For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ నివారించుకోవడానికి 10 సింపుల్ చిట్కాలు

By Super
|

హార్ట్ బర్న్ మరియు ఎసిడిటిని(వైద్య పరిభాషలోగ్యాస్ట్రో ఎసోఫాజియల్ రిఫ్లెక్స్ వ్యాధి GERDఅని పిలుస్తారు)అనేదా ప్రస్తుత రోజుల్లో ఒక సాధారణ సమస్య అయిపోయింది. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ అనారోగ్యకరమైన అహారం తీసుకోండం మరియు స్పైసీగా ఉండే జంక్ ఫుడ్స్ కు అలవాటు పడటమే ప్రధానకరణంగా భావిస్తున్నారు. మరియు ఈ విషయంలో చాలా మంది ఏ చిన్నప్పటిగా కడుపులో, ఛాతీలో మంటగా అనిపించినా లేదా బాధ అనిపించినా, మరియు తరచూ స్టొమక్ అప్ సెట్ కు గురి అయ్యే వారు, తక్షణ ఉపశమనం పొందడం కోసం వెంటనే ఒక యాంటాసిడ్ టాబ్లెట్ తినేస్తుంటారు.

ఎసిడిటి-కడుపుమంటను తగ్గించే 14 సులువైన మార్గాలు

అంతే కాదు, అనుకున్న విధంగానే, యాంటాసిడ్స్ ఒక గంటలోపు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. కానీ, ఇలా ఎప్పుడూ యాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు ప్రభావం అవుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ మీద దుష్ప్రభావాన్నిచూపుతుంది. అందుకోసం, వీటికి ప్రత్యామ్నాయంగా ఈ క్రింది తెలిపిన కొన్ని మార్పులను మీ జీవనశైలిలో కనుక చేసుకొన్నట్లైతే మీరు హార్ట్ బర్న్, ఎసిడిటి ఫీవర్ నుండి దీర్ఘకాలిక ఉపశమనం పొందవచ్చు.

పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి:

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి:

ఎసిడిటి, హార్ట్ బర్న్ సమస్య ఉన్నవారు, కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ నుండి తొలగించాలి. ముఖ్యంగా కారం ఎక్కువగా ఉండే సమోస, బర్గర్, మరియు చిప్స్ , డిజర్ట్స్ లేదా స్వీట్స్ , చాక్లెట్స్ తో కలిపి డోనట్స్ మరియు కేక్స్ వంటి ముఖ్యమైన ఆహారాలను మీలో ఎసిడిటికి కారణం అయ్యే, ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచది. ఎసిడిటి ఉన్నవారు, సిట్రస్ పండ్లకు(ఆరెంజ్,ద్రాక్ష మరియు నిమ్మరసం) దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో ఉండే అధిక యాసిడ్ లెవల్స్ ఎసిడిటి లక్షణాలను మరింత ఎక్కువ చేస్తుంది.

మీరు తీసుకొనే ఆహారం పద్ధతులను మార్చుకవాలి:

మీరు తీసుకొనే ఆహారం పద్ధతులను మార్చుకవాలి:

మీరు ఆహారంగా ఏం తీసుకుంటున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారన్నది కూడా ముఖ్యమే. మీరు తీసుకొనే ఆహారం యొక్క పరిమాణం అర్ధాంతరంగా జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. భోజనాని మద్యలో ఎక్కువ విరామం తీసుకొనే వారు అధికంగా ఆహారాన్ని తీసుకుంటారు . అధికంగా తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కు దారితీస్తుంది. దాంతో ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి అవ్వడానికి కారణం అవుతుంది . దీనికి ప్రత్యామ్నాయంగా రోజులో 4నుండి 5సార్లుగా కొద్దిపరిమాణంలో తీసుకోవడం ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

నిధానంగా తినాలి:

నిధానంగా తినాలి:

2003లో కనుగొన్న ఒక పరిశోధన ప్రకారం డైజస్టివ్ డిసీజ్ , 30నిముషాలు భోజనం చేసేవారిలో 8.5ఆసిడ్ రిఫ్లెక్షన్ కు గురిఅయితే, 5నిముషాల్లో భోజనం ముగించే వారిలో 12.5ఎసిడ్ రిఫ్లెక్షన్ఉత్పత్తి అవుతుందని నిర్ధారించారు. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లాలు ఏర్పడటానికి కారణం అవుతుందని నిర్ధారించారు. తీసుకొనే ఆహారంను నిధానంగా బాగా నమిలి తినడం వల్లఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

పొట్టనిండుగా తినేసి, వెంటనే నిద్రించకూడదు:

పొట్టనిండుగా తినేసి, వెంటనే నిద్రించకూడదు:

మీరు ఎప్పుడైతే, రాత్రుల్లో ఆలస్యంగా భోజనం చేస్తారు, అప్పుడు మీరు చాలా అలసటగా భావిస్తారు . ఈ అలవాటును మీరు ఖచ్చితంగా మార్చుకోవల్సి ఉంటుంది.ఎప్పుడైతే మీరు నిద్రకు ఉపక్రమిస్తారు, అప్పుడు మీ శరీరంలో అవయవాలు పనిచేయడం తగ్గుతుంది. ఫలితంగా జీర్ణసమస్యలు, ఎసిడిటికి కారణం అవుతుంది. కాబట్టి, మీరు నిద్రించడానికి కనీసం 2నుండి మూడు గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.

ఫిట్ గా ఉండాలి:

ఫిట్ గా ఉండాలి:

ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల వివిధ రకాలా ఆరోగ్యసమస్యలకు అనుసందానంకలిగి ఉందన్న విషయం మనకు తెలిసిందే. యాసిడ్ రిఫ్లెక్షన్ మరో ఈ లిస్ట్ లో మరో చేరిక వంటిది . న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం సన్నగా, ఫిట్ గా ఉన్నవారితో పోల్చితే,ఎవరైతే ఊబకాయంతో ఉన్నారో వారిలో రెండు మూడు సార్లు ఎసిడిటికి తరచుగా కారణం అవుతుంది.

నీరు ఎక్కువగా తీసుకోవాలి:

నీరు ఎక్కువగా తీసుకోవాలి:

యాసిడ్ రిఫ్లెక్షన్ కు ఉత్తమహోం రెమెడీ, నీరు. ఇది ఎసిడిటిని మాత్రమే తగ్గించడం కాదు, జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు అన్ని రకాలుగా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. జనరల్ డైజెస్టివ్ డిసీజ్ అండ్ సైసెన్సె స్టడీ ప్రచురించినవిధంగా ఎసిడిటిని ఎదుర్కోవడంలో నీళ్ళు చాలా ప్రధానమైనవి .

కాఫీని తీసుకోవడం నివారించాలి:

కాఫీని తీసుకోవడం నివారించాలి:

కాఫినేటెడ్ బెవరేజ్ కాఫీ, టీ, కోలా మొదలగు, ఎసిడిటికి కారణం అయ్యే కేఫినేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది . మరియు అందుకు ఎటువంటి నిర్ధారణ లేదు లేదా కాఫినేటెడ్ బెవరేజస్ గ్యాస్టిక్ పిహెచ్ లో మార్పులతో యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది . కాబట్టి,కెఫిన్ కు సంబంధించిన ఎటువంటి పానీయాలనైనా నివారించాల్సిందే.

ఆల్కహాల్ ను పరిమితం చేయాలి:

ఆల్కహాల్ ను పరిమితం చేయాలి:

ఆల్కహాల్ మరియు GERDకి మద్య సంబంధం ఉన్నట్లు చాలా పరిశోధనలు నిర్ధారించారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది గ్యాస్టిక్ మౌకస మీద నేరుగా ప్రభావం చూపుతుంది. మరియు ఎసిడిటికి కారణం అయ్యే ఎసోఫాగస్ కు కారణం అవుతుంది.

స్మోక్ చేయడం నివారించాలి :

స్మోక్ చేయడం నివారించాలి :

ఎసిడిటి సమస్య ఉన్నవారిలో స్మోకింగ్ మరింత ఎక్కువ ప్రభావం చూపుతుంది .సిగరెట్స్ లో నికోటిన్ అనే పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల, ఇది స్టొక్ లైనింగ్ ను చిరాకుపరుస్తుంది .ఆమ్లం ఉత్తత్పికి కారణం అవుతుంది. కాబట్టి, దూమపానంకు దూరంగా ఉండటం అన్ని రకాల ఉత్తమం.

నిద్రించే భంగిమను మార్చుకోవాలి:

నిద్రించే భంగిమను మార్చుకోవాలి:

తలను ఎక్కువ ఎత్తులో ఉంచుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్షన్ కు కారణం అవుతుంది, ముఖ్యంగా రాత్రులో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది . నిటారుగా పడుకోడంవల్ల, యాసిడ్ క్లియరెన్స్ చాలా త్వరగా జరుగుతుందని కొన్నిపరిశోధనలునిర్ధారించాయి.

English summary

10 simple changes to prevent acidity and heart burn

Heartburn and acidity (medically called gastro-esophageal reflux disease-GERD) are common in people who follow unhealthy eating pattern and love spicy junk food. And, almost every person who has had episode of sour stomach, heart burn, pain and frequent stomach upsets must have popped an antacid to get instant relief.
Desktop Bottom Promotion