For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం: 9 బెస్ట్ ఫుడ్స్

|

కాలుష్యం స్థాయిలు మరియు పొగ త్రాగే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అందువల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం ఒక విధంగా ఉంది. ఆరోగ్య చర్చల యొక్క దృష్టి మారింది.మీకు పొగ త్రాగే అలవాటు లేకపోతే, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రదానంగా హాని కలిగించే కారకాలుగా వాయు కాలుష్యం మరియు విబిన్న మూలాలు ఉన్నాయి. అంతేకాక తీవ్రమైన శ్వాస సమస్యలను ప్రేరేపిస్తాయి. COPD అంటే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల నిరోధక వ్యాధి అని అర్ధం. ఈ మధ్య కాలంలో ఇది పెద్దవారిలో ఎక్కువ మరణాలకు రెండవ ప్రధాన కారణంగా ఉంది. ఈ వ్యాసంలో,మేము ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం కొన్ని ఆహారాల గురించి చెప్పుతున్నాము. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఈ ఆహారాలు,మీ ఊపిరితిత్తులపై కాలుష్యం మరియు ధూమపానం ప్రభావాన్ని అరికట్టడానికి ప్రతి రోజూ సేవించాలి.

ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం ఈ ఆహారాల మీద ఒక లుక్ వేయండి. ఈ క్రింద పేర్కొన్న ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ఆహారాలు ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి. ఈ ఆహారాలు శ్వాస సమస్యల చికిత్సకు మరియు శ్వాస మెరుగుపరచడానికి సహాయపడతాయి.

కాబట్టి ముందుగా ఊపిరితిత్తులు శుభ్రం మరియు శ్వాస పెంచే ఈ శక్తివంతమైన ఆహారాలను చూద్దాం. ఇక్కడ ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కొరకు 9 ఆహారాలు ఉన్నాయి. పొగ త్రాగేవారు ఈ ఆహారాలను ఖచ్చితంగా తినాలి.

దానిమ్మపండ్లు

దానిమ్మపండ్లు

దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడాంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఊపిరితిత్తులలో కణితులను నివారించడంలో సహాయం చేస్తాయి. అంతేకాక అవి శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతమైన ఆహారాలుగా ఉన్నాయి. దానిమ్మ రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు ఎటువంటి సందేహం లేకుండా ఘాటుగా ఉంటాయి. కానీ వాటిలో ఉండే ఆవిర్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి.పొగ త్రాగేవారు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తప్పనిసరిగా ఉల్లిపాయలను తినాలి.

యాపిల్స్

యాపిల్స్

యాపిల్స్ లో ఫ్లేవనాయిడ్స్ మరియు విటమిన్లు E, B మరియు C ఉంటాయి. ఈ మూలకాలను అన్ని కలిసి అద్భుతమైన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పనిచేస్తాయి.

ద్రాక్ష పండు

ద్రాక్ష పండు

ద్రాక్షపండులో ఊపిరితిత్తులలో కంతి పెరుగుదలను బంధించి వేసే నరింగిన్ అనే కీలకమైన ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ద్రాక్ష పండ్లు అనేవి ఊపిరితిత్తుల శుభ్రంనకు అత్యంత ప్రభావవంతమైన ఆహారాలలో ఒకటి.వాటిలో ఎక్కువ పరిమాణంలో నరింగిన్ ఉంటుంది.

ఆరెంజ్స్

ఆరెంజ్స్

సిట్రస్ పండ్లు ఎప్పుడూ ఆరోగ్య ప్రయోజనాలకు ముందు ఉంటాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆరెంజ్ ఆరోగ్యవంతమైన సిట్రస్ పండ్ల లో ఒకటి ఇది ముఖ్యంగా పొగత్రాగేవారు తినటానికి ఒక అద్భుతమైన ఆహారం. అవి ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి.

క్యారెట్లు

క్యారెట్లు

క్యారెట్లు శ్వాస సమస్యలు నిరోధించడానికి సహాయం చేసే అద్భుతమైన ఆహారాలలో ఒకటి. దీనిలో A మరియు C విటమిన్స్ సమృద్దిగా ఉంటాయి. ఈ రెండు విటమిన్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

బీన్స్

బీన్స్

బీన్స్ లో అద్భుతమైన యాంటి క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. వీటిలో మెగ్నీషియం సమృద్దిగా ఉంటుంది. మెగ్నీషియం అనేది ఊపిరితిత్తుల ఆరోగ్యకరమైన పనితీరును నిర్ధారించటానికి కీలకంగా ఉంటుంది.

నట్స్

నట్స్

అక్రోట్,బాదం మరియు హాజిల్ నట్స్ వంటి వాటిలో యాంటీఆక్సిడాంట్స్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. అంతేకాక మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. అందువలన అవి సహజంగా ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి ఆరోగ్యకరమైన పదార్థాలుగా ఉంటాయి.

పసుపు

పసుపు

పసుపులో క్యాన్సర్ కణాలను నిర్మూలించే మరియు ఊపిరితిత్తులలో కంతి పెరుగుదలను నిరోదించే సుర్సుమిన్ అనే శక్తివంతమైన పదార్ధం కలిగి ఉంటుంది.

English summary

9 Must Have Foods For Healthy Lungs

With increasing levels of pollution and the number of smokers on a steep rise, lung health has, in a way, become the focus of health discussions. Even if you are a non-smoker, the exponential increase in air pollution caused by different sources can pose a major
Desktop Bottom Promotion