For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పని ఒత్తిడిని తట్టుకోవడానికి 8 సాధారణ మార్గాలు

|

ఉద్యోగస్తులు ఎదుర్కునే అతిసాధారణ ఆరోగ్య సమస్యలలో ఒత్తిడి ఒకటి. ఒక వ్యక్తీ జీవితంలో ఒత్తిడి పెరిగితే అతను వ్యక్తిగతంగా తన సామర్ధ్యాన్ని, ప్రశాంతతను కోల్పోతాడు. పని ఒత్తిడి నిరంతరం ఉంటుంది. ఈరోజు మీరు ఒత్తిడిగా ఉండి, రేపు అన్నీ సర్దుకుంటాయి అనే ఆలోచనను మీరు విరమించండి.

ఒత్తిడికి గురయ్యే ప్రతిఒక్క ఉద్యోగస్తులకు ఆ ఒత్తిడి వారి ఆరోగ్యమే కాకుండా మానసిక పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తుంది. అనేక ఆరోగ్య, చర్మ సమస్యలకు మూల కారణాలలో ఒత్తిడి కూడా ఒకటి. పని ఒత్తిడి పెరగడం, చివరి తేదీ, రుచిలేని కాంటిన్ ఆహరం, విసిగించే సహచరులు, వృత్తిపరమైన రాజకీయాలు, అన్నిచోట్లా బాస్ వీటివల్ల మనిషి మెదడులో ఒత్తిడి చాలా ఏర్పడుతుంది! ఒత్తిడి అనేది కేవలం మీ మనసుకి, ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ సంబంధాలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఈ పని ఒత్తిడి పెరగడం వల్లే అనేకమంది భార్యాభర్తలు ఉద్యోగపరంగా, వ్యక్తిగత జీవితాన్ని నిలకడగా ఉంచుకోలేక చాలా బాధపడుతున్నారు.

ఒత్తిడి(స్ట్రెస్)తో అధికంగా బాధపడుతున్నారనడానికి సంకేతాలివే: క్లిక్ చేయండి

పోటీ లేదా చాలెంజ్ లు పెరిగితే ఒత్తిడి కూడా పెరుగుతుంది. పని ఒత్తిడి మీ పనితనంపై ప్రభావితం చూపిస్తుంది, మీ శారీరక, మానసిక స్థితిపై ప్రభావితం చూపిస్తుంది. ఒత్తిడి అనేది ఒక మనిషికి ఒక మనిషికి వేరుగా ఉంటుంది, కానీ పని ప్రదేశంలో ఒత్తిడిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది మీరు తప్పక తెలుసుకోవాలి. ఒత్తిడిని నిరోధించి, ఆరోగ్యంగా, సంతోషంగా పనిచేసుకోవడానికి ఇక్కడ అనేక మార్గాలు ఉన్నాయి. మీరూ ఒత్తిడికి గురయ్యే ఉద్యోగస్తులైతే, ఇక్కడ కొన్ని పని ఒత్తిడిని తగ్గించుకొనే ఉత్తమ, సులభమైన మార్గాలు ఇవ్వబడ్డాయి. ఎటువంటి కష్టం లేకుండా మీ పనిలో మెరుగుదలను ప్రదర్శించడానికి, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సులభమైన మార్గాలు ఇవ్వబడ్డాయి.

రోజంతా పనిఒత్తిడితో అలసిపోతే, విశ్రాంతి పొందే చిట్కాలు: క్లిక్ చేయండి

దీర్ఘ శ్వాస:

దీర్ఘ శ్వాస:

మీ పని ఒత్తిడిని తగ్గించుకుని, ప్రశాంతంగా ఉండడానికి మంచి మార్గాలలో ఇది ఒకటి. ఇది మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మీ భావోద్వేగాలను కూడా నియంత్రించడానికి సమర్ధవంతమైన మార్గం.

ప్రశాంతంగా ఉండడం:

ప్రశాంతంగా ఉండడం:

చాలామంది ప్రశాంతతని కోల్పోతారు, చివరకు పనిచేసే చోట అనవసర విషయాలు తీసుకుంటారు. బాధపడకండి అది ఒత్తిడివల్ల మాట్లాడడమే. పని ఒత్తిడిని పోగొట్టుకోవాలి అంటే మీరు మాట్లాడకుండా ఉండడం అవసరం. ఒంటరిగా లేదా మీ సన్నిహితునితో నడవండి.

తమాషాగా ఉండే కొన్నిటిని గమనించండి:

తమాషాగా ఉండే కొన్నిటిని గమనించండి:

మీరు ఒత్తిడిగా ఉన్నపుడు, మీరు నవ్వడం అవసరం. నవ్వు అనేది శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఔషధం. ఏదైనా తమాషాగా ఉండే వాటిని చూసి వృత్తిపరమైన ఒత్తిడిని తొలగించుకోండి.

కాఫీ వద్దని చెప్పండి:

కాఫీ వద్దని చెప్పండి:

పనిచేసేటపుడు కప్పుల కప్పుల కాఫీ ఒత్తిడిని తగ్గించడానికి మంచి ఔషధం అని చాలామంది అనుకుంటారు. కెఫీన్ అడేనోసిన్ ను వృద్ది చేసినట్లు సహజంగా ప్రశాంతత ఒత్తిడిని పరిష్కరించడానికి సహాయపడుతుంది.

ధ్యానం:

ధ్యానం:

వృత్తిపరమైన ఒత్తిడిని ఎదుర్కొనడానికి అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడానికి ధ్యానం అనేది ఉత్తమమైన మార్గాలలో ఒకటి. ధ్యానం రక్తప్రసరణను మెరుగుపరిచి, మీ మనసు, శరీరం ప్రశాంతంగా ఉండేట్టు చేస్తుంది.

మంచి ఆహరం తినండి:

మంచి ఆహరం తినండి:

కొన్ని ఆహార పదార్ధాలు మీ మానసిక స్థితిని మెరుగుపరిచి, మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. మీకు ఒత్తిడిగా ఉంది అనిపిస్తే, అల్మండ్స్, బ్లూ బెర్రీలు, ఆరంజ్ వంటి ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్ధాలను తీసుకోండి.

విటమిన్ C తీసుకోండి:

విటమిన్ C తీసుకోండి:

విటమిన్ C ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది ఒత్తిడిపై పోరాడి సహజంగా తగ్గించడానికి సహాయపడుతుంది. పని ఒత్తిడిని పరిష్కరించేందుకు మీ ఆహారంలో కారెట్లు, ఆరంజ్, సిట్రస్ పండ్లు ఉండేట్లు చూసుకోండి.

ఎక్కువ నీరు త్రాగడం:

ఎక్కువ నీరు త్రాగడం:

ఇది ఒత్తిడిని తగ్గించడానికి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడానికి మరో మార్గం. ఇది అలసటతో ఉన్న మీ కండరాలను శాంతపరిచి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేట్టు చేస్తుంది.

Desktop Bottom Promotion