For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ కుర్చాన్: స్పెషల్ వెజిటేరియన్ రిసిపి

|

పనీర్ కుర్చాన్ నార్త్ ఇండియన్ డిఫ్. ముఖ్యంగా పంజాబీ ట్రెడిషనల్ డిష్. అయినా ఈ పనీర్ కుర్చాన్ ను మన ఇండియాలో ప్రతి రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల్లో తయారుచేస్తారు. ముఖ్యంగా ఇది ఇక రెస్టారెంట్ రిసిపి. కుర్చాన్ అంటే, వివిధ రకాల మసాలాను దంటించి తయారుచేయడం. ఈ వంటకు కొన్ని బేసిక్ మసాలా దినుసులను ఉపయోగించడం వల్ల మంచి టేస్ట్ మరియు ఫ్లేవర్ కలిగి ఉంటుంది.

పనీర్, క్యాప్సికమ్ రెండూ ప్రధానమైన వెజిటేరియన్ వస్తువులుగా ఉపయోగించి, దీన్ని తయారుచేస్తారు. ఇది చాలా స్పైసీగా మరియు టేస్టీగా నోరూరిస్తుంటుంది. ఇది ఒక అద్భుతమైన, రుచికరమైన డిష్ . పనీర్ కుర్చాన్ ను చాలా సులభంగా, త్వరగా తయారుచేయడానికి ఈ క్రింది పద్దతిని అనుసరించండి...

Paneer Khurchan Vegetarian Recipe

కావలసిన పదార్థాలు:
పనీర్: 50grm
గ్రీన్ క్యాప్సికమ్: 1
నూనె: 2tbsp
ఉల్లి తరుగు: 1/2cup
టొమాటో తరుగు: 1/2cup
పచ్చి మిర్చి తరుగు: 2tsp
టొమాటో గుజ్జు: 1cup
గరం మసాలా: 1tsp
బటర్: 50grms
క్రీమ్: 1/2cup
చాట్‌మసాలా పౌడర్: 1tsp
కారం: 1tsp
మెంతి ఆకులు: 2tsp(డ్రై)
ఉప్పు: రుచికి తగినంత
అల్లం తురుము: 1tsp
కొత్తిమీర: చిన్న కట్ట

తయారు చేయు విధానం:
1. ముందుగా పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
2. తర్వాత గ్రీన్ క్యాప్సికమ్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి.
4. తర్వాత అందులోనే టమాటో గుజ్జు, గరం మసాలా, బటర్, క్రీమ్, చాట్ మసాలా, కారం జత చేయాలి. తరిగిఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు, మెంతి ఆకులు, ఉప్పు వేసి బాగా వేయించాలి.
5. చివరగా అల్లం తురుము వేసి బాగా కలిపి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

English summary

Paneer Khurchan Vegetarian Recipe

Paneer khurchan is a delicious North Indian delicacy made with cottage cheese cooked in mild spices. Khurchan means scraping and thats how exactly this dish is cooked.Paneer Khurchan is a very spicy, tasteful, tantalizing, tempting recipe.It's very delicious and yummy recipe. Just follow our quicker and easier method to make / Prepare Paneer Khurchan and enjoy this luscious, mouth watering recipe.
Story first published: Thursday, October 9, 2014, 13:02 [IST]
Desktop Bottom Promotion