For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘టర్మరిక్ టీ’ ! క్యాన్సర్ తో పాటు ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ పరార్.........

|

టర్మరిక్ టీ గురించి తెలుసుకొనే ముందు, పసుపులోని కొన్ని గొప్పవిషయాలను తెలుసుకోవాలి. భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మన భారతీయ సాంప్రదాయంలో పూజలు, వ్రతాలు లాంటి శుభ కార్యాల్లో పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యత ఉంది. పండుగలు, పెళ్ళిళ్ళ లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లుపెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకుంటారు.

ఆయుర్వేదంలో హల్దీ లేదా పసుపును "మసాలా దినుసుల రాజు" గా భావిస్తారు. ఎందుకంటే దీనిలో అనేక ప్రయోజనకరమైన లక్షణాలు ఉన్నాయి. పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ఫాస్ఫరస్‌ గూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువులో వివిధ జీవన ప్రక్రియలకుతోడ్పడే యాంటీ బయోటిక్‌, కాన్సర్‌ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్‌ నిరోధించేవి, గాయాలను త్వరగా మాన్పుతుంది, ట్యూమర్‌ కలుగకుండా వుండే, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉన్న వందలాదిపరమాణువులున్నాయి. పసుపు మాత్రమే కాదు పసుపుతో చేసే టీలో కూడూ కొన్ని రకాల బాడీ ఇన్ఫెక్షన్స్ నుండి యూటీఐ సమస్యల వరకూ అన్ని సమస్యలను నివారిస్తుంది.

READ MORE: మీ ఆహారంలో పసుపును చేర్చటానికి 10 కారణాలు

టర్మరిక్ టీ బాహ్యంగాను, అంతరంగాను శరీర అందానికి తోడ్పడుతుంది. పసుపుతో టీ తయారుచేయడానికి రెండు కప్పుల నీటిలో ఒక చెంచా పసుపు మిక్స్ చేసి బాగా మరిగించాలి. పుసుపు బాగా మరిగిన తర్వాత అందులో తేనె మిక్స్ చేసి వేడి వేడిగా తీసుకోవాలి. ఈ టీ వల్ల నొప్పులు, వాపులు, ఇన్ఫ్లమేషన్స్, టాన్సిల్స్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది . గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి టర్మరిక్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. పసుపు పేస్ట్ ను నుదుటన అప్లై చేయడం వల్ల తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. మరి వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలను తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే....

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

టర్మెరిక్ టీ క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్ అండ్ ప్రొస్టేట్ క్యాన్సర్ నివారిస్తుంది. ఇంకా కొన్ని కాలీఫ్లవర్ లీవ్స్ కు కొద్దిగా పసుపు చేర్చి పేస్ట్ లా చేసి అందులో నీరు పోసి మరిగించి త్రాగడం వల్ల ఫలితం మరింత బెటర్ గా మరియు ఎఫెక్టివ్ గా ఉంటుంది.

యాంటీసెప్టిక్ గుణాలు పుష్కలం:

యాంటీసెప్టిక్ గుణాలు పుష్కలం:

టర్మరిక్ టీ బహిర్గతంగా మరియు అంతర్గతంగా ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . గాయలు త్వరగా మానడానికి పసుపును అప్లై చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే టర్మెరిక్ టీ యాంటీబయోటిక్ లా పనిచేసి కొన్ని రకాల బాడీ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

కాలేయంను డిటాక్సిఫై చేస్తుంది:

కాలేయంను డిటాక్సిఫై చేస్తుంది:

ఇది ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ . లివర్ ను శుభ్రపరచడంలో టాక్సిన్స్ ను తొలగించడంలో టర్మరిక్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతి రోజూ టర్మరిక్ టీను 15రోజుల పాటు తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షన్స్ మెరుగుపడుతుంది మరియు వివిధ రకాల వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నొప్పి మరియు వాపులను తగ్గిస్తుంది:

నొప్పి మరియు వాపులను తగ్గిస్తుంది:

టర్మరిక్ టీ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది జాయింట్ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . దీన్ని రెగ్యులర్ గా ప్రతి రోజూ త్రాగడం వల్ల నొప్పి నివారిస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

టర్మరిక్ టీ మెటబాలిజంను రేటును పెంచుతుంది. దాంతో శరీరం లో ఎక్కువ ఫ్యాట్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇంకా దీని వల్ల శరీరం ఎక్కువ క్యాలరీలను గ్రహించేవిధంగా చేస్తుంది . దాంతో ఎనర్జీ పొందవచ్చు.

డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

చైనా వారు పురాతన కాలం నుండి పసుపును వారి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఆందోళన మరియు డిప్రెషన్ తగ్గించుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఇది మైండ్ ను రిలాక్స్ చేస్తుంది . టర్మరిక్ టీని ప్రతి రోజూ త్రాగడం వల్ల మంచి నిద్రపడుతుంది.

చర్మ సమస్యలను :

చర్మ సమస్యలను :

టర్మరిక్ టీ త్రాగడం మరియు చర్మానికి అప్లై చేయడం వల్ల అనేక రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను, మొటిమలు, మచ్చలు, ఎక్జిమాను నయం చేయడానికి బెస్ట్ నేచురల్ రెమెడీ .

హెల్తీ ఐస్:

హెల్తీ ఐస్:

పరిశోధన ప్రకారం పసుపులో ఉండే కుర్కుమిన్, బ్లైడ్ నెస్ ను నివారిస్తుంది . ద్రుష్టిలోపాలనుండి ఉపశమనం కలిగిస్తుంది . దీర్ఘకాలిక కంటి సమస్యలను నివారిస్తుంది

 స్టొమక్ అల్సర్ నివారిస్తుంది:

స్టొమక్ అల్సర్ నివారిస్తుంది:

టర్మరిక్ టీ బ్యాక్టీరియాను నివారస్తుంది. ఫైలోరి, స్టొమక్ అల్సర్ కు కారణం అవుతుంది. దీన్ని ఎదుర్కొనే శక్తి టర్మరిక్ టీలో పుష్కలంగా ఉన్నాయి. ఇంకా పొట్టనొప్పి, పొట్టలోని ఇన్ఫెక్షన్స్ నివారించడానికి, స్టొమక్ క్యాన్సర్ నివారణకు ఇది గ్రేట్ గా సహాయపడుతుంది

దంతాల నొప్పి వాపును తగ్గిస్తుంది:

దంతాల నొప్పి వాపును తగ్గిస్తుంది:

టర్మరిక్ టీ దంతసమస్యలను మరియు వాపులను తగ్గిస్తుంది . టర్మరిక్ టీలో కొద్దిగా లవంగాలు లేదా లవంగం నూనె చేర్చి నీటిని మరిగించి, ఆటితో నోటిని శుభ్రపరుచుకోవడం లేదా గార్గిలింగ్ చేయడం వల్ల చిగుళ్ల వాపు, ఇతర దంత సమస్యలు నయం అవుతాయి ,. చాలా ఎఫెక్టివ్ గా నొప్పి వాపులను తగ్గిస్తుంది

English summary

11 Health Benefits Of Turmeric Tea: Health Benefits in Telugu

Turmeric, a natural ingredient, can be used to prevent and treat many diseases. You must have heard about the immense health benefits that turmeric has to offer. Scientists are doing more research to reveal more health benefits of turmeric.
Story first published: Wednesday, November 18, 2015, 11:26 [IST]
Desktop Bottom Promotion