For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్ టీ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

By Super
|

ఎక్కువగా త్రాగే టీ రకాలలో ఒకటి బ్లాక్ టీ. ఇటువంటి టీ కామెల్లియా సినెసిస్ అని పిలువబడే పొద ఆకుల నుండి లభిస్తున్నది మరియు ఇది, ఆకుపచ్చ, తెలుపు మరియు ఊలాంగ్ టీ రకాల కంటే ఆమ్లజనీకృతంగా ఉంటుంది. ఈ టీ ఇతర రకాల కంటే బలమైన రుచి కలిగి ఉంటుంది.

టీ యొక్క లిక్కర్ చిక్కటి ముదురు రంగు కారణంగా దీనికి బ్లాక్ టీ అనే పేరు వొచ్చింది. దీనిని జాగ్రత్తగా గమనిస్తే, ఇది సాధారణంగా నారింజ లేదా ముదురు కాషాయంరంగులో ఉంటుంది. చైనీస్ వారు దీనిని రెడ్ టీ గా పిలుస్తారు. ఈ టీలో కెఫిన్ పదార్ధం గురించి తెలుసుకోవలసి ఉంది. ఒక కప్పు బ్లాక్ టీలో, ఒక కప్పు కాఫీలో కనిపించే కెఫిన్ లో సగం ఉంటుందని అంటారు.

మనం తీసుకునే ఆహారంలో భాగంగా బ్లాక్ టీని పరిగణించినట్లయితే పోషకాహార పట్టికలో భాగంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టీ ఆకులలో ఎక్కువగా ఆక్సీకరణ గుణం ఉండటంవలన చాలా రుచిగా ఉంటుంది మరియు ఇతర రకాల టీల కంటే కెఫిన్ పదార్ధం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ టీలో ఇతర రకాల టీల కంటే ఎక్కువ సమయం రుచి,సువాసన ఉంటుంది. .బ్లాక్ టీ వలన కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.

హృదయనాళ వ్యవస్థకు కలిగే ప్రయోజనాలు

హృదయనాళ వ్యవస్థకు కలిగే ప్రయోజనాలు

బ్లాక్ టీ వినియోగించటం వలన హృద్రోగ సమస్యలు రాకుండా నిరోధించవోచ్చని పరిశోధనలు చెపుతున్నాయి.దీనిలో LDL కొలెస్ట్రాల్ ఆక్సీకరణ కాకుండా నిరోధించే ఫ్లేవనాయిడ్స్ వంటి అనామ్లజనకాలు ఉన్నాయి. రక్తప్రసరణలో కలిగే అడ్డంకులను మరియు ధమని గోడల నష్టం తగ్గుతుంది మరియు గుండెజబ్బులు కూడా తగ్గుతాయి. బ్లాక్ టీ త్రాగటం వలన ఎండోథెలియల్ వాసోమోటార్ పనిచేయకపోవటం వలన వొచ్చే కొరోనరీ ఆర్టరీ వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. ఫ్లేవనాయిడ్స్ రక్తం గడ్డలు ఏర్పడకుండా ఉంచడంలో మరియు పరిహృదయ రక్తనాళాల వ్యాకోచము తగ్గించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. మాంగనీస్ మరియు పాలిఫేనోల్స్, గుండె కండరాలను ఆరోగ్యకరంగా ఉంఛి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించేందుకు సహాయపడతాయి.

క్యాన్సర్ అరికడుతుంది

క్యాన్సర్ అరికడుతుంది

బ్లాక్ టీలో కనిపించే పాలిఫేనోల్స్ వంటి అనామ్లజనకాలు.పురీషనాళ, ప్రోస్టేట్, అండాశయ, ఊపిరితిత్తుల మరియు మూత్రాశయం వంటి శక్తివంతమైన క్యాన్సర్ శరీరంలో ఏర్పడకుండా నిరోధిస్తాయి. బ్లాక్ టీ, రొమ్ము, ప్రొస్టేట్ మరియు కడుపు క్యాన్సర్ నిరోధించడానికి సహాయపడుతుంది. TF-2 అనే మిశ్రమం ఈ టీలో ఉన్నందువలన క్యాన్సర్ కణాలను చంపేస్తుంది మరియు సాధారణ కణాలను చెక్కుచెదరనివ్వక ఉంచుతుంది. బ్లాక్ టీ త్రాగటం వలన సిగరెట్ త్రాగేవారిలో లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను తీసుకునేవారిలో వొచ్చే నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బ్లాక్ టీ, కణుతులు ఎర్పడటాన్ని మరియు పెరుగుదలను నిరోధిస్తుంది.

ఫ్రీ రాడికల్ నిర్మూలన

ఫ్రీ రాడికల్ నిర్మూలన

ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరంలో క్యాన్సర్, ఎథెరోస్క్లెరోసిస్ మరియు రక్తం క్లాట్ ఏర్పడి చాలా హాని జరుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం వలన శరీరంలో ఎక్కువగా ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరుగుతున్నది. బ్లాక్ టీలో అనామ్లజనకాలు ఉండటంవలన ఈ ఫ్రీ రాడికల్స్ ను తొలగించి విభిన్నమైన వ్యాధులబారి పడకుండా శరీర రక్షణకు సహాయపడుతున్నాయి. బ్లాక్ టీ, ఇటువంటి నివారణకు ఒక మంచి ఔషధంవంటిది.

నిరోధక వ్యవస్థను పెంచుతుంది

నిరోధక వ్యవస్థను పెంచుతుంది

అనారోగ్యం కలిగించే వివిధ వైరస్ లు మరియు బాక్టీరియాతో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటం అవసరం. బ్లాక్ టీలో ఉన్న టానిన్ పదార్థాలు ఇన్ఫ్లుఎంజా, జలుబు ఫ్లూ, విరేచనాలు, హెపటైటిస్ మరియు ఇతర వైరస్ లను ఎదుర్కునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కేట్చిన్ అనే ఒక రకమైన టానిన్ కణితులు అణచివేయడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీలో ఉన్న ఆల్క్య్లమిన్ జనకాలు వ్యాధినిరోధక స్పందనలను పెంచడానికి సహాయపడుతుంది. రోజుకు బ్లాక్ టీ 3-4 కప్పులు త్రాగితే ఒక రకమైన శోథలు, అలాగే హానికరమైన వ్యాధికారకాలను తగ్గించుకోవొచ్చు.

నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది

నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది

బ్లాక్ టీలో ఉన్న కేట్చిన్ అనామ్లజనకాలు నోటి క్యాన్సర్ తగ్గించడంలో సహాయపడతాయి. టానిన్ మరియు పాలిఫేనోల్స్ లో ఉన్న యాంటీబయాటిక్స్ దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. బ్లాక్ టీలో ఫ్లోరైడ్ ఉండటం వలన నోటి దుర్వాసనకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా నుండి విముక్తిని కలిగిస్తుంది బ్లాక్ టీని రెండు కప్పులు త్రాగటం వలన నోటి ఆరోగ్యానికి కావలసిన ఫ్లోరైడ్లు లభిస్తాయి.

మెదడు మరియు నాడీ వ్యవస్థకు ప్రేరణ

మెదడు మరియు నాడీ వ్యవస్థకు ప్రేరణ

బ్లాక్ టీ లో కెఫిన్ కంటెంట్ తక్కువ స్థాయిలో ఉండటంవలన పరిమితిని దాటి గుండె ఉత్తేజపరిచే కాఫీలో ఉండే అధిక కెఫీన్ లాగా కాకుండా సురక్షితంగా ఉద్రేకభావాలు లేకుండా మెదడుకు సాఫీగా రక్తసరఫరా జరగటానికి సహాయపడుతుంది. బ్లాక్ టీలో ఉన్న ఎమైనో ఆమ్లం, L-తియానిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు పనులమీద ధ్యాసను కేంద్రీకరించటానికి సహాయపడుతుంది. నెలలో నాలుగు కప్పుల బ్లాక్ టీ రోజువారీ తీసుకున్నట్లయితే కార్టిసాల్ హార్మోన్ వలన వారి ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. కెఫిన్, జ్ఞాపకశక్తి మరియు మానసిక చురుకుదనం పెరాగడానికి సహాయపడుతుంది. ఇది పార్కిన్సన్ వ్యాధి నుండి కూడా రక్షిస్తుంది.

జీర్ణశక్తి ప్రయోజనాలు

జీర్ణశక్తి ప్రయోజనాలు

బ్లాక్ టీలో టానిన్ ఉండటం వలన జీర్ణశక్తికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వివిధ రకాల పేగు మరియు గ్యాస్ట్రిక్ వ్యాధులను ఎదుర్కోవడానికి మరియు థెరపిక్ ప్రభావాలను కలిగి ఉన్నది. ఈ టీలో వ్యతిరేక-అతిసారం ప్రభావం ఉండటం వలన ప్రేగు కార్యాచరణకు తోడ్పడుతుంది. బ్లాక్ టీలో ఉన్న పాలిఫేనోల్స్ , ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కలిగించే పేగు మంటను తగ్గించటంలో సహాయపడుతుంది.

ఎముకలు మరియు కణజాల ఆరోగ్యము

ఎముకలు మరియు కణజాల ఆరోగ్యము

బ్లాక్ టీలో శక్తివంతమైన ఫైటోకెమికల్స్ ఉండటం వలన ఎముకలు అలాగే కణజాలం బలోపేతంగా తయారవటానికి సహాయపడుతుంది. బ్లాక్ టీ తాగేవారు ఆరోగ్యకరమైన ఎముకలు కలిగి ఉన్నారని పరిశోధనలో కనుగొన్నారు.

అధిక శక్తి స్థాయిలు

అధిక శక్తి స్థాయిలు

బ్లాక్ టీ తాగేవారందరు, ఒక శక్తివంతం పానీయం త్రాగుతున్నట్లుగా కనుగొన్నారు. దీనిలో కెఫిన్ స్థాయిలు మద్యస్థంగా ఉండటంతో చురుకుదనం మరియు మెదడు పనితీరు పెంచడానికి ఒక ప్రేరణలాగా పనిచేస్తుంది. బ్లాక్ టీలో ఉన్న కెఫిన్, కాఫీ లేదా కోల వంటి పానీయాలలో ఉన్న కెఫిన్ కంటెంట్ కంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టీలో ఉండే థియోఫిలిన్ మిశ్రమపదార్ధం, మూత్రపిండాలు, గుండె మరియు శ్వాసనాదీవ్యవస్థ ప్రేరణకు సహాయపడుతుంది.. ఇటువంటి మిశ్రమపదార్తాలు ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థను మెరుగ్గా ఉంచటంలో సహాయపడతాయి.

అధికబరువు తగ్గడానికి సహాయపడుతుంది

అధికబరువు తగ్గడానికి సహాయపడుతుంది

బ్లాక్ టీలో కొవ్వు, కేలరీలు మరియు సోడియం తక్కువగా ఉండటం వలన ; ఇది బరువు కోల్పోవాలి అని అనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కార్బోనేటేడ్ పానీయాలు వంటి అనారోగ్య పానీయాలకు ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తుంది మరియు అదనపు కేలరీలను నివారిస్తుంది. ఇది జీవక్రియ కార్యకలాపాలు పెంచడానికి మరియు బరువు కోల్పోవడంలో సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

బ్లాక్ టీ, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించటంలో.సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ లేదా LDL స్థాయిలను తగ్గించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ధమనుల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇతర ప్రయోజనాలు

ఇతర ప్రయోజనాలు

ఈ టీలో ఉండే కాటెచిన్స్ అనే అనామ్లజనకాలు రక్త నాళాలు బలోపేతం చేయటంలో సహాయపడతాయి మరియు టానిన్ శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది. కణితి పెరుగుదల, అలెర్జీలను కూడా తగ్గిస్తుంది మరియు మధుమేహవ్యాధి రాకుండా కూడా నిరోధిస్తుంది..

English summary

Amazing Health Benefits of Black Tea

One of the widely consumed tea is black tea. Such a tea is obtained from the leaves of the shrub known as Camellia sinesis and it is more oxidized than the green, white and the oolong tea varieties. It has a stronger flavor than other varieties of tea.
Desktop Bottom Promotion