For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు: నివారణ చర్యలు

By Derangula Mallikarjuna
|

మగవారిలో ప్రొస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌ను ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రొస్టేట్ గ్రంథి వాల్‌నట్ ఆకారంలో ఉండే చిన్న గ్రంథి. వీర్యంలో కనబడే ద్రవపదార్థాన్ని ఇది తయారు చేస్తుంది. వీర్యకణాలను మోసుకెళ్లడానికి ఈ ద్రవపదార్థం ఉపయోగపడుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా పెరుగుతుంది. మొదటిదశలో ఇది ప్రొస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో చికిత్స అవసరం అతి తక్కువగా ఉంటుంది. లేదా అసలు అవసరం రాకపోవచ్చు.

కానీ కొన్ని రకాల ప్రొస్టేట్ క్యాన్సర్లు వేగంగా విస్తరిస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే అంటే గ్రంథికి పరిమితమైన దశలోనే గుర్తిస్తే చికిత్స సులభవుతుంది. అయితే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు బయట పడకపోవచ్చు. వ్యాధి తీవ్రమైన దశలో మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం, మూత్రం ధారగా రాకపోవడం, కాళ్లవాపు, ఎముకలలో నొప్పి, పొత్తికడుపు ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పురుషులూ మీ ప్రొస్టేట్ ఆరోగ్యం గురించి హెచ్చరిక: క్లిక్ చేయండి

ప్రొస్టేట్ క్యాన్సర్ రావడానికి కచ్చితమైన కారణాలు చెప్పలేము. వయసు మీద పడటం కుటుంబంలో ఇకరికైనా ప్రొస్టేట్ క్యాన్సర్ ఉండటం స్థూలకాయం వంటివి కారకాలు కావడానికి అవకాశం ఉంది. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను విస్మరిస్తే అది ఇతర భాగాలకు వ్యాపించడం, అంగస్తంభన సమస్యలు మొదలైనవి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించడానికి పురుషులు సపోర్ట్ తీసుకోవాలి మరియ క్రమంగా నిర్వహించడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించవచ్చు ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించేందుకు ఉత్తమ మార్గాలు

రెగ్యులర్ చెకప్: రోగ నిర్ధారణ పరీక్షలు :

రెగ్యులర్ చెకప్: రోగ నిర్ధారణ పరీక్షలు :

మూత్ర విజర్జన చేయడాన్ని పరీక్షించడం లాంటి ఇతర పరీక్షలు. దీన్ని ఒక ఎక్ట్రానిక్‌ మీటర్‌ను ఉపయోగించి చేస్తారు. మూత్ర విసర్జన వేగం తగ్గితే, అది బిపిహెచ్‌ అని నిర్ధారించుకోవచ్చు. మూత్రాశయాన్ని ఎంత బాగా ఖాళీ చేస్తున్నారో చూడటాన్ని ‘పొస్ట్‌వాయిడ్‌ రెసిడ్యుయల్‌' అనే పరీక్ష చేస్తారు. నలభై నుంచి యాభై ఏళ్లపైబడిన వాళ్లు ప్రతి సంవత్సరం సెరమ్‌ ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజైన్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, మూత్ర సంబంధిత ఇబ్బందులుంటే కూడా చేయించుకోవాలి.

క్యాన్సర్ కిల్లింగ్ ఫుడ్స్ తినాలి :

క్యాన్సర్ కిల్లింగ్ ఫుడ్స్ తినాలి :

రోజూలో సరైన సమయానికి టైమ్ ప్రకారం భోజనం చేయాలి. మరియు క్యాన్సర్ క్లిల్లింగ్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవడం కూడా చాలా సులభం. ఇవి చాలా సాధరణమైన ఆహారాలు. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి ఉదాహరణకు క్రూసిఫెరస్ కూరగాయలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ, కేలా, వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను చేర్చుకోవాలి. వీటిలోని సల్ఫర్ కంటెంట్ బ్రేక్ డైన్ చేసి ఫాలీన్యూట్రియంట్స్ గా మార్పు చెంది గ్రహించడంతో ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారించబడుతుంది.

సప్లిమెంట్స్:

సప్లిమెంట్స్:

న్యూట్రీషియన్ డైట్ తో పాటు నేచురల్ సప్లిమెంట్ ను తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ హెల్త్ కు చాలా సహాయపడుతుంది. ప్రొస్టేట్ పెరగకుండా కాపాడుతుంది. యూరినరీ అర్జెంజెన్సీ, యూరినరీ ఫ్రీక్వెన్స్ లేదా పెల్విక్ పెయిన్ వంటి లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

ప్రొస్టేట్ క్యాన్సర్ కు కారణం అయ్యే ఆహారాలను నివారించాలి:

ప్రొస్టేట్ క్యాన్సర్ కు కారణం అయ్యే ఆహారాలను నివారించాలి:

కొన్ని రకాల ఆహారాలు ప్రొస్టేట్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి రెడ్ మీట్, ఎరుపు మరియు శుభ్రపరచిన మాంసాలు ఎక్కువగా తినటం వలన అనేక అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రొస్టేట్ కాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.కాబట్టి తీసుకోవడం నివారించాలి. రసాయనాలలో నిల్వ ఉంచిన మాంసం మార్కెట్ లో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. గొడ్డు మాంసం, పంది మాంసం,గొర్రె,దూడ మరియు కోళ్ళకు హార్మోన్లు,యాంటీబయాటిక్స్ మరియు ఉత్ప్రేరకాలను ఉపయోగించి సంప్రదాయ పద్ధతులలో పెంచుతారు. అలా పెంచిన జంతువుల మాంసంను తినకూడదు. ఒకవేళ తింటే ప్రోస్టేట్ మరియు మొత్తం ఆరోగ్యం మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది.

 గ్రీన్ టీ త్రాగాలి:

గ్రీన్ టీ త్రాగాలి:

గ్రీన్ టీ త్రాగాలి: గ్రీన్ టీ త్రాగే పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ లు తగ్గినట్లు కనుగొనబడింది. కాబట్టి, డైలీ డైట్ లో గ్రీన్ టీలో చేర్చుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన లక్షణాలను తీసుకొస్తుంది.

కెమికల్స్ మరియు టాక్సిన్స్ ను నివారించాలి:

కెమికల్స్ మరియు టాక్సిన్స్ ను నివారించాలి:

అవి ఒక వేళ కనిపించకపోవచ్చు, కానీ అవీ ప్రతి చోటా ఉంటాయి. ప్రతి పదార్థంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. కెమికల్స్ మరియు టాక్సిన్ కలిగినటువంటి ప్రొస్టేట్ క్యాన్సర్ ను పెంచుతాయి .

ఒమేగా 3 అధికంగా ఉండే చేపలను తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించవచ్చు

ఒమేగా 3 అధికంగా ఉండే చేపలను తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించవచ్చు

ఒమేగా 3 అధికంగా ఉండే చేపలను తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించవచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్ అభివ్రుద్ది చెందకుండా కాపాడుతుంది . కాబట్టి వారంలో ఒకసారి ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన చేపలను మీ డైట్ లో చేర్చుకోండి.

మెడిటేషన్ మరియు యోగా:

మెడిటేషన్ మరియు యోగా:

డైట్ ప్లాన్ తో పాటు సరైన మెడిటేషన్, యోగా వంటివి క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మెడిటేషన్ విశ్రాంతి పొందడానికి , ఒత్తిడి తగ్గించుకోవడానికి మాత్రమే కాదు, ఇంకా అనేక విధాలుగా మనకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఒత్తిడి వల్ల క్యాన్సర్ కూడా ఏర్పడుతుందని చాలా అద్యయనాలు నిరూపించాయి. కాబట్టి, యోగా, వ్యాయామం వంటివి చేయాలి.

వ్యాయయం :

వ్యాయయం :

వ్యాయామం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అనేక రకాల క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. ముఖ్యగా పురుషల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

Desktop Bottom Promotion