For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫింగర్ టిప్స్: మ్యాజిక్ హోం రెమెడీస్

By Super
|

ఆధునిక యాంటీబయాటిక్స్ మరియు మందులు రాక ముందే,ప్రకృతి తల్లి మనకు అన్ని రుగ్మతలను నయం చేయటానికి ఇంటి నివారణలను ఇచ్చెను. మీ సాధారణ నొప్పుల పట్ల శ్రద్ధ వహించడానికి కొన్ని ఇంటి పరిష్కారాలు ఉన్నాయి.

నిద్రలేమి

నిద్రలేమి

మీరు పడుకోవటానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో 10 బాదం పప్పుల పొడిని కలిపి త్రాగాలి. అంతేకాకుండా సాదా వెచ్చని పాలు కూడా ఒక మంచి రాత్రిని ప్రేరేపించడానికి ప్రసిద్ధి చెందింది. నిద్రవేళ ముందు మీ అరికాళ్ళకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి రాయండి. నీటితో కొబ్బరి నూనె కలిపి మీ తలపై రాయండి. అలాగే మీరు మంచం మీద పడుకోవటానికి ముందు అరచేతులు మరియు పాదాలకు కూడా రాయండి. ఇది మంచి నిద్రను కలిగిస్తుంది.

తిమ్మిరులు

తిమ్మిరులు

మీరు ప్రతి ఉదయం ఆవనూనెను ఉపయోగించి ఒక స్వీయ మర్దన చేయాలి.మీ అరచేతుల మధ్య కొద్దిగా నూనె తీసుకొని మీ శరీరం మొత్తం రుద్దాలి. తర్వాత ఒక షవర్ స్నానం చేయాలి. ఇది శీతాకాలంలో ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా నీటితో కొద్దిగా ఆవాలు పొడి కలిపి పేస్ట్ చేసి మీ అరచేతులు మరియు అరికాళ్ళకు రాయండి.

వడదెబ్బ

వడదెబ్బ

వడదెబ్బకు ఉత్తమ పరిష్కారంగా పచ్చి మామిడి,ఉప్పు మరియు పంచదారతో జ్యూస్ చేసుకోవాలి. ఒక రోజులో రెండుసార్లు లేదా మూడుసార్లు త్రాగవచ్చు. అంతేకాకుండా మీ తల మరియు నుదుటిపైన ఉల్లిపాయ ముక్కలను ఉంచితే చల్లని ప్రభావం ఉంటుంది. ఎక్కువగా ద్రవాలను త్రాగాలి.

తలనొప్పి

తలనొప్పి

మీకు ఒక సాధారణ మైగ్రైన్ సమస్య ఉంటే,మీ రోజువారీ ఆహారంలో వేడి పాలు మరియు ఐదు బాదం పప్పులు ఉండేలా చూసుకోండి. పాలలో తేనే మరియు ఒక గ్రాము నల్ల మిరియాలు కలిపి ఒక రోజులో రెండుసార్లు లేదా మూడుసార్లు త్రాగాలి.

మంచి ప్రయోజనకర పద్ధతిలో బాహ్య అనువర్తనాలు చాలా ఉన్నాయి. బాదం పప్పులను పేస్ట్ చేసి నుదురు మీద రాయవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా నుదురుపై రాయటానికి వేప పొడి కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది. నీటిలో కొన్ని చుక్కల ఎవా-డి-కొలోన్ కలిపి ఒక తడి వస్త్రంతో నుదురు మీద పట్టిలా వేస్తె చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

వెన్నునొప్పి

వెన్నునొప్పి

మీకు ఎడతెగని వెన్నునొప్పి సమస్య ఉంటే,మిమ్మల్ని వెచ్చగా ఉంచటానికి వేడి పదార్దాలను తినాలి. మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చండి. యూకలిప్టస్ ఆయిల్ తో స్వీయ మర్దన ప్రయోజనకర పద్ధతిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఆవనూనెలో సోంపు ఉడికించి ఉపయోగించవచ్చు.మీరు ఐదు నల్ల మిరియాలు,ఐదు లవంగాలు మరియు ఒక గ్రాము పొడి అల్లం పొడి మిశ్రమంను టీ లో వేసి మీరు ఒక రోజులో కనీసం రెండుసార్లు త్రాగవచ్చు.

ఆస్తమా

ఆస్తమా

మీ ఆహారంలో చల్లని మరియు సోర్ పదార్దాలను నివారించాలి. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ వాము వేసి బాయిల్డ్ చేయాలి. ఈ కషాయంలో కొద్దిగా ఉప్పు వేసి త్వరగా ఉపశమనం కోసం కనీసం ఒక రోజులో ఒకసారి త్రాగాలి.
ఎపిస్టాక్సిస్ (ముక్కు నుండి రక్తస్రావం)

ఎపిస్టాక్సిస్ (ముక్కు నుండి రక్తస్రావం)

ఇది దీర్ఘకాలిక సమస్యగా ఉంటే,ప్రతి రోజు గుల్ కంద్ తీసుకోవడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. ఉసిరి మురబ్బను కూడా తయారుచేసుకొని కూడా ప్రతి రోజు తీసుకోవచ్చు. తక్షణ ఉపశమనం కోసం,మీ నొసలు మరియు ముక్కు మీద మంచు నీటిలో ఒక కట్టు పట్టిలా వేయాలి.

English summary

Magic remedies at your fingertips

Much before the existence of pills and the modern antibiotics, Mother Nature offered a bountiful home remedies to cure all ills. Some home remedies to take care of your regular aches and pains
Desktop Bottom Promotion