For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క గ్లాసు రెడ్ వైన్ తో మెండైన ఆరోగ్య ప్రయోజనాలు...

|

ఈ మద్యకాలంలో చాలా మందికి హెల్త్ కాన్సియస్ నెస్ ఎక్కువైంది. జీవనశైలిలో మార్పులతో పాటు, వ్యాయామం ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి సాధ్యమైనంత వరకూ అనారోగ్యాల పాలుకాకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు . ఈ మోడ్రన్ ప్రపంచంలో ఫ్యాషన్, పార్టీలు, ఫంక్షన్స్ అని ఎక్కువగా ఆల్కహాలిక్ బెవరేజెస్ ను ఇష్టపడుతున్నారు. వైన్ ఆల్కహాలిక్ బెవరేజ్ అయినా కూడా...మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుందని కొన్ని పరిశోధనలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఇది విస్ట్ లైన్(నడుము చుట్టుకొలత) తగ్గిస్తుంది.వైల్ లో ఉండే ఫాలీఫినాల్స్ హార్ట్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

ఇంకా రెడ్ వైన్ వల్ల దంత వ్యాధులు, బరువు తగ్గించుకోవడం, మతిమరుపును నుండి ఉపశమనం పొందడం కొన్ని రకాల క్యాన్సర్ ల నుండి రక్షణ పొందడానికి రెడ్ వైన్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇంకా కొన్ని ఉపయోగకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే...

యాంటీ ఏజింగ్:

యాంటీ ఏజింగ్:

వైన్ తో ఏజ్ బెటర్ గా ఉంటుంది! అవుననే అంటున్నాయి కొన్ని పరిశోధనలు, రెడ్ వైన్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రెడ్ వైన్ లో ఉండే రెస్వెట్రాల్ ఏజింగ్ ప్రోసెస్ ను ఆలస్యం చేస్తుంది. దాంతో దీర్ఘకాలం పాటు యవ్వనంగా ఉండవచ్చు.

 డిమెంటియాను నివారిస్తుంది:

డిమెంటియాను నివారిస్తుంది:

రెడ్ వైన్ చిత్తవైకల్య ప్రమాదంను తగ్గిస్తుంది. రెడ్ వైన్ లో ఉండే రెస్వెట్రాల్ మెదడుకు సరైన రక్త సరఫరా చేయడానికి సహాయపడుతుంది. మరియు చిత్తవైకల్య ప్రమాదం నుండి రక్షిస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది:

టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది:

రెడ్ వైన్ లో ఉండే రెస్వెట్రాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. రక్తంలో ఇన్సులిన్ నిరోధకత వలన టైప్ 2డయాబెటిస్ ప్రధాన కారకంగా చెప్పవచ్చు. అందుచేత రెడ్ వైన్ టైప్ 2 డయాబెటిస్ ను నిరోధించడానికి సహాయపడుతుంది.

ఊపిరితిత్తుల క్రియను మెరుగుపరుస్తుంది:

ఊపిరితిత్తుల క్రియను మెరుగుపరుస్తుంది:

మితంగా తీసుకొనే రెడ్ వైన్ వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉండదు. మరియు లంగ్స్ ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

డిప్రెషన్ తగ్గిస్తుంది:

డిప్రెషన్ తగ్గిస్తుంది:

రెడ్ వైన్ డిప్రెషన్ తగ్గిస్తుంది . ప్రతి రోజూ ఒక గ్లాసు రెడ్ వైన్ త్రాగడం వల్ల డిప్రెషన్ ను పారద్రోలవచ్చు.

 అంధత్వాన్ని నిరోధిస్తుంది:

అంధత్వాన్ని నిరోధిస్తుంది:

రెడ్ వైన్ కంటిలో అసాధారణ రక్తనాళ పెరుగుదలను నిరోధిస్తుంది. అలాంటి రక్తనాళాల పెరుగుదల వల్ల అంధత్వానికి దారితీస్తుంది.

బ్రెయిన్ హెల్త్ కు మంచిది:

బ్రెయిన్ హెల్త్ కు మంచిది:

మెదడులో కణాలు డ్యామేజ్ ను అరికట్టడానికి రెడ్ వైన్ గ్రేట్ గా సహాయపడుతుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడి చేయడం జరిగింది . బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ ను నివారిస్తుందని, దాంతో అల్జీమర్స్ ను కూడా దూరం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary

7 Ways Red Wine Benefits Your Health:Health Tips in Telugu/ red winetho arogya labhalu

There is misconception that wine has an adverse affect on health since it is an alcoholic beverage. But research says that consuming moderate amounts of wine has positive effect on health. It reduces your waist line, the polyphenols present in wine is beneficial for heart health.
Story first published: Thursday, November 19, 2015, 17:26 [IST]
Desktop Bottom Promotion