For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దూరప్రయాణం చేయడంతో ఒళ్ళునొప్పులు, అలసటను దూరం చేసే చిట్కాలు

|

సాధారణంగా ఎవరైనా ఎక్కువ జర్నీ చేస్తే చాలా త్వరగా అలసిపోతుంటారు. మరియు అలసిపోయినట్లు అనుభూతి చెందుతుంటారు . అందుకు ప్రధాణ కారణం కండరాల నొప్పి మరియు అక్కడ వాపు కలిగి ఉండటం వల్ల అలా జరగవచ్చు. అంతే కాదు ప్రతి రోజూ పనుల మీద లేదా ఉద్యోగం మీద ప్రతి రోజూ ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారు కూడా ఇంటికి చేరుకోగానికి ఎక్కువగా అలసటకు గురి అవుతుంటారు.

READ MORE: బాడిపెయిన్స్(ఒళ్ళు నొప్పుల)కు 20 ప్రధాన కారణాలు

దూరప్రయాణం చేసేప్పుడు, ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కండరాల పట్టివేత మరియు ముఖ్యంగా కండరాలు బలమీనమైన వాళ్లు కీళ్లవాపులు ఉండవచ్చు . అలాగే ఒళ్లు నొప్పు కూడా తేలికపాటి నుండి తీవ్రంగా ఉండవచ్చు . ఇలా దూరప్రయాణంలో వచ్చే ఒళ్ళు మరియు కాళ్ళనొప్పుల కోసం పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవడం వల్ల తాత్కలిక ఉపశమనం కలగవచ్చు. పెయిన్ కిల్లర్ మందుల యొక్క ప్రభావం తగ్గిన వెంటనే తిరిగి నొప్పులు పునరుత్పత్తి కావచ్చు . కాబట్టి, అందుకు మీరు బాధపడాల్సిన, చింతించాల్సిన పనిలేదు. కొన్ని హోం రెమెడీస్ నొప్పిని తగ్గించి కండాల యొక్క పట్టివేతను మరియు ఇన్ఫ్లమేషన్ ను వెంటనే తగ్గిస్తాయి.

READ MORE: ఈనొప్పి..ఆ నొప్పి...ఏ నొప్పికైనా తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

దూరప్రయాణం చేసిన తర్వాత కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ తీసుకోవడం వల్ల నొప్పి, దృఢత్వం మరియు కండరాల అనియంత్రిత వ్యాకోచం తగ్గించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించడానికి చాలా సురక్షితంగా ఉంటాయి మరియు దూరప్రయాణం చేసిన తర్వాత ఉపశమనం పొందేందుకు రోజువారీగా వీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . ఈ సహజ నివారణల వల్ల కండరాల్లో రక్తప్రసరణ మెరుగుపరచడానికి మరియు కండరముల నొప్ప నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. అలసట నుండి త్వరగా కోలుకొనేందుకు సహాపడుతాయి.
READ MORE: వివిధ రకాల నొప్పులను తగ్గించే నేచురల్ పెయిన్ కిల్లర్స్

దూరప్రయాణం చేయడంతో ఒళ్ళునొప్పులు, అలసటను దూరం చేసే చిట్కాలు...

 కాన్ బెర్రీ జ్యూస్ :

కాన్ బెర్రీ జ్యూస్ :

కాన్ బెర్రీ జ్యూస్ ఒళ్ళు నొప్పులు మరియు అలసటను తగ్గిస్తుంది. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఆంథోసినిన్స్ ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు జ్యూస్ త్రాగడం వల్ల ఇన్ఫ్లమేషన్, నొప్పులను నివారిస్తుంది.

మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి:

మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి:

మొలాసెస్,స్క్వాష్, స్విష్ చార్డ్, కోకోపౌడర్, బ్లాక్ బీన్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, సన్ ఫ్లవర్ సీడ్, బాదం, మరియు జీడిపప్పు వంటి మెగ్నీషియం ఫుడ్స్ ను తీసుకోవాలి. శరీరంలో మెగ్నీషియం తక్కువైనప్పుడు, కండరాల నొప్పులు, కండరాల తిమ్మెర్లు మొదలవుతాయి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకోవాలి. మీ రెగ్యులర్ డైట్ లో ఎక్కువ మెగ్నీషియం ఉన్న ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

అవసరం అయిన నూనెలతో మసాజ్ చేయాలి:

అవసరం అయిన నూనెలతో మసాజ్ చేయాలి:

కొన్ని నూనెలో యాంటీఇన్ఫ్లమేటరీ అనాలజిసిక్ గా పనిచేస్తాయి అందువల్ల, వీటి వల్ల బాడీ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి . ఇది రక్తప్రసరణను పెంచుతుంది,. ఇందులోని లాక్టిక్ యాసిడ్ వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి మరియు నొప్పిని తగ్గిస్తాయి . ఈ నూనెలో ఉండే ఆరోమా వాసన మనస్సుకు, శరీరానికి విశ్రాంతి కలిగిస్తుంది. నేచురల్ గా నొప్పి తగ్గిస్తుంది . లావెండర్, పైన్, జింజర్ మరియు పెప్పర్ ఆయిల్ ను ఉపయోగిస్తే చాలా ప్రయోజనం.

ఎప్షమ్ సాల్ట్ బాత్:

ఎప్షమ్ సాల్ట్ బాత్:

ఎప్షమ్ సాల్ట్ మరియు మెగ్నీషియం సల్ఫెట్ లో ఉండే మినిరల్స్ కండరాల యొక్క ఇన్ఫ్లమేషన్ మరియు బాడీపెయిన్ ను తగ్గిస్తుంది . మరియు ఇది కండరాల నొప్పి మరియు క్రోనిక్ కండీషన్ ను మరియు ఫైబ్రోమెయిల్గియ వంటివి తగ్గిస్తాయి. కాబట్టి ఎప్సమ్ సాల్ట్ ను బాత్ టమ్ లో వేసి వేడి నీటిలో 15నుండి 30నిముషాల వరకూ ఉన్నట్లైతే మజిల్ పెయిన్ మరియు క్రాంప్స్ ను నివారిస్తుంది.

 కోల్ట్ థెరఫీ:

కోల్ట్ థెరఫీ:

కోల్డ్ థెరఫీని క్రోయ్ థెరపీ అంటారు నొప్పి అధికంగా ఉన్న ప్రదేశంలో ఐస్ ను సున్నితంగా అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ క్రమంగా పెరిగి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఐస్ ప్యాక్, ఐస్ మసాజ్ , జెల్ ప్యాక్ , కెమికల్ కోల్డ్ ప్యాక్స్ చాల త్వరగా నొప్పి, ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి.

హీట్ థెరఫీ:

హీట్ థెరఫీ:

మజిల్ స్టివ్, స్ప్రెయిన్ లేదా స్ట్రెయిన్ నుండి గాయాల నుండి త్వరగా ఉపశమనం పొందడానికి మరియు వాపులను తగ్గించడానికి హీట్ థెరఫీ గ్రేట్ గా సహాయపడుతుంది. హాట్ ప్యాక్, ఇన్ఫ్రారెడ్ హీట్, పరాఫిన్ వాక్స్ మరియు హైడ్రోథెరఫీ మజిల్ క్రాంప్, నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇంకా ఫిజియో థెరఫిస్ట్ ను సంప్రధించి ఎఫెక్టివ్ గా త్వరగా నొప్పులను తగ్గించుకోచ్చు

గోరెవెచ్చని లేదా చన్నీటి స్నానం:

గోరెవెచ్చని లేదా చన్నీటి స్నానం:

చల్లనీళ్ళ స్నానం లేదా వేడినీళ్ళ స్నానం వల్ల చాల త్వరగా నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు . ఎందుకంటే గోరువెచ్చని లేదా చల్లనీటి స్నానం వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరిగి వాపులను మరియు నొప్పులను తగ్గిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

స్మూత్ మజిల్ పెయిన్ నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మీరు ఇంకా వెనిగర్ ను నేరుగా నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేయవచ్చు. ఇది మజిల్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్ ను పేస్ట్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా కోకనట్ ఆయిల్ ను మిక్స్ చేసి నొప్పులున్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడిగేసుకోవాలి.

హేర్బల్ మసాజ్:

హేర్బల్ మసాజ్:

కొన్ని హెర్బల్స్ లో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు నయం చేసే గుణాలు అధికంగా ఉంటాయి . (మూలికల యొక్క రసాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో జెల్ మరియు బామ్ )రూపంలో వాటిని శరీరానికి అప్లై చేయవచ్చు .

ఆక్యుప్రెజర్:

ఆక్యుప్రెజర్:

ఒళ్ళు నొప్పులున్నప్పుడు ఆక్యుప్రెజర్ ను ఉత్తమ ఉపాయం. నొప్పు ఉన్న ప్రదేశంలో ప్రెజర్ ను ఇ్వడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు.

English summary

11 Home Remedies For Body Pain And Tiredness After Long Journey: Health Tips in Telugu

11 Home Remedies For Body Pain And Tiredness After Long Journey: Health Tips in Telugu, We always feel tired and exhausted after a long road journey. Our muscles ache and there may be swelling too. The muscles tend to become stiff and sore.
Desktop Bottom Promotion