For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కండరాల నెప్పులకి 10 సమర్ధవంతమైన హోం రెమెడీస్

By Super
|

ఎప్పుడైనా మీకు వ్యాయామం తరువాత కాలిలో తీవ్రమైన నెప్పి లేదా లోపల నుండి బాగా లాగేస్తున్నట్లు అనిపించిందా?? లేదా పొద్దున్న నిద్ర లేవగానే తాజా గా ఉండటానికి బదులు తీవ్రమైన మెడ నెప్పి వల్ల బాగా బలహీనం గా అనిపిస్తోందా??అయితే కనుక పైన చెప్పిన రెండు సందర్భాలలో మీ కండరాల వల్లే మీకు ఆ బాధ.ఎక్కువ గా కండరాలు అలసిపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుంది.కండరాల నెప్పి చాలా సాధారణం. మనందరం జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు దీని బారిన పడతాము.

మన శరీరం మీద కండరాలు కవచం లా ఉండటం వల్ల శరీరం లో ఏ భాగం లోనైన కండరం నెప్పి రావచ్చు.ఈ నెప్పి కి అనంత కోటి కారణాలు.కొన్ని మందులు, లేదా ఫిబ్రోమ్యాల్జియా (కొన్ని కండరాలని అతిగా వాడటం) లేదా కండరాల మీద ఒత్తిడి వల్ల ఈ నెప్పి రావచ్చు.

READ MORE: కండరాల బెనుకు లేదా కండరాల నొప్పిని నివారించే 12 ఉత్తమ చిట్కాలు

ప్రతీ చిన్న లేదా కాస్త ఎక్కువ కండరాల నెప్పులకి వైద్యుడిని సంప్రదించడం అసౌకర్యం అని నా వ్యక్తిగత అభిప్రాయం.చిన్న చిన్న బెణుకులని సులువుగా హోం రెమెడీస్ తో నయం చేయవచ్చు.కింద ఇచ్చిన చిట్కాలు చూసి ఏదైనా ఒకటి పాటించి అలసిన మీ కండరాలకి ఉపశమనం ఇవ్వండి.

కండరాల నెప్పికి హోం రెమెడీస్-మీకు ఏది బాగా పనిచేస్తుందో చూడండి.

కాస్త విరామం తీసుకోండి

కాస్త విరామం తీసుకోండి

మీరు కనుక కాళ్ళు, చేతులు లేదా కండారల కదలికలు ఎక్కువ గా ఉండే వ్యాయామం లాంటిదేమైనా చేస్తుంటే మీ కండరాలు సలపడం సాధారణమే.అందువల్ల వాటి మీద కాస్త ఒత్తిడి తగ్గించడానికి కూర్చుని కాసేపు రిలాక్స్ అవ్వండి.మంచం మీద హాయిగా దుప్పటీ కప్పుకుని ఓ రెండు గంటలు పడుకోరాదూ??

.మినరల్ స్నానం

.మినరల్ స్నానం

ఎప్సం సాల్ట్ మెగ్నీషియుం మరియు సల్ఫర్ కలిగిన మినరల్.ఒట్టు, మా మాట నమ్మండి, ఎప్సం సాల్ట్ మీ కండరాల సలుపులని పోగొడుతుంది.మీ బాత్ టబ్ నిండా గోరు వెచ్చటి నీరు పోసి ఈ మ్యాజిక్ మినరల్ ఓ రెండు కప్పులు కలపండి. ఎప్సం సాల్ట్ నీటిలో కలిసేటట్లు చేతితో నీటిని తిప్పండి.ఓ అరగంట అందులో కూర్చుని చూడండి.. ఆశ్చర్య కరం గా ఎటువంటి ఔషధ చికిత్సా లేకుండానే చాలా హాయిగా అనిపిస్తుంది.

ఐస్ ప్యాక్

ఐస్ ప్యాక్

సలుపుతున్న కండరాల ఉపశమనానికి ఐస్ ప్యాక్ చికిత్స ఒక అధ్భుత విధానం.నెప్పి ఉన్న చోట ఐదు లేదా పది నిమిషాలపాటు ఐస్ ప్యాక్ ని పెట్టి తీసేసి మరలా ఓ ఐదు పది నిమిషాల తరువాత మరలా నెప్పి ఉన్న చోట పెట్టాలి.ఐస్ ప్యాక్ నెప్పి మరియు వాపు ని వెంటనే తగ్గిస్తుంది.

కండరాలని సాగదీయడం లేదా స్ట్రెచ్ చేయడం:

కండరాలని సాగదీయడం లేదా స్ట్రెచ్ చేయడం:

కండరాలు నెప్పిగా ఉంటే చిన్న చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు ప్రయత్నించండి. మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల కండరాలలో కదలిక ఏర్పడి అవి నెప్పితో మరింత బిగుసుకుపోవు.ఈ పద్ధతి కనడరాల నెప్పులని ఖచ్చితం గా నివారిస్తుంది.

.రోజ్ మేరీ

.రోజ్ మేరీ

రోజ్ మేరీ అధ్భుత రుచి , వాసన కలిగిఉండటంతో పాటు శ్రేష్టమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంటు,అనగా తాపాన్ని తగ్గిస్తుంది.అర లీటరు మరుగుతున్న నీటిలో తాజా లేదా ఎండబెట్టిన రోజ్మేరీ ని రెండు టేబుల్ స్పూనులు వెయ్యాలి.ఒక అరగంట అలా ఉండనిచ్చి దీనిలో ఓ బట్ట ని ముంచి నెప్పి ఉన్న కండరాల మీద వెయ్యాలి.ప్రతీరోజూ ఇలా రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల కండరాల నెప్పి నుండి కోలుకోవచ్చు.

స్విమ్మింగ్

స్విమ్మింగ్

కండరాల నెప్పి నుండి మీ ఆలోచనలని మళ్ళించడానికి స్విమ్మింగ్ ఒక సరదా యాక్టివిటీ. ఈతకొట్టడం వల్ల మీ కండరాలు సాగదీయబడి అదురుతున్న కండరాలని సైతం శాంతింపచేస్తుంది.మరింక ఆలశ్యమెందుకు?? వెంటనే ఒక స్విం సూట్ వేసుకుని ఈత కొలనులో మునగండి.కానీ ఒకవేళ మీరు కనుక "ఫైబ్రోమాల్జియా"(ఒక రకమైన కండరాల నెప్పి) తో బాధపడుతున్నట్లయితే కనుక జాగ్రత్త. చల్లని నీరు మీ నెప్పులని మరింత హెచ్చించవచ్చు .

ఆవనూనె అధ్భుతాలు

ఆవనూనె అధ్భుతాలు

ఆవనూనె నమ్మశక్యం గాని రీతిలో కండరాల నెప్పులని తగ్గిస్తుంది.ఇది ఒక అధ్భుత యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్.నెప్పి ఉన్న చోత కాస్త ఆవనూనె ని మృదువు గా మర్దనా చెయ్యండి.ఆవనూనె వాసన మీకు నచ్చకపోవచ్చు కానీ ఈ నూనె కండరాల నెప్పులని తగ్గించడం లో బాగా సహాయ పడుతుంది. ఆవ నూనె చర్మం లోనికి చొచ్చుకెళ్ళి సలుపుతున్న కండరాల నుండి ఉపశమనాన్నిస్తుంది.ఆవనూనె మర్దనా వల్ల క్రమం గా కండరాల శక్తి కూడా పెరుగుతుంది.

నీళ్ళు ఎక్కువగా తాగండి:

నీళ్ళు ఎక్కువగా తాగండి:

మన మనుగడ కి నీరు అత్యవసరం.మీరు దీర్ఘకాలికంగా కండరాల నెప్పులతో బాధ పడుతున్నట్లయితే కనుక మీరు నీరు తక్కువగా తీసుకుంటుండవచ్చు.పుష్కలం గా నీళ్ళు తాగడంవల్ల వల్ల కండరాలకి నీరు సమృద్ద్ధి గా అంది ఆరోగ్యం గా ఉంటాయి.

పొటాషియం

పొటాషియం

కండరాలని ఆరోగ్యం గా ఉంచడంలో పొటాషియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అరటిపళ్ళు,తృణధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పొటాషియం అంది కండరాల నెప్పుల మీద పోరాడడం లో సహాయపడుతుంది.

చెర్రీస్

చెర్రీస్

చెర్రీ జ్యూస్ తాగడం వల్ల మీ కండరాలు పునరుత్తేజం పొందుతాయి.యాంటీ ఆక్సిడెంట్లు అధికం గా ఉంటాయి ఈ జ్యూస్ లో. కనుక ఓ గ్లాసు చెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కండరాల నెప్పి మరియు ఇన్ ఫ్లమేషన్(ఎర్రబడి వాచి నెప్పిగా ఉండుట) ని నివారించవచ్చు. ఈ చిట్కాలు పాటించడానికి సులభం గా లేవూ?? అవును, పైన చెప్పిన చిట్కాలకి కావాల్సినవన్నీ మనింట్లో రెడీగా ఉంటాయి.మీ కండరాల నెప్పులనుండి ఉపశమనం పొందాలనుకుంటే కనుక వీటిల్లో ఏదో ఒక చిట్కా పాటించి తక్షణ ఉపశమనాన్ని పొందండి.

English summary

10 Effective Home Remedies For Muscle Pain: Health Tips in Telugu

Suffered from a twinge in your leg after a workout that feels like something is pulling it apart from the inside? Or a sore neck in the morning that makes you feel debilitated instead of bright and fresh? In both these instances, your muscle is what is suffering!
Desktop Bottom Promotion