For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాయింట్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీస్

|

జాయింట్ పెయిన్ నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వాటిలో చాలా వరకూ ఉత్తమ ఫలితాలను అందించేవే. ఈ హోం రెమెడీస్ ను ఎటువంటి ఖర్చులేకుండా మీరు ఇంట్లోనే ప్రయత్నించవచ్చు . కొన్ని దీర్ఘకాలిక వ్యాధులైన టెండినైటిస్, బర్రైస్, గౌట్ మరియు ఆర్థరైటిస్ వంటివి జాయింట్ పెయిన్ కు ప్రధాన కారణం అవుతుంది. ఎప్పుడైతే మీ జాయింట్స్ నొప్పిగా అనిపిస్తుందో, అప్పుడు మన దినచర్య కొద్దిగా కష్టం అవుతుంది. అయితే నొప్పి ఒక తీవ్రస్థాయికి చేరిపనప్పుడు, డాక్టర్ ను సంప్రదించడం చాలా కష్టం అవుతుంది.

నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, సరైన జాగ్రత్తలు మరియు చికిత్సను తీసుకోవడం చాలా అవసరం. నొప్పి భరించలేనంత తీవ్రస్థాయిలోకి చేరుకుంటే, ఇలాంటి హోం రెమెడీస్ కూడా సరిగా పనిచేయవు . అయితే మీ జాయింట్ పెయిన్స్ చాలా సాధారణంగా లేదా తక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటి హోం రెమెడీస్ ను మీరు ప్రయత్నించవచ్చు. అయినా కూడా ఈ క్రింది ఉదహరించిన హోం రెమెడీస్ ఉపయోగించడానికి ముందు డాక్టర్ ను కలవడం చాలా అవసరం. మీరు ఉపయోగించే హోం రెమెడీస్ వేరే ఏ ఇతర మెడిసిన్ తో పాటు తీసుకోకూడదు. మరి జాయింట్ పెయిన్ నివారించే ఉత్తమ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

అల్లం

అల్లం

జాయింట్ పెయిన్ కోసం మీరు ఏం తీసుకుంటున్నారో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అల్లంను పేస్ట్ చేసి రోజుకు రెండు సార్లు జింజర్ టీ తీసుకోవడం చాలా అవసరం. టీలో కొన్ని చుక్కల తేనె చేర్చి తీసుకోవడం చాలా అవసరం.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

జాయింట్ పెయిన్ నివారించడంలో ఇది ఒక గ్రేట్ ఉత్తమ రెమెడీ. ఇది టాక్సిన్స్ ను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫాస్పరస్, పొటాషియం, క్యాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ చిట్కాలను అనుసరించడానికి కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్, తేనెను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి, భోజనం చేయడానికి ముందు రోజూ మూడు సార్లు తీసుకోవాలి.

హీట్ అండ్ కోల్డ్

హీట్ అండ్ కోల్డ్

జాయింట్ పెయిన్ నివారించడానికి హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్ ను ఉపయోగించాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో హీట్ ను అప్లై చేయడ వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాదు, రక్త ప్రసరణ బాగా జరిగి కండరాలను విశ్రాంతి పరుస్తుంది. ఐస్ ను నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది. దీంతో నొప్పి కంట్రోల్ అవుతుంది. వాపు తగ్గుతుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో మొదట వేడి అప్లై చేసి తర్వాత ఐస్ క్యూబ్ ను అప్లై చేయాలి. అయితే జాయింట్స్ లో నొప్పి, వాపు మరియు ఎర్రగా ఉన్నట్లైతే ముందుగా డాక్టర్ ను కలిసి ఆ తర్వాత ఈ హోం రెమెడీని ఉపయోగించవచ్చు.

ఎప్సమ్ సాల్ట్

ఎప్సమ్ సాల్ట్

శరీరంలో మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కూడా జాయింట్ పెయిన్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఇలాంటి హోం రెమెడీని ఉపయోగించాలి మీరు స్నానానికి వెళ్ళినప్పడు ఎప్సమ్ సాల్ట్ స్క్రబ్ చేసి లేదా వేడి నీళ్ళలో వేసి స్నానం చేయస్తే 25నిముషాల్లో తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బాడీ మసాజ్

బాడీ మసాజ్

జాయింట్ పెయిన్ నివారించడంలో మసాజ్ థెరఫీ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితమైన మసాజ్ ను చేస్తుంటే, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. రెగ్యులర్ గా మసాజ్ చేస్తుంటే జాయింట్స్ స్టిఫ్ గా మారుతాయి మరియు పెయిన్ నివారించబడుతుంది.

కేయాన్ పెప్పర్

కేయాన్ పెప్పర్

కెయాన్ పెప్పర్ చాలా వరకూ ఒక పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుందనికి చాలా పరిశోధనల్లో తేలింది. ఈ హోం రెమెడీ అనుసరించడానికి అరకప్పు కొబ్బరి నూనెలో కేయాన్ పెప్పర్ పౌడర్ ను వేసి పేస్ట్ లా మిక్స్ చేసుకొని, ఈ పేస్ట్ ను నొప్పి ఉన్న జాయింట్స్ మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత, మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తుంటే మంచి ఫలితం ుంటుంది . మీకు తెగిన గాయాలు, లేదా గాయల మీద పెప్పర్ ను ఉపయోగించకూడదు.

స్టింగింగ్ నేటెల్

స్టింగింగ్ నేటెల్

ఈ హెర్బ్ లో బోరాన్ కలిగి ఉంటుంది. ఇది జాయింట్ పెయిన్ నివారించడానికి ఉపయోగించుకోవచ్చు . అయితే ఈ హెర్బ్ జాయింట్ పెయిన్ నివారించడంలో ఇంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందన్న విషయం మనకు ఇంత వరకూ నిర్ధారణ కాలేదు. అయినా కొంత మంది నమ్మకంతో దీన్ని ఉపయోగిస్తుంటారు. వేడి నీళ్ళల్లో 15నిముషాల పాటు, నాటెల్ లీవ్స్ ను నానబెట్టుకోవాలి. తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేసి ఆ నీటిని త్రాగాలి. ఇలా ప్రతి రోజూ, వారం పాటు త్రాగినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. ఈ హోం రెమెడీ ఉపయోగించే ముందు డాక్టర్ ను సంప్రదించాలి.

మెంతులు

మెంతులు

మనందరీకి తెలుసు మెంతులు ఆంటిఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుందన్న విషయం మనందరికి తెలుసు. ఇంకా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి. ఈ హోం రెమెడీ ఉపయోగించడానికి ముందు, ఒక చెంచా మెంతి పౌడర్ తీసుకోవాలి. దాని తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగాలి . ఈ హోం రెమెడీ కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఉదయం అనుసరిస్తుండాలి.

పసుపు

పసుపు

జాయింట్ పెయిన్ నివారించడంలో పసుపు ఒక ఉత్తమ హోం రెమెడి. ఇది ఒక మంచి యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్. కొద్దిగా తేనె తీసుకొని అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి, ఈమిశ్రమాన్ని పాలలో మిక్స్ చేసి త్రాగాలి. ఇలా కొద్దిరోజుల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మీరు ఇప్పటికే వేరే ఏదైన వైద్యపరమైన చికిత్సను తీసుకుంటుంటే, ఈ హోం రెమెడీ ఉపయోగించడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

జాయింట్ పెయిన్ నివారించడంలో ఇది ఒక గ్రేట్ నేచురల్ రెమెడీ . మీరు జాయింట్ పెయిన్ తో బాధపడుతున్నట్లైతే, వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. వెల్లుల్లో సెలీనియం మరియు సల్ఫర్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ కూడా ఉంటాయి. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం వెల్లల్లి రెబ్బలు ఒకటి రెండు తీసుకోవాలి. ఈ హోం రెమెడీని కొన్ని రోజుల పాటు అనుసరిస్తుండాలి.

English summary

10 Quick Home Remedies For Joint Pain

There are so many remedies for joint pain. As most of them are home remedies, you can try them out without spending lot of money. Some disorders like tendinitis, bursitis, gout and arthritis can cause serious pain in the joints.
Desktop Bottom Promotion