For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనిలో ఉన్నప్పుడుఖచ్చితంగా అనుసరించాల్సిన 6 ఆరోగ్యపు అలవాట్లు

|

సహజంగా కొంత మందిని గమనించినట్లైతే పనిలో ఉన్నప్పుడుచాలా చురుకుగా పనిచేస్తుంటారు. కొంతమందిమొదట చురుకుగా ఉన్నా, కొంత సమయానికి వారిలో ఎనర్జీలెవల్స్ తగ్గిపోతూ, అలసటగా కనిపిస్తుంటారు. రోజుమొత్తంలో ఒత్తిడి అనేది ప్రధానమైనది. పని వద్ద ఉన్నప్పుడు ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ను అలవాటు చేసుకోవడం ఒక ముఖ్యమైనటువంటి ట్రిక్.

హెల్తీగా ఉండటం వల్ల మీరు చాలా ఫ్రెష్ గా మరియు అందంగా కనబడుతుంటారు. అందుకు మీ జీవన శైలిలో కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ను అలవాటు చేసుకోవాలి. అందుకు రోజు రోజుకీ అలవాట్లు, చేసే పనుల్లో క్రమంగా మార్పులు చేసుకోవాలి. మార్పులు చాలా చిన్నవిగా అనిపించవచ్చు కానీ మీలో ఎనర్జీ లెవల్స్ ను మాత్రం చాలా ఎక్కువగా పెంచేస్తుంది.

రోజులో ఎక్కువ సమయంను ఆఫీసులోనే గడిపేస్తుంటారు. అందుకు మనం మంచిగా పనిచేయడానికి మన జీవనశైలిని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ను అవర్చుకోవడం తప్పనిసరి. మీరు ఉద్యోగస్తులైతే ఈక్రింద తెలిపిన ట్రిక్స్ మీరు తప్పనిసరిగా అనుసరించాలి...ఈ 6 చిట్కాలు మీకు ఒక కలర్ ఫుల్ డేను కలర్ ఫుల్ ఆలోచనలను అందిస్తుంది.మరి అదెలాగోచూద్దాం...

ఎలివేటర్(లిప్ట్)నుఉపయోగించకూడదు:

ఎలివేటర్(లిప్ట్)నుఉపయోగించకూడదు:

మీ ఆఫీసు పైఅంతస్తుల్లో ఉన్నట్లైతే మీరు మెట్లు ఎక్కి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల, ఇది చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ఎఫెక్టివ్ అలవాటు. దీన్ని మీరు ఖచ్చితంగా అనుసరించాలి. పనిచేసే చోట మీరు అనుసరించాల్సిన ఒక ఆరోగ్యకరమైన అలవాటు ఇది. ఈ విషయంలో చాలా మంది డాక్టర్లు కూడా సలహాలిస్తుంటారు.

తగినంత నీరు త్రాగాలి:

తగినంత నీరు త్రాగాలి:

శరీరంకు అవసరం అయ్యేంత నీరు తీసుకోవడం వల్ల మిమ్మల్ని ఎనర్జిటిక్ గా మరియు ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఈహెల్తీ హ్యాబిట్ మీ మనస్సును స్థిమితంగా ఉంచుతుంది మరియు పనిలో ఉన్నప్పుడు నిద్రమత్తును వదిలిస్తుంది. అందుకే ఇది ఒకహెల్తీ హ్యాబిట్ గా ఉంది.

ఒత్తిడిని నివారించడానికి ఒక చిన్నపాటి నడక:

ఒత్తిడిని నివారించడానికి ఒక చిన్నపాటి నడక:

పనిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నట్లు మీరు గ్రహించినట్లైతే వెంటనే లేచి ఒక చిన్న పాటి నడకను నడవడం లేదా ఒక చిన్న బ్రేక్ ను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల కొంచెం విశ్రాంతిగా అనిపించి మీకు ఒత్తడిని తగ్గిస్తుంది. అందుకే వ్యాయామంను మీ రెగ్యులర్ అలవాట్లలో దీన్ని ఒకటిగా చేర్చుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల మిమ్మల్ని ఫిట్ గాఉంచుకోవడానికి సహాయపడుతుంది .వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు అలవర్చుకోవల్సిన ఒక హెల్తీ హ్యాబిట్.

తేలిక ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్ నివారించాలి:

తేలిక ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్ నివారించాలి:

మరో ముఖ్యమైన ఆరోగ్యకరమై అలవాటు, ముఖ్యంగా జంక్ ఫుడ్ లవర్స్ కోసం , జంక్ ఫుడ్ నివారించి తేలికగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. జంక్ ఫుడ్ కొలెస్ట్రాల్ ను పెంచి క్రమంగా జీవనశైలి మీద ప్రభావం చూపుతుంది. అందుకు ఒక మ్యాజికల్ ట్రింక్ఏంటంటే, రోజంతా మీరు తేలిక ఆహారం తీసుకోవడంవల్ల రోజంతా మీరు తేలికగా అనిపిస్తుంది .

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

రెండుకప్పుల గ్రీన్ టీని తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. ఎందుకంటే గ్రీన్ టీలో చాలా గొప్ప మెడిసినల్ గుణాలున్నాయి.కాబట్టి, ఒక మంచి అలవాటుగా ఒక కప్పు గ్రీన్ టీని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది మరియు మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.

అప్పుడప్పుడు మీ కళ్ళును మిలకరిస్తుండాలి. లేదా ద్రుష్టిని మరల్చాలి:

అప్పుడప్పుడు మీ కళ్ళును మిలకరిస్తుండాలి. లేదా ద్రుష్టిని మరల్చాలి:

ఒకేభంగిమలో కూర్చొని, కంప్యూటర్ ను అలాగే చూస్తుండటం వల్ల కళ్ళు బరువు ఎక్కుతాయి. ఒత్తిడికి గురిఅవుతారు. అందుకే అప్పుడప్పుడు మీ ద్రుష్టిని పక్కకు మరల్చడం, లేదా కళ్ళను మిలకరించడం లేదా చల్లటి నీటితో కళ్ళు కడుక్కోవడం వల్ల ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు.

English summary

6 Healthy Habits To Adopt When At Work


 Feeling your battery levels going low after a few hours at work. Stress is your companion all through the day. Lack of some well-planned healthy habits in the workplace are playing the tricks.
Story first published: Thursday, January 8, 2015, 19:01 [IST]
Desktop Bottom Promotion