For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో లైంగికశక్తి పెంచే హార్మోన్ల ఉత్పత్తికి: ఉత్తమ చిట్కాలు

|

టేస్టోస్టిరాన్: టెస్టోస్టిరాన్ అనేది మేల్ హార్మోన్. ఇది పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం అవుతుంది. మరియు హెల్తీ లవ్ లైఫ్ కు ఇది చాలా అవసరం. మగవాళ్ల మూడ్స్ మరియు పనితీరు, వారిలో ఎనర్జీలెవల్స్‌ను నిర్దేశించడంలో టెస్టోస్టిరాన్‌హార్మోన్‌ చాలా కీలకంగా పనిచేస్తుంది. అయితే ఈ టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ పరిమాణం శరీరంలో తగ్గే కొద్దీ పురుషుల్లో అన్ని రకాల ఎనర్జీస్‌తోపాటు, సెక్స్ సామర్థ్యం కూడా తగ్గుతుంది. పురుషుల్లోని వృషణాలకు దెబ్బ తగలడం, పిట్యుటరీ గ్రంథి సరిగా పనిచేయకపోవడం, బ్రెయిన్‌ ట్యూమర్‌, వయసు మీరిపోవడం, మద్యం సేవించడం, ధూమపానం, మానసిక వ్యాధులు అన్నీ కూడా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గడానికి కారణం అవుతాయిట. అయితే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లెవల్స్ పెరగడానికి ఓ చికిత్స విధానం కూడా ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల పదార్థాల్ని నిత్యం మన భోజనంలో తీసుకోవడం వలన టెస్టోస్టిరాన్‌ కచ్చితంగా పెరుగుతుంది.

టెస్టోస్టిరాన్ ను నేచురల్ గా పెంచుకోవాలంటే, అందుకు మీరు మందులు లేదా హార్మోనుల ఇంజెక్షన్ల మీద ఆధారపడవల్సి వస్తుంది. అలాకాకుండా సహజంగా నేచురల్ పద్దతులను టెస్టోస్టిరాన్ పెంచుకోవాలంటే, కొన్ని సింపుల్ డైటరీ ఆహారాలు తీసుకోవడం మరియు లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ లెవల్స్ పెంచుకోవడానికి సహాయపడుతుంది . ఆహారాల్లో జింక్ అధికంగా ఉండటం వల్ల, అవి మేల్ ఫెర్టిలిటికి మంచిది. మరియు హెల్తీ ఫ్యాట్స్, ముఖ్యంగా మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ లెవల్స్ పెరుగుతాయి.

లైంగిక సామర్థ్యంతో పాటు,ఎనర్జీనిచ్చే టాప్ 15 పవర్ ఫుడ్స్:క్లిక్ చేయండి

ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం మరియు మద్యం తీసుకోవడం వల్ల పురుష హార్మోనుల స్థాయిలో అంతరాయం కలుగుతుంది. కాబట్టి, పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెంచుకోవాలంటే, అనారోగ్యకరమైన అలవాట్లుకు దూరంగా ఉండాలి. ఈ మేల్ హార్మోన్ లెవల్స్ పెంచడంలో రెగ్యులర్ వ్యాయామంతో అద్భుతాలే జరగవచ్చు. కాబట్టి, నేచురల్ గా టెస్టోస్టిరాన్ పెంచుకోవాలంటే రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరి. వీటితో పాటు మరికొన్ని ఉత్తమ మార్గాలు...

పురుషుల మగతనానికి అత్యంత ముఖ్యమైన హార్మోన్ :క్లిక్ చేయండి

బరువు తగ్గించుకోవడం:

బరువు తగ్గించుకోవడం:

అధికబరువు ఉండటం వల్ల టెస్టో స్టిరాన్ లెవల్స్ లో వ్యత్యాసాలు ఏర్పడుతాయి . కాబట్టి, మీకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నట్లైతే మీలో హార్మోనుల లెవల్స్ యథావిథిగా తగ్గిపోతాయి.

మద్యం మానేయాలి:

మద్యం మానేయాలి:

లైంగిక సమస్యలకు మద్యం మాత్రమే కాదు, ఆల్కహాలిక్ డ్రింక్స్ కు సంబంధించిన ఏ డ్రింక్స్ అయినా సరే సెక్స్ హార్మోన్ల మీద ప్రభావం చూపుతాయి. బీర్ వంటివి కూడా టెస్టోస్టిరాన్ లెవల్స్ ను తగ్గించేస్తాయి.

బాగా నిద్రపోవాలి:

బాగా నిద్రపోవాలి:

ప్రతి రోజూ కనీసం6-8గంటల సేపు నిద్రపోవడం వల్ల శరీరంలో అన్ని అవయవాలు తగినంత విశ్రాంతి పొంది, టెస్టోస్టిరాన్ నేచురల్ గా పెరుగుతుంది.

రెగ్యులర్ డైట్ లో హెల్తీ ఫ్యాట్స్:

రెగ్యులర్ డైట్ లో హెల్తీ ఫ్యాట్స్:

మీ రెగ్యులర్ డైట్ లో లీన్ డైట్ ను చేర్చాలి. కానీ అన్ని రకాల ఫ్యాట్ ను మీ రెగ్యులర్ డైట్ నుండి కట్ చేయకూడదు. హెల్తీ మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఫిష్, ఆలివ్ ఆయిల్, వంటివాటిలోని ఫ్యాట్స్ టెస్టోస్టిరాన్ లెవల్స్ ను చాలా వేగంగా పెంచుతుంది.

జింక్ :

జింక్ :

పురుషుల ఆరోగ్యానికి అత్యవసరమైనది జింక్. జింక్ పురుషుల్లో సెమన్స్ ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా సహాయపడుతుంది. కాబట్టి, జింక్ అధికంగా ఉన్న ఓయిస్ట్రెస్ మరియు గుడ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

సూర్య రశ్మి:

సూర్య రశ్మి:

ఒక మంచి లిబిడో మరియు ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి, ఉదయం సూర్యరశ్మిలో ఎక్కువ సమయం ఉండటానికి ప్రయత్నించండి.

.ఒత్తిడి తగ్గించుకోవలి:

.ఒత్తిడి తగ్గించుకోవలి:

పురుషులు ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు, టెస్టోస్టిరాన్ స్థాయిలు పూర్తిగా తగ్గిపోతాయి. స్ట్రెస్ హార్మోనులు కార్టిసోల్ నల్ఫీస్ మీ శరీరంలోని టెస్టోస్టిరాన్ మీద ఆరోగ్యప్రభావాలను చూపుతుంది

పంచదారకు నో చెప్పండి:

పంచదారకు నో చెప్పండి:

మధుమేహం కలిగిన పురుషులో మేల్ సెక్స్ హార్మోనులు తక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో పంచదార లేదా గ్లూకోజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రక్తం టెస్టోస్టిరాన్ లెవల్స్ తగ్గేట్లు చేస్తుంది.

క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ తినాలి:

క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ తినాలి:

క్రూసిఫెరస్ వెజిటేబుల్ బ్రొకోలీ, కాలీఫ్లవర్, మరియు క్యాబేజ్ వంటి ఆహారాలు టెస్టోస్టిరాన్ లెవల్స్ ను పెంచే హార్మోనులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.

జిమ్:

జిమ్:

రెగ్యులర్ గా వ్యాయమం 30-45నిముషాలు చేయడం వల్ల ఒక మంచి ప్రత్యుత్పత్తి ఆరోగ్యానికి చాలా మంచిది . కాబట్టి, కార్డియో వ్యాయామంను ఒక రోజుకు కనీసం అరగంట పాటు చేయాలి.

వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం:

వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం:

టెస్టోస్టిరాన్ లెవల్స్ ను పెంచుకోవడానికి ట్రేడ్ మిల్ వ్యాయమం ఒక్కటి చేయడం సరిపోదు. కాబట్టి, టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉత్పత్తి చేసే బలమైన వ్యాయామాలు చేయాలి.

English summary

Ways To Increase Testosterone Naturally In Men

Testosterone is the male hormone that is essential for men's reproductive health and also for having a healthy love life. However, there is more to testosterone than just love making. Testosterone is healthy for men in many different ways.
Desktop Bottom Promotion