For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలూ....మీ హార్ట్ ట్రబుల్లో ఉందని తెలిపే 10 లక్షణాలు

|

సాధారణంగా స్తీలలో హార్ట్ అటాక్ లక్షణాలు పురుషులలో మాదిరిగా తెలిసే విధంగా ఉండకపోవడం వల్ల గుర్తించడం కష్టం. అలాగే మహిళలు సహజంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఉన్నంత బాధ్యతగా తమ ఆరోగ్యం పట్ల ఉండకపోవడం వల్ల కూడా కొంత అశ్రద్ధ చేస్తారు. అందువల్ల సమస్య తీవ్రమయ్యే వరకూ చికిత్సకు కానీ, పరీక్షలకు కానీ వెళ్లరు. నిజానికి మహిళల రక్తనాళాలు పురుషులకంటే సన్నగా ఉంటాయి. కాబట్టి, మహిళల గుండె ఆరోగ్యానికి సంబంధించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారంతో పాటు, రెగ్యులర్ వ్యాయామం వల్ల హార్ట్ ను స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉంచుకోవచ్చు . ముఖ్యంగా హార్ట్ ఆరోగ్యం గురించి, లక్షణాలు గురించి, హార్ట్ సమస్యలను గురించి తెలుసుకొని ఉండటం మంచిది. తెలుసుకోవడం మాత్రమే కాదు, మనస్సులో ఉంచుకోవాలి. హార్ట్ సమస్యల గురించి తెలుసుకోకపోవడం లేదా లక్షణాలు కనిపించినా అశ్రద్ద చేయడం వల్ల ప్రస్తుత రోజుల్లో హార్ట్ అటాక్ మరియు హార్ట్స్ ప్రాబ్లెమ్స్ తో చనిపోయే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది.

రీసెంట్ గా జరిపిన పరిశోధన ప్రకారం, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా హార్ట్ అటాక్ మరియు గుండె జబ్బులతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. కాబట్టి మహిళల కోసం ప్రత్యేకించి ఈ ఆర్టికల్ ను మీకోసం తెలుగు బోల్డ్ స్కై అందిస్తోంది. మహిళలు, హార్ట్ సమస్యలు గురించి, మరియు హార్ట్ కు సంబంధించిన లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వీటిని అశ్రద్ద చేయడం వల్ల ప్రమాధకర స్థితి ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి మహిళలూ...మీరు ప్రమాదంలో ఉన్నారని తెలిపే హార్ట్ డిసీజ్ కు సంబంధించి కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా...

1. అలసట:

1. అలసట:

రోజంత ఎక్కువ అలసటకు గురి అవుతుంటే? ఇలా రెగ్యులర్ గా అనిపిస్తుంటే హార్ట్ ట్రబుల్ అని గుర్గించండి. మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరిగేటప్పుడు అలసటగా అనిపిస్తే అది హార్ట్ సమస్యల్లో ఒక లక్షణంగా గుర్తించాలి.

2. కాలు వాపులు:

2. కాలు వాపులు:

మీ కాళ్ళు మరియు చేతులు వాపులు ఉన్నట్లు మీరు గుర్తించారా? మీరు తీసుకొనే ఆహారంలో ఉప్పు అధికమైనా లేదా మరీ తక్కువైనా, అప్పుడు హార్ట్ సమస్యల్లో ఉందని గుర్తించాలి. కాళ్ళు చేతుల్లో చాలా సన్నని నరాలు ఉండటం వల్ల ఆ నరాల్లో సరిగా రక్త ప్రసరణ జరగకపోతే అప్పుడు కాళ్ళు, చేతులు వాపులు వస్తాయి. ఈ విషయాన్ని మహిళలు గుర్తించుకోవాలి.

3. చెస్ట్ పెయిన్ :

3. చెస్ట్ పెయిన్ :

చెస్ట్ పెయిన్. హార్ట్ ట్రబుల్లో ఉందని తెలిపే మరో లక్షణం . చెస్ట్ పెయిన్ రాత్రుల్లో ఎక్కువగా కనబడుతుంటుంది మరియు మీరు ఏదైనా చేస్తున్నప్పుడు సెడెన్ గా లేచినప్పుడు చెస్ట్ లో నొప్పిగా అనిపించడం . అలాంటి పరిస్థితుల్లో ఇసిజి తప్పనిసరి.

4. శ్వాసలో ఇబ్బందులు:

4. శ్వాసలో ఇబ్బందులు:

ముఖ్యంగా మహిళల్లో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. బ్రీతింగ్ ప్రాబ్లెమ్స్ అంటే గుండె సరిగా కొట్టుకోవడం లేదని గ్రహించాలి. రక్తనాళాల్లోకి రక్త ప్రసరణ సరిగా జరగడం లేదని గుర్తించాలి. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల శ్వాసలో ఇబ్బందులు ఏర్పుడతాయి.

5. తలతిరుగుట:

5. తలతిరుగుట:

ఏ కారణం లేకుండా తరచూ తలతిరిగినట్లు అనిపిస్తుంటే నిర్లక్ష్యం చేకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. తలతిరగడానికి గల కారణాలన్ని తెలుసుకొని, తగిన చికిత్స తీసుకొన్న తర్వాత కూడా అలాగే అగుపిస్తుంటే, హార్ట్ ఫంక్షన్స్ సరిగా జరగనప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

6. అజీర్థి:

6. అజీర్థి:

అజీర్థి వల్ల ఇతర అనారోగ్య సమస్యలు మరిన్నిఎదుర్కోవల్సి వస్తుంది . అజీర్థికి ట్రీట్మెంట్ తీసుకొన్న తర్వాత కూడా అదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే వెంటనే ఈసిజి తీయించుకొని తగిన చికిత్సను వెంటనే తీసుకోవాలి. పొట్ట అవయవాలకు సరిగా రక్త ప్రసరణ జరకపోతే, ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. దాంతో అజీర్తి సమస్యలకు గురి కావల్సి వస్తుంది.

7. నడిచే సామర్థ్యం లేకపోవడం:

7. నడిచే సామర్థ్యం లేకపోవడం:

5 నుండి 10 నిముషాలు నడిచిన వెంటనే అలసటగా అనిపించడం లేదా నడవడానికి శక్తిలేనంతగా ఫీలవ్వడం కూడా హార్ట్ డిసీజ్ లక్షణాల్లో ఒకటి. ముఖ్యంగా కాళ్ళు తిమ్మెర్లుగా అగుపించినప్పుడు ఫెరిఫెరల్ ఆర్టిరైల్ డిసీజ్ గా గుర్తించాలి

8. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్:

8. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్:

ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటే ఫాల్టీ వాల్వ్ చూపెడుతుంది . అలాంటి పరిస్థితుల్లో హార్ట్ పల్స్ చెక్ చేయించుకోవాలి . ఈ లక్షణాలను ఎంటి పరిస్థితుల్లోనూ నిరక్ష్యం చేయకూడదు .

9. అధికంగా చెమటలు పట్టడం:

9. అధికంగా చెమటలు పట్టడం:

మహిళల్లో అధికంగా చెమట పట్టడం కూడా హార్ట్ డిసీజ్ కు ఒక లక్షణంగా గుర్తించాలి. అధిక చెమట వల్ల ఎక్కువగా అలసిపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలను ఎట్టిపరిస్థితిలో నిర్లక్ష్యం చేయకూడదు.

10. హార్ట్ బీట్ మీరు వినగలుగుతారా?

10. హార్ట్ బీట్ మీరు వినగలుగుతారా?

హార్ట్ వాల్వ్ కొద్దిగా విస్తరించినప్పుడు హార్ట్ బీట్ బయటకు పెద్దగా వినబడుతుంది . ఈ లక్షణాన్ని కూడా ఏమాత్రం నిరక్ష్యం చేయకూడదు.

English summary

10 Signs Your Heart Is In Trouble, Ladies: Health Tips in Telugu

Today, heart attacks and heart diseases are raging over the world and it is only because we choose to ignore the signs of our heart being in trouble.A recent study shows that women are more prone to heart attacks and heart diseases when compared to men, which is why Boldsky shares this article with you.
Story first published: Thursday, October 29, 2015, 17:33 [IST]
Desktop Bottom Promotion