For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెడు శ్వాసను తగ్గించటానికి 9 సహజమైన మార్గాలు

By Super
|

పొడి నోరు,కొన్ని రకాల ఆహారాలు మొదలైన వాటి వల్ల చెడు శ్వాస కలుగుతుంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ దంతాలను బ్రష్ చేయటానికి రెస్ట్ రూంకి వెళ్ళటం సాధ్యం కాదు. అందువలన మార్కెట్లో అనేక రకాల నోటి ఫ్రెషనర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ మీ చెడు శ్వాసను తగ్గించటానికి మీ వంటగదిలో కొన్ని సహజ శ్వాస ఫ్రెషనర్స్ అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా? ఇక్కడ వాటి జాబితా ఉంది.

1.సోపు

1.సోపు

సోపు మామూలుగా భోజనం తర్వాత అజీర్ణం తగ్గిస్తుందనే నమ్మకంతో నములుతూ ఉంటాము. కానీ ఇది ఒక అద్భుతమైన నోటి ఫ్రెషనర్స్ అని మీకు తెలుసా? సోపు లాలాజలం ఉత్పత్తి పెరుగుదలకు మరియు చెడు శ్వాస కలిగించే జెర్మ్స్ మీద పోరాటం చేయటానికి సహాయం చేస్తుంది. అంతేకాక గ్యాస్ వల్ల వచ్చే త్రేన్పులు మరియు ఆమ్లం రిఫ్లక్స్ ను తగ్గించవచ్చు. మీరు కొన్ని గింజలను నమిలితే సహజంగా మీ శ్వాస బాగుంటుంది.

2.పుదీనా

2.పుదీనా

మార్కెట్లో అందుబాటులో ఉండే చాలా శ్వాస ఫ్రెషనర్స్ లలో ప్రధాన మూలవస్తువుగా పుదీనా ఉంటుంది. పుదీనా ఆకులను వంటకాలలో గార్నిషింగ్ కొరకు బాగా ఉపయోగిస్తారు. వాటి బలమైన మరియు శీతలీకరణ ప్రభావం వలన తక్షణమే మీ శ్వాస ఫ్రెష్ గా ఉంటుంది. కొన్ని ముడి పుదీనా ఆకులను నమలవచ్చు. అలాగే ఒక కప్పు పుదీనా టీను కూడా త్రాగవచ్చు.

3.సొంపు విత్తనాలు

3.సొంపు విత్తనాలు

ఇది డెసెర్ట్లకు మరియు బెక్డ్ ఉత్పత్తులలో ఒక ప్రముఖ వస్తువుగా ఉంది. మద్యం ఫ్లేవర్ కొరకు దీనిని ఉపయోగిస్తారు. వీటి లక్షణం తీపి,సుగంధ రుచి కలిగి ఉంటుంది. సొంపు విత్తనాలు బలమైన వాసన కలిగి ఉండుట వలన బాక్టీరియాను సమర్థవంతముగా ఎదుర్కొని శ్వాసను ఫ్రెషనర్ చేస్తుంది. మీరు వాటిని నమలవచ్చు. అలాగే ఒక సహజ మౌత్ వాష్ గా ఉపయోగించడానికి మరిగే నీటిలో వాటిని వేసి ఉపయోగించవచ్చు.(చదవండి: చెడు శ్వాస గురించి 10 కారణాలు తెలుసుకోండి)

4.పార్స్లీ

4.పార్స్లీ

పార్స్లీ వంటకు కాకుండా అలంకరణకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? పార్స్లీ జెర్మ్స్ ను ఎదుర్కోగల లక్షణాలు కలిగిన పత్రహరితాన్ని కలిగి ఉంటుంది. మీ భోజనం చివరిలో దానిని సేవ్ చేయండి. ఇది ఒక అద్భుతమైన శ్వాస సువాసన పదార్ధంగా ఉంటుంది. ఈ నూనెను శ్వాస ఫ్రెషనర్స్,సబ్బులు మరియు పరిమళ ద్రవ్యాలలో సువాసన కొరకు ఉపయోగిస్తారు.

5.లవంగము

5.లవంగము

లవంగము దాని రుచి మరియు వాసన కోసం వంటలలో ఉపయోగిస్తారు. అన్ని వయసుల వారికీ పంటి నొప్పి తగ్గటానికి దీనిని ఉపయోగిస్తారు. అంతేకాక టూత్ పేస్టు మరియు మౌత్ వాష్ లలో కూడా ఉపయోగిస్తారు. మంచి శ్వాస డియోడోరైజెర్ గా పనిచేస్తుంది. లవంగాలలో యాంటీ బాక్టీరియల్ యూజెనాల్ సమృద్ధిగా ఉంటాయి.మీరు కొన్ని లవంగాలను నమలండి.(చదవండి: పది చెడు శ్వాస భూతాలను ఓడించండి)

6.దాల్చిన చెక్క

6.దాల్చిన చెక్క

దాల్చిన చెక్క కూడా ఒక బాక్టీరియా లక్షణాన్ని కలిగి చెడు శ్వాసను తగ్గించే ఒక సుగంధ ద్రవ్యం. మీరు దాల్చిన చెక్కను నమలవచ్చు. అలాగే ఒక కప్పు టీలో జోడించవచ్చు. అంతేకాక నీటిలో దాల్చిన చెక్క వేసి కాచి,చల్లారిన తర్వాత ఒక మౌత్ వాష్ గా ఉపయోగించవచ్చు.(చదవండి: దాల్చిన చెక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు)

7.యాలకులు

7.యాలకులు

ఏలకుల గింజలు ఒక సుగంధ ద్రవ్యం. ఇది తీపి రుచి కలిగి మరియు మీ శ్వాస మంచిగా ఉండటానికి ఉపయోగించవచ్చు. కేవలం చెడు శ్వాస వదిలించుకోవటం కోసం మీ నోటిలో వేసుకొని కొన్ని నిమిషాల పాటు నమలండి. మీ భోజనం ఎండింగ్ లో ఏలకులు టీ అనేది ఒక చెడ్డ ఆలోచన కాదు.

8.సిట్రస్ పండ్లు

8.సిట్రస్ పండ్లు

నారింజ,నిమ్మ వంటి సిట్రస్ పండ్లు మీ లాలాజల గ్రంథుల ఉద్దీపనకు సహాయం మరియు లాలాజలము ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. లాలాజలం ఫలకం ఉత్పత్తి ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. అలాగే నోటిలో పేరుకుపోయిన మృత కణాలు మరియు ఆహార కణాలను తొలగించడానికి సహాయపడుతుంది.(చదవండి: మీ నోటి ఆరోగ్యం గురించి మీకు ఏమి తెలుసు?)

9.కొత్తిమీర

9.కొత్తిమీర

ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వంటి బలమైన వాసనలు గల ఆహారాలు చెడు శ్వాసకు కారణం అవుతాయి. కొత్తిమీర దీనిని నిర్మూలించటానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. నోటి వాసనను నివారించేందుకు మీ భోజనం తర్వాత కొన్ని తాజా కొత్తిమీర ఆకులను నమలండి. మీరు ధనియాలను వేయించి కొంచెం ఉప్పు జోడించి మౌత్ ఫ్రెషర్ గా ఉపయోగించవచ్చు.

English summary

9 ways to lose bad breath naturally

Certain foods, dry mouth, etc. can leave you with bad breath. But when you are on the go you cannot always rush to a restroom to brush your teeth. There are many mouth fresheners that are available in the market.
Story first published: Sunday, February 16, 2014, 10:56 [IST]
Desktop Bottom Promotion