For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ పెయిన్స్ నివారించే నేచురల్ ఫుడ్స్ ..

|

జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒంట్లో ఏదో ఒక నొప్పితో బాధపడి ఉంటారు. నొప్పులను తగ్గించుకోవడానికి మాత్రలు తినకుండా వంటింట్లోని ఔషధ మసాలాలను తినడం ద్వారా నొప్పుల నుండి విముక్తి పొందవచ్చు.

జిమ్ లో కష్టమైన వర్కౌట్స్ చేయడం వల్ల వచ్చే నొప్పులు లేదా మజిల్ క్రాంప్స్ ఉన్నప్పుడు నేచురల్స్ ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఇవి రెగ్యులర్ గా తీసుకొనే పిల్స్ కంటే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

కొన్ని హోం రెమెడీస్ వ్యాధినిరోధకతను పెంచుతుంది, ఒత్తిడి తగ్గిస్తుంది, మరియు నొప్పిని నివారిస్తుంది, కాబట్టి, ఆరోగ్యానికి సహాయపడే ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

కాబట్టి ఈ క్రింది తెలిపిన ఆహారాలను నొప్పు నివారిణులుగా మరియు మంచి ఆరోగ్యం కోసం రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిందే..

అల్లం:

అల్లం:

ఇది ఒక మ్యాజికల్ హెర్బ్, ఫ్రెష్ గా లేదా ఎండిన జింజర్ ను మాస్కులర్ మరియు జాయింట్ పెయిన్స్ నివారించడానికి సహాయపడుతాయి. అలాగే వాపులు మరియు స్టిఫ్ బోన్స్ ను నివారిస్తుంది.

కాఫీ:

కాఫీ:

వ్యాయామం వల్ల వచ్చే నొప్పులను నివారించడాని మరియు మాస్కులార్ ఇంజ్యూర్ మరియు నొప్పిని నివారించడానికి కాఫీ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇక ముందు ఒంట్లో ఏదైనా నొప్పులున్నప్పుడు ఒక కప్పు కాఫీ తీసుకోండి.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ ఫిష్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి చాల అవసరం అవుతాయి. కాబట్టి, ఇది ఆరోగ్యానికి ఒక బెస్ట్ ఆప్షన్ . సాల్మన్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ధరైటిస్ నొప్పిని నివారిస్తుంది . కాబట్టి, ఆరోగ్యకరమైన ఫుడ్ ను తినడం వల్ల ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండవచ్చు.

చెర్రీస్:

చెర్రీస్:

గౌట్ పెయిన్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జాయింట్లో వాపులు మరియు రెడ్ నెస్ ను నివారించడానికి చెర్రీస్ గ్రేట్ గా ఉపయోగపడుతాయి . అలాగే బ్లడ్ లో యూరిక్ యాసిడ్స్ పెంచుతుంది . కాబట్టి, నొప్పుల నివారణక ఇది బెస్ట్ నేచురల్ ఫుడ్ .

ఆరెంజెస్:

ఆరెంజెస్:

ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి చలి, జలుబు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఆరెంజ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బీటా క్రిప్టాక్సన్థిన్ కలిగి ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కండీషన్ రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ను నివారిస్తుంది.

ఓట్స్:

ఓట్స్:

ఓట్స్ లో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల , ఇది మెనుష్ట్యువల్ నొప్పులను నివారించడంలో , ఎండోమోట్రియోసిస్ నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండే జింక్ పెయిన్ ఫుల్ పీరియడ్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ . వెల్లుల్లిని పచ్చివి తినడం వల్ల స్కిన్ రాషెస్ లేదా నొప్పులను నివారిస్తుంది.వెల్లుల్లి రెబ్బలను ఆలివ్ నూనెలో వేసి వేడి చేసి, గోరువెచ్చని నూనెను జాయింట్ పెయిన్స్ ఉన్న చోట అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

English summary

7 Natural Foods To Eat For Pain Relief

If you are suffering from pain, then do not opt for a pill instead choose some of the healthier options that are easily available in your kitchen. If you are suffering from a tough workout or a pesky cold, or even a simple muscle cramp try these natural foods as they can be more effective than the regular pills that can affect your overall health.
Story first published: Thursday, October 22, 2015, 16:54 [IST]
Desktop Bottom Promotion