For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందారం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం...

By Mallikarjuna
|

మందార మొక్క అనేది ఉష్ణమండల మరియు వెచ్చని ప్రాంతాల్లో పెరిగే అందమైన పుష్పించే మొక్క. ఒక ప్రత్యేక అందం కలిగిన ఈ పుష్పాలు అనేక రకాల జాతులను కలిగి ఉన్నాయి. ఇది దక్షిణ కొరియా, మలేషియా మరియు హైతీ రిపబ్లిక్ యొక్క జాతీయ పుష్పంగా ఉన్నది. దీనిని దేవుని యొక్క అనేక ఆచారాలు మరియు సమర్పణలలో ఉపయోగిస్తారు. భారతదేశంలో ఒక పవిత్రమైన పుష్పంగా భావిస్తారు. దీనిని శతాబ్దాలుగా భారతీయ ప్రాచీన ఆయుర్వేద వైద్య వ్యవస్థలో అనేక రుగ్మతల చికిత్స కొరకు ఉపయోగిస్తున్నారు.

మందార ఆకులను మాములుగానే కాకుండా ఆరోగ్య పరంగా వివిధ రకాలా చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు. తోటలు మరియు పార్కులలో వివిధ రూపాలలో అలంకరణ కొరకు ఉపయోగిస్తారు. మందార ఆకులను వేర్వేరు ఉపయోగాల కోసం వివిధ రూపాలలో ప్రాసెస్ చేస్తారు. మెక్సికన్ వంటి వివిధ రకాల వంటకాల్లో ఎండిన మందార ఆకులను గార్నిష్ కొరకు ఉపయోగిస్తారు. వీటి పూలను ఉపయోగించి టీ ని తయారుచేస్తారు. దీనిని అనేక దేశాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

మందార నూనెతో అందం, యవ్వనం రెండూ సొంతమే:క్లిక్ చేయండి

మందార ఆకులలో ఉన్న ఔషధ ఉపయోగాల గురించి వివిధ రకాల పరిశోధనలు ద్వారా శాస్త్రీయంగా నిరూపణ జరిగింది. 2008USDA అధ్యయనం ప్రకారం మందార టీ తీసుకొనుట వలన రక్తపోటును తగ్గిస్తుందని తెలిసింది. ఆయుర్వేదంలో ఎరుపు మరియు తెలుపు మందారాలలో అధిక ఔషధ విలువలు ఉన్నాయని భావిస్తారు. వీటిని వివిధ రూపాలలో ఉపయోగించటం వలన దగ్గు చికిత్సకు,జుట్టు క్షీణత మరియు జుట్టు గ్రే కలర్ లో ఉండుటకు సహాయపడుతుంది. మందారంలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన యాంటీ వృద్ధాప్య ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు. మానసిక స్థితి సరిగా ఉండటానికి మందార ఆకు టీ ని వినియోగిస్తారు. ఇక్కడ మందార ఆకులు వలన మరిని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి...

క్యాన్సర్ తో పోరాడుతుంది:

క్యాన్సర్ తో పోరాడుతుంది:

మందారం ఆకులల్లో ఒక గ్రేట్ హెల్త్ బినిఫిట్ ఇది క్యాన్సర్ తో పోరాడుతుంది ఈ ఆకులను వేడినీటిలో వేసి, ఆ నీటిని త్రాగాలి. అలాగే క్యాన్సర్ కారణం వల్ల ఏర్పడ్డ గాయాల మీద ఈ ఆకుల యొక్క పేస్ట్ ను రాయవచ్చు.

తక్షణ ఎనర్జీనిస్తుంది మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది:

తక్షణ ఎనర్జీనిస్తుంది మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది:

తక్షణ ఎనర్జీనిస్తుంది మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది. మరియు ముఖ్యంగా మోనోపాజ్ స్త్రీలలో హాట్ ఫ్యాషెస్ ను కంట్రోల్ చేస్తుంది.

మొటిమలను నివారిస్తుంది & వ్రుద్యాప్యాన్ని అరికడుతుంది:

మొటిమలను నివారిస్తుంది & వ్రుద్యాప్యాన్ని అరికడుతుంది:

దీనిలో కాస్మెటిక్ చర్మ సంరక్షణకు ఉపయోగించే గుణాలను కలిగి ఉంది. సంప్రదాయ చైనీస్ ఔషధాలలో హైబిస్కస్ ఆకులతో అతినీలలోహిత రేడియేషన్ పీల్చుకునే యాంటీ సౌర ఏజెంట్ గా ఉపయోగిస్తారు. ముడుతలు వంటి అనేక చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. మొటిమలను అరికడుతుంది.

జీవక్రియలను పెంచుతుంది:

జీవక్రియలను పెంచుతుంది:

జీవక్రియల రేటును పెంచుతుంది. మరియు శరీరంలో లిక్విడ్ బ్యాలెన్స్ ను నిర్వహిస్తుంది. సహజ ఆకలిని తగ్గించి పథ్యసంబంధమైన బరువు తగ్గటానికి సహాయం చేస్తుంది. మందార ఆకు టీ త్రాగటం వలన మీ శరీరంలో అనవసరమైన కొవ్వును తగ్గుతుంది. అంతేకాక ఆహార జీర్ణక్రియకు మరింత సమర్ధవంతంగా సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

మందారం ఆకులతో మరో హెల్త్ బెనిఫిట్ ఇది కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గించి బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేస్తుంది.

జుట్టు రాలడం తగ్గిస్తుంది :

జుట్టు రాలడం తగ్గిస్తుంది :

మందార ఆకుల పేస్ట్ ను తలకు ప్యాక్ లా లేదా మందార నూనెతో తలకు రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్నితగ్గించడంతో పాటు, జుట్టు రాలడాన్ని అరికడుతుంది. జుట్టు రాలడానికి కారణం అయ్యే చుండ్రుకు ఈ నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మందార నూనె హెయిర్ మరియు స్లాప్ ను స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉంచుతుంది.

జలుబు మరియు దగ్గును నివారిస్తుంది:

జలుబు మరియు దగ్గును నివారిస్తుంది:

మందార ఆకులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మందార ఆకు టీ మరియు ఇతర పదార్దాల రూపంలో సేవించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా జలుబు మరియు దగ్గు తగ్గటానికి సహాయపడుతుంది. మీకు జలుబు చాల త్వరగా తగ్గటానికి సహాయపడుతుంది.

English summary

Health benefits of hibiscus leaves

Hibiscus is a flowering plant which is mostly found in tropical & subtropical regions around the world.Hibiscus is also known by other name as "marsh mallow". Hibiscus leaves are very common in India and used by ages in Ayurveda for cure of many ailments
Desktop Bottom Promotion