For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లవంగాల్లోని అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...

|

లవంగాలు సుపరిచితమైన వంటింటి వస్తువు . ప్రతి ఇంట్లోనూ ప్రతి డిష్ లోనూ ఉపయోగించే మసాలా దినుసు. లవంగాలు అద్భుత ఔషధ సుగంధ ద్రవ్యాలు. వీటిలో వాసనే కాదు విలువైన పోషకాలు కూడా ఉంటాయి. తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి. భారత్‌, చైనాల్లో రెండు వేల సంవత్సరాలనుంచీ దీన్ని వంటల్లో వాడుతున్నారు. మాంసాహార వంటలే కాదు, మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగమొగ్గ పడాల్సిందే. లేకుంటే కిక్కే రాదంటారు మసాలాప్రియులు. ఇది శృంగారప్రేరితం కూడానట. పరిమళాలు, సాంబ్రాణి కడ్డీల్లోనూ వీటి వాడకం ఎక్కువే.

తేనె & దాల్చిన చెక్కలోని ఆసక్తికరమైన ఆరోగ్య ప్రయోజనాలు

లవంగాలలో మంచి సువాస మాత్రమే కాదు.. విలువైన పోషకాలు ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, క్యాల్షియం, ఫైబర్ ఐరన్, జింక్ , నియాసిన్, ఫొల్లెట్ , ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మంగనీష్, విటమిన్ లు... ఎ, బి, సి , మరియు ఇ, కె, మరియు డిలు ఉంటాయి. మరి ఇన్ని పోషకాలు, ఔషదగుణాలున్న లవంగాలు, మనం సాధారణంగా ఉపయోగించే మెడిసిన్స్ అన్నింటినీ రిప్లేస్ చేసేస్తుంది. అనేక ఔషధగుణాల వల్లఅనేక వ్యాధులను నివారిస్తుంది.

త్వరగా బరువు తగ్గించే దాల్చిన చెక్క-తేనె డైట్

మనం రెగ్యులర్ గా వండుకొనే వంటల్లో రెగ్యులర్ గా లవంగాలను వాడటం మరియు ప్రతి రోజూ లవంగాలు తినడం వల్ల పొందే ప్రయోజనాలను తెలుసుకోవాలంటే క్రింద్ స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

అజీర్తిని నివారించడంలో లవంగాలు గ్రేట్ గా సహాయడపుతుంది. లవంగా జీర్ణ రసాలను, ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాదు గ్యాస్, ఆపానవాయు, స్టొమక్ ఇరిటేషన్ తగ్గిస్తుంది మరియు వికారం కూడా తగ్గిస్తుంది. లవంగాలు రోస్ట్ చేసిన పౌడర్ చేసి తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించుకోవచ్చు.

లైంగిక సమస్యలు:

లైంగిక సమస్యలు:

లైంగిక సమస్యలను మెరుగుపరచడంలో , ముఖ్యంగా పురుషుల్లో లిబిడోను మెరుగుపరుస్తుంది మరియు వంద్యత్వాన్ని నివారిస్తుంది . కాబట్టి లవంగాలను ఆహారాల్లో చేర్చడం లేదా టీరూపంలో తీసుకోండం మంచిది. టేస్ట్ కోసం తేనె మిక్స్ చేసుకోవచ్చు.

డయాబెటిస్ ను తగ్గిస్తుంది:

డయాబెటిస్ ను తగ్గిస్తుంది:

హైబ్లడ్ ప్రెజర్ షుగర్ లెవల్స్ ఉన్న డయాబెటిక్ పేషంట్స్ కు చాలా మంచిది . ఇది ఇన్సులిన్ లా పనిచేస్తుంది . ఎక్సెస్ షుగర్ ను బ్లడ్ నుండి బాడీ సెల్స్ లోనికి ప్రసరించేలా చేస్తుంది, దాంతో షుగర్ లెవల్స్ ను నార్మల్ చేస్తుంది డయాబెటిస్ నుండి రక్షణ పొందడానికి మరియు డయాబెటిస్ ను చికిత్స వంటిది లవంగాలు.

బోన్ అండ్ జాయింట్ హెల్త్ కు:

బోన్ అండ్ జాయింట్ హెల్త్ కు:

లవంగాల్లో యూజినాల్ మరియు ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇది బోన్ డెన్సిటిని పెంచుతుంది . బలహీనమైన ఎముకలు, ముఖ్యంగా మహిళల మరియు వయస్సైనవారు ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలంటే, రెగ్యులర్ గా లవంగాలు తినాలి.

వ్యాధినిరోధకత పెంచుతుంది

వ్యాధినిరోధకత పెంచుతుంది

లవంగాలు తినడం ద్వారా అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు, అంతే కాదు, ఇది వ్యాధినిరోధక శక్తిపెంచుతుంది. ఇది వైట్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది, దాంతో ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది . లవంగాలు తినడం వల్ల ఇది ఒక బెస్ట్ బెనిఫిట్

బాడీ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి:

బాడీ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి:

లవంగాలు పెయిన్ కిల్లింగ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగినది. లవంగాల్లో ఉండే యూజనాల్ అనే కాంపౌడ్ నొప్పిని మరియు ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది. అందువల్ల, లవంగాలు ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ గా పనిచేస్తుంది . లవంగాలతో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ .

దంతాల నొప్పి:

దంతాల నొప్పి:

లవంగాల వల్ల మరో హెల్త్ బెనిఫిట్ దంతాల నొప్పిని నివారిస్తుంది. దంతక్షయాల వల్ల దంత నొప్పిని నివారిస్తుంది . దంతాలు దంతాల నొప్పిని తగ్గిస్తుంది . కొన్ని సందర్భాల్లో తక్షణ రిలీఫ్ ను ఇస్తుంది. లవంగాలు నొప్పిని నివారిస్తుంది.

క్యాన్సర్ నివారిని:

క్యాన్సర్ నివారిని:

శరీరంలోని క్యాన్సర్ సెల్స్ ను లవంగాలు నాశనం చేస్తాయి .ముఖ్యంగా లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ మరియు ఇతర క్యాన్సర్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . కాబట్టి, లవంగాలు ఎక్కువగా తినండి క్యాన్సర్ నుండి రక్షణ పొందండి.

లివర్ డిసీజ్ లను నివారిస్తుంది:

లివర్ డిసీజ్ లను నివారిస్తుంది:

లవంగాలలో ప్రొటక్టివ్ ప్రొపర్టీస్ ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్స్, అధికంగా ఉండటం వల్ల లివర్ ను డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది . అందువల్ల లవంగాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని లివర్ సమస్యలను దూరం చేసుకోండి..

తలనొప్పి నివారిస్తుంది:

తలనొప్పి నివారిస్తుంది:

తలనొప్పి నివారించడానికి లవంగాలను ఉపయోగించాలి . తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. లవంగాల పొడిలో రాక్ సాల్ట్ వేసి గ్లాసు మిల్క్ లో మిక్స్ చేయాలి. ఈ మిశ్రం త్రాగడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు .

వాంతులు నివారిస్తుంది:

వాంతులు నివారిస్తుంది:

లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్‌, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.

డయోరియా:

డయోరియా:

పెద్దపేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మజీవుల్నీ లవంగంలోని 'యుజెనాల్‌' నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందు.

జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది:

జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది:

ఏడుమొగ్గల్ని కొద్దినీళ్లలో మరిగించాలి. తరవాత దాన్నించి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తరవాత ఆ నీళ్లను తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి కాస్తంత హాయి.

స్ట్రెస్ తగ్గిస్తుంది:

స్ట్రెస్ తగ్గిస్తుంది:

తులసి, పుదీనా ,లవంగాలు ,యాలకుల మిశ్రమం టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది .

చర్మ సమస్యలు, మొటిమలను నివారిస్తుంది:

చర్మ సమస్యలు, మొటిమలను నివారిస్తుంది:

పది లవంగాలు, గుప్పెడు పుదీనా తీసుకుని మెత్తగా చేయాలి. ఈ మిశ్రమానికి కాస్త శెనగపిండి, చల్లనినీరు కలిపి ముఖానికి ప్యాక్ లా వేసి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. యాంటీ ఆస్ట్రిజెంట్ లా పనిచేసే లవంగాలు, మొటిమలను దూరం చేస్తాయి. పైగా ఈ ప్యాక్ జిడ్డు చర్మతత్వం గలవారికి చక్కగా పనిచేస్తుంది.

English summary

15 Miraculous Health Benefits Of Eating Cloves Daily

15 Miraculous Health Benefits Of Eating Cloves Daily,Cloves can be found in almost every household and is added in almost every dish. It adds a nice flavour to the food, but do you know that cloves have many health benefits as well? From now on add more of cloves to your dishes, and also consider having cloves in other forms too.The reason behind this is the immense health benefits offered by cloves to our body in many ways. It treats almost all ailments, for which we may be taking prescribed medicines. Cloves can replace most of your medicines, as it has medicinal properties too in treating diseases.
Story first published: Thursday, December 3, 2015, 23:53 [IST]
Desktop Bottom Promotion