For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే 7 ఉత్తమ హోం రెమెడీస్

|

గొంతు నొప్పితో బాధపడుతున్నట్లైతే వెంటనే మనం ఉప్పు నీటితో మరిు గోరువెచ్చని నీటితో గార్లింగ్ చేస్తుంటాము . ఇది కేవలం సోర్ త్రోట్(గొంత నొప్పి)నుండి ఉపశమనం కలిగించే హోం రెమెడీ ఇది ఒక్కటే అనుకుంటారు. కానీ గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించే హోం రెమెడీస్ అనేకం ఉన్నాయి. అవి కూడా.

ముఖ్యంగా ఈక్రింది లిస్ట్ లో తెలిపిన 7 బెస్ట్ నేచురల్ సోర్ థ్రోట్ రెడీస్ ను పరిశీలించండి. ఈ హోం రెమెడీస్ చాలా సింపుల్ గా ఉంటాయి . కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి .
READ MORE: గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే విటమిన్స్ ఫుడ్స్

గొంతు నొప్పితో బాధపడే ఈ హోం రెమెడిస్ కంటే మరింత వేగంగా మరే ఇతర మెడిసిన్స్ పనిచేయవు. చాలా ఎఫెక్టివ్ గా వేగంగా గొంతు నొప్పిని నివారిస్తాయి . కొన్ని మందులు ప్రస్తుతానికి ఉపశమనం కలిగించినా మాత్రలు నిలిపేస్తే తిరిగి పునరావ్రుతం అవుతుంది. కానీ ఈ హోం రెమెడీస్ ద్వారా గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

READ MORE: ఈ జ్యూసులతో జలుబు, గొంతు నొప్పి మటు మాయం

గార్గిలింగ్ ద్వారా గొంతు నొప్పి, క్రిములను నాశనం చేయవచ్చు. మరియు గొంత నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మరి దీంతో పాటు మరొకొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

లెమన్ వాటర్:

లెమన్ వాటర్:

హోం మేడ్ సోర్ థ్రోట్ హోం రెమెడీ. ఒక గ్లాసు నీళ్ళలో నిమ్మరసం మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ఆస్ట్రిజెంట్ జ్యూస్ గొంత వాపును తగ్గిస్తుంది మరయిు వైరస్ మరియు బ్యాక్టీరియాను గొంతులో చేరకుండా నిరోధిస్తుంది . అయితే ఎక్కువ నిమ్మరసం వేయకుండా చాలా తక్కువగా మిక్స్ చేసుకోవాలి.

టమోటో జ్యూస్:

టమోటో జ్యూస్:

గొంతు నొప్పి నుండి తక్షణం ఉపశమనం పొందాలనుకుంటే, దీన్ని త్రాగవచ్చు. హాట్ వాటర్ మరియు టమోటో జ్యూస్ ను సమంగా తీసుకొని త్రాగాలి. ఇందులో కొద్దిగా పెప్పర్ సాస్ మిక్స్ చేసి త్రాగవచ్చు లేదా గార్గిలింగ్ చేయవచ్చు. ఈ మిశ్రమం గొంతు నొప్పి నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

హాట్ సాస్ మరియు వాటర్:

హాట్ సాస్ మరియు వాటర్:

హాట్ సాస్ పేరు వింటే కొద్దిగా భయం వేస్తుంది. కానీ చాలా ఎఫెక్టివ్ గా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. తక్షణ ఉపశమనం పొందడానికి కేయాన్ పెప్పర్ సాస్ ను హాట్ వాటర్లో మిక్స్ చేసి గార్గిలింగ్ చేయడం లేదా గోరువెచ్చగా త్రాగడం వల్ల కూడా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది . ఇది నొప్పిని మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

 అల్లం, తేనె, మరియు లెమన్ వాటర్:

అల్లం, తేనె, మరియు లెమన్ వాటర్:

గొంతు నొప్పి నివారించడానికి ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది అల్లం మరియు తేనెను వేడి నీటిలో మిక్స్ చేసి గార్గిలింగ్ చేయాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు మరియు వాటర్:

పసుపు మరియు వాటర్:

ఇంట్లో పొడి చేసుకొన్న పసుపులో అనేక బ్యూటీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పసులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు యాంటీ యాక్సిడెంట్స్ లక్షణాలు అనేక వ్యాధులతో పోరాడే లక్షణాలు కలిగి ఉన్నాయి . కాబట్టి ఒకటీస్పూన్ పసుపు గోరువెచ్చని ఒక గ్లాసు నీళ్ళలో మిక్స్ చేసి గార్గిలింగ్ చేయడం లేదా గోరువెచ్చగా త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . గొంతు నొప్పికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

లవంగాల టీ:

లవంగాల టీ:

వేడి నీటిలో ఒక టీస్పూన్ లవంగాలపొడి వేసి బాగా మిక్స్ చేసి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయాలి. లవంగాల టీలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి గొంత నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

బరువు తగ్గిచడంతో పాటు వ్యాధినిరోధకతను పెంచి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే మ్యాజికల్ టీ గ్రీన్ టీ. గోరువెచ్చని గ్రీన్ టీ గొంత నొప్పి నుండి ఉపశమనం కలిగించడంతో పాటు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

English summary

7 Best Sore Throat Remedies: Health Tips in Telugu

7 Best Sore Throat Remedies: Health Tips in Telugu, When we suffer from sore throat, the only best option that we think of is gargling with salt and luke warm water. But this is not the only sore throat remedy. There are many other remedies that can cure sore throat.
Desktop Bottom Promotion