For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీర్ఘకాలిక వ్యాధులను నయంచేసే టాప్10సూపర్ ఫుడ్స్

|

సాధరాణంగా వయస్సు పైబడే కొద్ది ప్రజల్లో దీర్ఘాకాలి వ్యాధులతో బాధపడుతుంటారు. ఇంతకీ దీర్ఘకాలిక సమస్య అంటే ఏమిటి? ఏళ్ల తరబడి వస్తూ, కొన్నిసార్లు తగ్గినా మళ్లీ తీవ్రతతో మాటిమాటికీ తిరగబెడుతూ వచ్చే ఆరోగ్య సమస్యలను దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంటారు. వ్యాధులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
1. తక్షణం వచ్చి ప్రభావం చూపే ‘తరుణ' వ్యాధులు (ఆక్యూట్)
2. తిరగబెడుతూ వచ్చి పోతుండే ‘దీర్ఘకాలిక' వ్యాధులు (క్రానిక్)

దీర్ఘకాలిక వ్యాధులుగా హైబీపీ, కీళ్లనొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, హైకొలెస్ట్రాల్, డయాబెటిస్ వ్యాధులను మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇవి 20 నుంచి 60 ఏళ్ల వారిలో 60శాతం మందిలో, 60 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం పైన కనిపిస్తూ ఉంటాయి. ఇలా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో వయసు పైబడుతున్న కొద్దీ ఒకటి కంటే ఎక్కువ సమస్యలు 77శాతం మందిలో కనిపిస్తుండటం సాధారణమే.

మన దేశంలో కూడా పొగాకు, ఆల్కహాల్, గుట్కా, డ్రగ్స్ తీసుకోవడం వల్ల చాలా దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయి. మధుమేహం, టీబీ, గుండెజబ్బులు, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎక్కువ.

క్రానిక్ డిసీజ్ అని గుర్తించడానికి అవసరమైన అంశాలు :
మళ్లీ మళ్లీ తిరగబెట్టడం ఒక వ్యాధి మూడు నెలలకు పైగా ఉండటం వంశపారంపర్యంగా రావడం నివసించే ప్రదేశాలు, తీసుకునే ఆహారం, పొగాకు నమలడం (ఏ రూపంలో అయినా)... వంటి అంశాల వల్ల వ్యాధి వచ్చి దీర్ఘకాలం బాధపడాల్సి రావడం మందులు వాడినప్పుడు ఉపశమనం ఉన్నా... మానేయగానే వ్యాధి తీవ్రత మళ్లీ పెరగడం చేసే వృత్తికి సంబంధించి వ్యాధి సంక్రమించి, పదే పదే బాధపెట్టడం, దీర్ఘకాలిక వ్యాధి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మారుతున్న జీవనశైలిలో హార్మోన్ల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కునే వైద్య విధానాలతో పాటు యోగా, వ్యాయామం, ఆహార, వ్యవహార శైలిపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆహారాల కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఇన్ఫ్లమేషన్, బాధకలిగించే సిగ్నెల్స్ బ్లాక్ చేసి, మెదడులో కెమికల్స్ ను పెంచి మరింత మంచి మూడ్ తో ఉండేలా చేస్తాయి. మరి దీర్ఘకాలిక వ్యాధులను నివారించి అటువంటి సూపర్ ఫుడ్స్ మీకోసం కొన్ని...

పెరుగు:

పెరుగు:

మీరు దీన్ని నమ్మలేకపోవచ్చు, రెగ్యులర్ గా డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల అది క్రోనిక్ పెయిన్ ను తగ్గిస్తుంది . పెరుగులో ఎముకల పెరుగుదలకు మరియు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే రెండు ప్రధాన న్యూట్రీషియన్స్ క్యాల్షియం మరియు విటమిన్ ద ఉన్నాయి. విటమిన్ డి క్రానిక్ పెయిన్ తగ్గిస్తుంది. ఇక క్యాల్షియం ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది.

మెంతి ఆకులు:

మెంతి ఆకులు:

గ్రీన్ లీఫ్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అదే విధంగా విటమిన్ కె అధికంగా ఉండి ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది మరియు జాయింట్స్ ను ఆరోగ్యకరంగా ఉంచతుంది . వయస్సు పైబడేటప్పుడు ఎవరైతే విటమిన్ కె తక్కువగా తీసుకుంటారు వారు ఆస్టియోఆర్థరైటిస్ సమస్యను ఎదుర్కొంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలతో పోరాడుతాయి. అలాగే వీటిలో సల్ఫర్ కాంపోనెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది టి హెల్పర్ సెల్స్ ఉత్పత్తి అయ్యేలా ఉద్దీపన కలిగిస్తుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచి శరీరంలో వాపులను మరియు నొప్పులను నివారిస్తుంది.

హాట్ పెప్పర్స్:

హాట్ పెప్పర్స్:

రెడ్ చిల్లీ క్యాప్సిసిన్ అనే యాక్టివ్ పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఎండోర్ఫిన్ ను ఉత్పత్తి అయ్యే విధంగా ఉద్దీపన కలిగిస్తుంది . దాంతో క్రానిక్ పెయిన్ నివారించబడుతుంది.

అల్లం:

అల్లం:

అల్లం ఒక బెస్ట్ నేచురల్ పెయిన్ కిల్లర్ . ఇందులో జింజరాల్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. అది క్రానిక్ పెయిన్(దీర్ఘకాలికనొప్పులను)తగ్గిస్తుంది. మీరు పచ్చిఅల్లను కొద్దిగా నోట్లో వేసుకొని నమలవచ్చు లేదా రోజూ రెండు మూడు కప్పుల అల్లం టీని త్రాగాలి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ఆస్పిరిన్ లేదా ఐబ్యూఫిన్ పనిచేసి క్రానిక్ పెయిన్ తో పోరాడుతుంది. ఇందులో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫాలీఫినాల్స్ పుష్కలంగా ఉండి, సాధారణ నొప్పిని తగ్గించడంలో ఇవి అద్భుతంగా సహాయపడుతాయి. ఇంకా ఇంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండి ఇది బాధకరమైన జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ప్రస్తుత రోజుల్లో ఆర్థరైటిస్ ప్రకారం, ఉల్లిపాయలు జాయింట్ పెయిన్స్ మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. ప్రధానంగా ఉల్లిపాయల్లో క్విర్సిటైన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, ఇది ఇన్ఫ్లమేషన్ కు కారణం అయ్యే వాటితో పోరాడుతుంది.

సాల్మన్:

సాల్మన్:

సీఫుడ్స్ లో ది బెస్ట్ ఫుడ్ సాల్మన్ ఫిష్ . ఇందులో ఒమేగా ఫ్యాటీ 3యాసిడ్స్ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఇది నొప్పిని నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.క్రానిక్ పెయిన్ కు మరియు విటమిన్ డి లోపానికి మద్య సంబంధం ఉన్నట్లు కనుగొనపబడింది. కాబట్టి సాల్మన్ ను బేక్ చేసి, గ్రిల్ చేసి లేదా రోస్ట్ చేసి తీసుకోవచ్చు.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

జ్యూసీ మరియు డెలిషియస్ స్ట్రాబెర్రీస్ రక్తంలో లోయర్ లెవెల్ సి రియాక్టివ్, మరియు శరీరంలో ఇన్ఫ్లమేషన్ సంకేతాలను తగ్గిస్తుంది. అధిక సిఆర్ పి లెవల్స్ గుండె సంబంధిత సమస్యలు స్ట్రోక్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి, యాంటీయాక్సిడెంట్స్ పవర్ ఫుల్ పెయిన్ రిడక్షన్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి, ఇది ఆరోగ్యపరంగా అన్నివిధాలా చాలా మంచిది.

పసుపు:

పసుపు:

మీ వంటగదిలోని మరో వస్తువు పసుపు . ఈ పసుపు క్రానిక్ పెయిన్ (దీర్ఘకాలిక నొప్పులను)నివారిస్తుంది . పసుపులో కుకుమిన్, యాంటీఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండి, పెయిన్ తో పోరాడుతాయి. ఇంకా పసుపు కణజాలాల డిట్రాక్షన్ నుండి జాయింట్ ఇన్ఫ్లమేషన్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే నరాలు బాగా పనిచేసుందుకు సహాయపడుతుంది.

English summary

Top 10 Superfoods to Curb Chronic Pain

Chronic pain is a pervasive problem that affects an estimated 116 million American adults. Defined as nerve or muscle pain, chronic pain can occur in the back, shoulders, pelvis, knees, head and other parts of the body. Inflammation is the main reason for chronic pain.
Desktop Bottom Promotion