తేదీన జరుపుకుంటారు.

English summary

6 Tips for Improving Mental Health

Enjoying mental health means having a sense of wellbeing, being able to function during everyday life and feeling confident to rise to a challenge when the opportunity arises. Just like your physical health, there are actions you can take to increase your mental health. Boost your wellbeing and stay mentally healthy by following a few simple steps.
Desktop Bottom Promotion