For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేజీగా ఉండే ఉదయాన్ని.. ఆహ్లాదంగా మార్చుకోవడానికి 16 మార్గాలు

By Nutheti
|

వేకువజామునే నిద్ర లేస్తే.. ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటామని అందరికీ తెలిసిన విషయమే. కానీ.. అలా నిద్ర లేవడం అంటే.. చాలా కష్టమైన పని. నిద్ర నుంచి బయటపడలేక.. మజ్జు వదలలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. రాత్రి ఎంత లేటుగా అయినా పడుకుంటాం కానీ.. ఉదయాన్నే మాత్రం లేవలేం అంటూ ఉంటారు చాలామంది. మరి ఇలాంటప్పుడు ఉత్సాహబరితమైన ఉదయానికి ఎలా వెల్ కమ్ చెప్పాలో ఈ టిప్స్ ఫాలో అయితే మీకే తెలుస్తుంది.

READ MORE:తాజా పండ్లను ఉదయం తినడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

నిద్ర వీడకముందే లేస్తే.. చాలా అన్ కంఫర్టబుల్ గా ఉంటుంది. మెంటల్ గా కాస్త డిస్టర్బ్ గా ఉంటుంది. ఏ పని సరిగా చేయలేక నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే.. ఇలాంటి లేజీనెస్ నుంచి ఈజీగా బయటపడి.. చకచకా ఉదయాన్ని ప్రారంభించడానికి 16 మార్గాలున్నాయి. వీటిని పక్కా ప్రణాళికతో ఫాలో అవ్వండి.. హుషారుగా రోజుని ప్రారంభించండి.

రాత్రి టీవీ చూడకూడదు

రాత్రి టీవీ చూడకూడదు

రాత్రి టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల రాత్రంతా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. పడుకునే ముందు.. టీవీ చూడటం వల్ల.. ఆ లైటింగ్ కళ్లపై చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇకపై రాత్రిపూట టీవీ చూడ్డం మానేయండి.

కంటినిండా నిద్రపోవడం

కంటినిండా నిద్రపోవడం

సరిపడా నిద్రపోవడం ప్రతి ఒక్కరికి సమస్యగా మారింది. కావాల్సినంత సేపు నిద్రపోకపోవడం వల్ల ఆ రోజంతా మూడీగా ఉంటుంది. కాబట్టి సరిగ్గా నిద్రపట్టడానికి రకరకాల యాంగిల్స్ ప్రయత్నించండి.. కంటినిండా నిద్రపోండి.

ఒకే సమయానికి లేవడం

ఒకే సమయానికి లేవడం

దేనికైనా సరైన ప్రణాళిక ఫాలో అయినప్పుడే శరీర ఆరోగ్యం బాగుంటుంది. నిత్యం ఒకే సమయానికి నిద్రలేచేలా.. ప్లాన్ చేసుకోండి. ఆటంకం లేకుండా నిద్రపోతే.. సరైన సమయానికి నిద్రలేవచ్చు.

ఒక యాప్

ఒక యాప్

స్లీప్ సైకిల్ కి ఓ యాప్ కూడా వచ్చేసింది. దీన్ని అలర్ట్ లో పెట్టుకుంటే.. మీరు ఎంతసేపు పడుకున్నారో గమనించి.. శరీరానికి సరిపడా నిద్రపోయాక.. అలార్మ్ సిగ్నల్ తో మిమ్మల్ని నిద్రలేపుతుంది.

ఉదయాన్నే స్నానం

ఉదయాన్నే స్నానం

ప్రతి రోజూ ఉదయాన్ని యాక్టివ్ గా ప్రారంభించాలంటే.. స్నానం చేయాలి. నిద్ర లేవగానే స్నానం చేయడం వల్ల లేజీనెస్ త్వరగా పారిపోతుంది.

వెలుతురు

వెలుతురు

నిద్ర మత్తు వదలాలంటే.. వెంటనే సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల.. నిద్రమత్తు వదిలి.. శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది. దీనివల్ల శరీరానికి చాలా సహజంగా.. ఎనర్జీ అందుతుంది.

వ్యాయామం

వ్యాయామం

సింపుల్ టిప్ ఇది. నిద్ర మత్త వీడాలంటే.. జాకింగ్ కో, వాకింగ్ కో వెళ్లండి యాక్టివ్ గా ఉండండి. రోజుని వ్యాయామంతో వెల్ కమ్ చెప్పండి.. రోజు మొత్తం ఉండే ఉత్సాహాన్ని గమనించండి.

కాఫీ

కాఫీ

కాఫీలో కెఫీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల వెంటనే నిద్ర లేవాలన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ.. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.

నీళ్లు తాగడం

నీళ్లు తాగడం

నిద్ర లేవగానే.. ఒక గ్లాసు నీళ్లు తాగండి. దీనివల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉండటమే కాదు.. శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది.

వీకెండ్స్ లోనూ అదే పద్ధతి

వీకెండ్స్ లోనూ అదే పద్ధతి

వీకెండ్ వచ్చిందంటే చాలు.. లేటుగా నిద్రలేస్తారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఉన్నట్టుండి వచ్చేమార్పులను శరీరం తట్టుకోలేదు. కాబట్టి వీక్ డేస్ లో ఎలా లేస్తారో అదే టైమ్ కి వీకెండ్స్ లో కూడా నిద్ర లేచే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

హ్యాపీ సాంగ్స్త తో అలార్మ్ సౌండ్

హ్యాపీ సాంగ్స్త తో అలార్మ్ సౌండ్

నిద్రమత్తులో అలార్మ్ సౌండ్ విని చాలా మంది ఉలిక్కి పడుతుంటారు. కాబట్టి.. మీకిష్టమైన పాటలను అలార్మ్ రింగ్ టోన్ గా సెట్ చేసుకోండి. వాటిని కూడా తరచుగా మారుస్తూ ఉండాలి.దానివల్ల మీ మూడ్ చాలా బాగుంటుంది.

ఉదయం ఒత్తిడి తగ్గించుకోవాలి

ఉదయం ఒత్తిడి తగ్గించుకోవాలి

ఉదయాన్నే లంచ్, బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి పరుగులు పెడుతూ.. తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. కాబట్టి.. ముందు రోజూ ఉదయానికి అవసరమైన పనులు చక్కబెట్టుకుంటే బెటర్. అప్పుడు పని ఒత్తిడి తగ్గుతుంది.

రిలాక్సేషన్

రిలాక్సేషన్

మిమ్మల్ని రిలాక్స్ చేసుకోవడానికి మీకిష్టమైనవి చేయవచ్చు. కాఫీ, బైక్ రైడింగ్, సైక్లింగ్, గేమ్.. ఇలా ఏదో ఒకటి చేసి.. ఎంజాయ్ చేయడం వల్ల చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది.

లేట్ నైట్ ఫుడ్ వద్దు

లేట్ నైట్ ఫుడ్ వద్దు

రాత్రిపూట లేటుగా భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. లేటుగా తినడం వల్ల అరుగుదల సరిగా ఉండదు. దీనివల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది.

ఆల్కహాల్ కి నో

ఆల్కహాల్ కి నో

రాత్రిపూట ఆల్కహాల్ సేవించకూడదు. దీనివల్ల నిద్ర త్వరగా పట్టినా.. అది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నాయి అధ్యయనాలు.

అల్పాహారం మానవద్దు

అల్పాహారం మానవద్దు

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం మానేయకండి. దీనివల్ల అనారోగ్యానికి గురవుతారు. శక్తినిచ్చే ఆహార పదార్థాలను బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే.. రోజు చాలా ఆరోగ్యంగా.. ఉత్సాహంగా గడుస్తుంది.

చూశారుగా.. సింపుల్ అండ్ అమేజింగ్ టిప్స్. ఇంకేం వీటితో.. ప్రతి రోజునీ.. ఉత్సాహబరితంగా మార్చుకోండి.

English summary

16 Ways to Combat Groggy Morning Feeling:health tips in telugu

We all wish we could wake up more alert and energetic. Some of us have a real struggle waking up each morning. It ends up putting us in a terrible mood. Sleep inertia is a physiological state characterized by a noticeable decline in motor skills and dexterity.
Story first published: Thursday, October 15, 2015, 16:59 [IST]
Desktop Bottom Promotion