For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో విటమిన్ బి12లోపిస్తే..దీర్ఘకాలిక మతిమరుపు

|

విటమిన్ బి 12, ను సయనో కొబాలమిన్, కొబాలమైన్‌ అని అంటారు . ఈ విటమిన్ లోపం వల్ల ఫెర్నీషియస్ ఎనీమియాకు దారి తీస్తుంది. ఇది నీటిలో కరిగే విటమిను. మెదడు , నాడీమండలము పనిచేయుటలో కీలక పాత్ర పోషిస్తుంది . ఎర్ర రక్త కణాలు తయారిలోను, శరీరములో కణములో డి.ఎన్‌.ఎ తయారీ , రెగ్యులేషన్‌ , కొవ్వు ఆమ్లాలు తయారీలోను ఇది చాలా అవసరము .

బీ12 లోపంతో-వృద్ధుల్లో మతిమరుపు
వృద్ధుల్లో తికమక పడటం, మతిమరుపు వంటి లక్షణాలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిన్‌ లోపమూ కారణం అవుతుండొచ్చని మీకు తెలుసా? ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిన్‌ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడటం, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణాలుగానే చాలామంది పొరపడుతుంటారు.

విటమిన్‌ B12 ప్రాధాన్యత:
మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిన్‌ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, కుంగుబాటు, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలాల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలాకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్టు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాలా త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది.

విటమిన్ లెవల్స్ ను తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా తెలుస్తుంది. విటమిన్ బి12 లోపం ఉన్నవారు జీవశైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి . డైట్ లో మార్పులు చేసుకొన్న తర్వాత మార్పులు లేకుంటే డాక్టర్ ను కలిసి, విటమిన్ డి12 వైద్యపరమైన కారణాలను తెలుసుకోవాలి . కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి, సప్లిమెంట్స్ తీసుకోవడానికి ముందు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ ను మార్చుకోండి. ఈ క్రింది లిస్ట్ లో తెలిపి విటమిన్ బి12 ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ..

షెల్ ఫిష్ లేదా ఓయిస్ట్రెస్:

షెల్ ఫిష్ లేదా ఓయిస్ట్రెస్:

చాలా వరకూ షెల్ ఫిష్ లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది.ఇంకా పొటాషియం అందివ్వడంలో కూడా ప్రధానపాత్ర పోషిస్తుంది.

లివర్:

లివర్:

బీఫ్ మరియు చికెన్ లివర్ లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. చికెన్ లో ఎక్కువగా ఉంటుంది. మరియు ఇది మంచి ఎంపిక.

చేపలు:

చేపలు:

అనిమల్ ప్రొడక్ట్స్ లో అధికంగా విటమిన్ బి12లో కనుగొనడం జరిగింది . స్మోక్డ్ సాల్మన్, హెయరింగ్స్, తున, ట్రౌట్, మరియు క్యాన్డ్ సార్డిన్స్ వంటి ఆహారాల్లో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది.

 క్రాబ్:

క్రాబ్:

సీఫుడ్స్ లో ఒకటి క్య్రాబ్స్. విటమిన్ బి12 పుష్కలంగా ఉండే బ్లూ అండ్ రెడ్ కింగ్ క్రాబ్ ను తీసుకోవడం మంచిది. క్రేఫిష్, రొయ్యలు, మరియు లాబ్ స్టర్ వంటివి తీసుకోవడం మరో ఆప్షన్ . మంచి క్వాలిటీ ఉన్న క్య్రాబ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది.

సోయా ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్స్ లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. మీరు సోయా మిల్క్ ను కూడా ప్రయత్నించవచ్చు . విటమిన్ బి12కు ఇది మరో ప్రత్యామ్నాయం.

 ఫోర్టిఫైడ్ సెరిల్స్:

ఫోర్టిఫైడ్ సెరిల్స్:

సెరెల్స్ లో కూడా విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ బి12 లోపం ఉన్న వెజిటేరియన్స్ కు ఇది ఒక మంచి ఆప్షనల్ ఫుడ్ .

రెడ్ మీట్:

రెడ్ మీట్:

విటమిన్ ఎకు ఇది ఒక గ్రేట్ సోర్స్. గ్రాస్ పీడ్ బీఫ్ శరీరానికి ఆరోగ్యకరమైనది. కాబట్టి, లీన్ బీఫ్ ను ఎంపిక చేసుకోవాలి.

పాలు మరియు పెరుగు:

పాలు మరియు పెరుగు:

ఫుల్ ఫ్యాట్ మిల్క్ విటమిన్ బి12 కు ఒక మంచి ఆప్షన్ . ఇంకా మీరు పెరుగును కూడా ఎంపిక చేసుకోవచ్చు . మీరు వెజిటేరియన్స్ అయితే మాంసాహారాలకు ఇవి మంచి ప్రత్యామ్నాయ ఆహారాలు .

చీజ్ :

చీజ్ :

12 రకాల చీజ్ లలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. కొన్నిపరిశోధనల ప్రకారం ఈ చీజ్ లు అన్నీ ఆరోగ్యానికి మంచిది. చీజ్ లలోని రకాల మీద బి12 క్వాంటిటీ మరియు క్వాలిటీ ఆధారపడి ఉంటుంది.

గుడ్డు:

గుడ్డు:

గుడ్లలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఎక్కువగా పచ్చసొనలో, కొద్దిగా ఎగ్ వైట్ లో ఉంటుంది. ఒక ఉడికించిన గుడ్డులో 0.7mcg విటమిన్ బి12 ఉంటుంది.

English summary

10 Top Foods Rich In Vitamin B12

Vitamin B12, otherwise known as calamine, is important to keep our body healthy. Deficiency of this vitamin can lead to anemia, fatigue and depression. In drastic conditions, deficiency of this vitamin can cause permanent damage to the brain and central nervous system.
Desktop Bottom Promotion