For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెస్ట్ పెయిన్ కు తక్షణ ఉపశమనం కలిగించే ఉత్తమ హోం రెమెడీస్

|

మనం ఒక్కొక్కసారి ఛాతీలో నొప్పిని, ఆయాసాన్ని అనుభవిస్తుంటాం. ఇవి గుండె, ఆహారనాళాలకు సంబంధించిన వ్యాధుల వలన మాత్రమే కాక, ఛాతీ భాగంలో ఉండే ఊపిరితిత్తుల వల్ల కూడా కలుగవచ్చు. స్థూలకాయులలోనూ, 40 సంవత్సరాలు పైబడిన వారిలోనూ, హై బిపి, మధుమేహం వ్యాధి ఉన్నవారిలో, ధూమపానం చేసే వారిలో (వీరిని హైరిస్క్‌ గ్రూప్‌ అంటారు) ఛాతీలోని నొప్పి, ఆయాసం వస్తే, గుండెకు సంబంధించిన వ్యాధులేమైనా ఉన్నాయేమో అనుమానించాలి.

ఛాతీ ప్రదేశంలో ముందు భాగంలో గుండె, వెనుక భాగంలో ఆహార నాళం కొద్దిగా ఎడమవైపు ఉంటాయి. అందుకనే మనం ఒక్కొక్కసారి ఆహారనాళంలో (ఈసోఫేగస్‌) మంటను గుండె నొప్పిగా భ్రమపడుతుంటాము. అలా ఛాతీ నొప్పిగా ఉన్నపుడు ఆహార నాళాన్ని పరీక్ష చేయించుకోవాలి. ఛాతీ భాగంలోని ఛాతీకుహరంలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఛాతీలోని చర్మం, కండరాలు, ఎముకలు, ఊపిరి తిత్తుల వ్యాధులున్నా ఛాతీలో నొప్పి అనుభవమవుతుంది.

కాబట్టి, దేనివల్ల ఛాతీలోనొప్పి కలిగినా వెంటనే డాక్టర్ ను సంప్రధించి సమస్యను తెలుసుకోవడం చాలా ముఖ్యం. చెస్ట్ పెయిన్ కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తుంటే, లేదా చిన్న కారణాల వల్ల మాత్రమే చెస్ట్ పెయిన్ వస్తున్నా కొన్ని హోం రెమెడీస్ ద్వారా తగ్గించుకోవచ్చు. అయిదే తీవ్రస్థాయిలో నొప్పి, తరచూ ఇబ్బంది కలిగిస్తుంటే మాత్రం ప్రొఫిషనల్ డాక్టర్స్ ను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటి తీవ్రత నొప్పిని హోం రెమెడీస్ తో నివారించలేము. అదే గ్యాస్, స్ట్రెస్, కోల్డ్, ఆందోళన మరియు స్మోకింగ్ వంటి అలవాట్లు వల్ల చెస్ట్ లో పెయిన్ ఉన్నట్లైతే, హోం రెమెడీస్ ను ఉపయోగించి చెస్ట్ పెయిన్ నివారించుకోవచ్చు. ఇలాంటి కారణాల వల్ల మీలో కూడా ఛాతీ బాధిస్తుంటే, ఈ హోం రెమెడీలను ఉపయోగించండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఈ హోం రెమెడీస్ కు దూరంగా ఉండాలి.

తులసి:

తులసి:

తులసిలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చెస్ట్ పెయిన్ నివారించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది. చెస్ట్ పెయిన్ తక్కువగా ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులను నోట్లో వేసుకొని నమలాలి. చెస్ట్ పెయిన్ నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

చేపలు:

చేపలు:

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల నొప్పిని నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది . గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో ఇది ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది . అందుకు రెగ్యులర్ డైట్ లో సాల్మన్ ఫిష్ ను చేర్చుకోవాలి.

దానిమ్మ:

దానిమ్మ:

ఛాతీలో నొప్పిని నివారించడానికి దానిమ్మ గ్రేట్ గా సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా గ్రేట్ సహాయపడుటంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. గుండెకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా నివారించడం కోసం దానిమ్మను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

మందారం:

మందారం:

మందారంలో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ుంటాయి . కొన్ని గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో మందారం గ్రేట్ గా సహాయపడుతుంది . మందారం పువ్వులతో తయారుచేసిన టీని తీసుకోవడం వల్ల గొంతు నొప్పి మరియు చెస్ట్ పెయిన్ నుండి తక్షన ఉపశమనం కలిగించుకోచ్చు.

అల్లం:

అల్లం:

చెస్ట్ పెయిన్ నివారించే మరో పదార్థం అల్లం. ఈ వేరులో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఫ్లూ, జలుబు మరియు ఎసిడిటిని తగ్గిస్తుంది. కొద్దిగా అల్లంను నీళ్ళలో వేసి బాగా మరిగించి గోరువెచ్చగా తీసుకోవాడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి హార్ట్ కు చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, నియాసిన్, రిభోఫ్లోవిన్, థైయమిన్, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మరియు ఇతర అనేక న్యూట్రీషియన్స్ కలిగి ఉంటాయి. దగ్గు మరియు ఆస్తామా వంటి జబ్బులను తగ్గించడమే కాకుండా, చెస్ట్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేచిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ముందుగా వెల్లుల్లి రెబ్బను నమలండి.

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీసెప్టిక్, యాంటిబ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల అనేక వ్యాధులకు ఒక గొప్ప ఔషధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అదే విధంగా చెస్ట్ పెయిన్ నివారించడంలో కూడా పసుపు గ్రేట్ గా సమాయపడుతుంది . అందువల్ల ప్రతి రోజు మీరు వండే ఆహారాల్లో దీన్ని జోడించండం చాలా మంచిది

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్:

ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల చెస్ట్ పెయిన్ నివారించవచ్చు . అందుకు చాలా సాక్షాలు కూడా ఉన్నాయి.

హాట్ బెబరేజ్:

హాట్ బెబరేజ్:

చెస్ట్ పెయిన్ కు మరో ఉత్తమ హోం రెమెడీ. గ్యాస్ వల్ల చెస్ట్ పెయిన్ వస్తుంటే, వేడిగా ఒక కప్పు బెవరేజ్ తీసుకోవాలి .

బొప్పాయి:

బొప్పాయి:

కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు కొద్దిగా బొప్పాయి ముక్కను తీసుకోవడం వల్ల, ఇది నొప్పిని కొద్దిగా తగ్గించడానికి సహాయపడుతుంది.

English summary

10 Home Remedies For Chest Pain

There are certain remedies for chest pain. But there could be so many reasons for chest pain. Most of us associate chest pain to heart attack and so we tend to panic when there is a mild pain in the chest. At the same time, it doesn't mean that you must ignore when there is pain in the chest. Its is very important to quickly meet a doctor to get the problem identified at the earliest.
Story first published: Tuesday, January 27, 2015, 18:37 [IST]
Desktop Bottom Promotion