For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30ఏళ్ళ తర్వాత మగవారు చేయకూడని 9 ఖచ్చితమైన పనులు

By Super
|

30 యేళ్ళు దాటిన తరువాత మగవారు కొన్ని పనులు చెయ్యకూడదు. అవేమిటో ఎందుకు చెయ్యకూడదో తెలుసా?? 30 సంవత్సరాల తరువాత మగవారి శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి.

అందులో మొదటిది టెస్టోస్టీరాన్ లెవల్స్ తగ్గడం.దీని వల్ల శృంగారం తగ్గుముఖం పడుతుంది.ఇంకా మెటాబాలిజం తగ్గడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరగడం కూడా తగ్గుముఖం పడుతుంది.అందువల్లే, 30 సంవత్సరాలు దాటిన తరువాత క్యాలరీలు ఎక్కువగా తీసుకోకపోయినా పొట్ట చుట్టూ కొవ్వు చేరుతుంది.ఇదే ఆహారం ఒకప్పుడు మిమ్మల్ని ఆరోగ్యం గా ఉంచినా 30 సంవత్సరాల వయసు తరువాత అదే కొవ్వు గా మారడం మొదలవుతుంది. అందువల్ల 30 దాటగానే శారీరక శ్రమని కాస్త పెంచి క్యాలరీలు తీసుకోవడం కొంచమైనా తగ్గిస్తే మంచిది.

READ MORE: పురుషుల్లో లైంగిక సామర్థ్యంను పెంచే ఆహారాలు

ఒక వయసొచ్చిన తరువాత కొన్ని అలవాట్లని మార్చుకోకపోతే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది.మీ రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వల్ల అనేక రకాల ఇంఫెక్షన్ల బారిన పడే అవకాశమూ ఎక్కువే.లేట్ నైట్ పార్టీలు, ఇతరాత్ర కారణాలతో నిద్ర లేని రాత్రులు గడపడం శ్రేయస్కరం కాదు.

READ MORE: పురుషులకు 20 అత్యుత్తమమైన ఆహారాలు

అందువల్ల 30 యేళ్ళ తరువాత ప్రతీ మగవారు చెయ్యకూడని పనులు లేదా మార్చుకోవాల్సిన అలవాట్లని తెలుసుకుంటే మంచిది.

లైంగిక ఆరోగ్యాన్నికాపాడుకోవడం

లైంగిక ఆరోగ్యాన్నికాపాడుకోవడం

30 యెళ్ళు దాటగానే మీలో టెస్టోస్టీరాన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. అందువల్ల మీ శ్రుంగారేచ్చని కాపాడుకోవడానికి చెయ్యాల్సినదంతా చెయ్యలి.ఒకవేళ మీకు ధూమపానం అలవాటుంటే తక్షణమే మానుకోవడం మంచిది. ఎందుకంటే ధూమపానం మీ శ్రుంగార జీవితాన్ని నిస్సారం చేసెస్తుంది.

రోడ్డుపక్కన అమ్మే తినుబండారాలు తినడం

రోడ్డుపక్కన అమ్మే తినుబండారాలు తినడం

మీరు వయసులో ఉన్నప్పుడూ మీ శరీరం దేనినైనా జీర్ణం చేసుకోగలదు.కానీ మీకు 30 యేళ్ళు పూర్తయేస్సరికి మీరు ఇలాంటి పదార్ధాలని ఎంత నివారిస్తే అంత మంచిది.ఎందువల్ల అంటారా?? మీ రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతు సంబంధిత ఇంఫెక్షన్లు,గ్యాస్ట్రిక్ లాంటి జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువ.

అమిత మద్యపానం

అమిత మద్యపానం

మద్యాన్ని మితం గా తీసుకుంటే వచ్చే ముప్పేమీ లేదు.ఒకవేళ మీరు విందులు వినోదాల పేరుతో మద్యాన్ని అమితం గా తాగేవారయితే 30 యేళ్ళు దాటినా ఇంకా అలా తాగుతున్నారంటే అది మీ మానసిక స్థితికి నిదర్శనం.ఒక్కోసారి ఈ అలవాటు వ్యసనం గా మారి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

వీడియో గేమ్స్

వీడియో గేమ్స్

అవును, మీరు చదివినది కరెక్టే. వీడియో గేంస్ వ్యసనం మీ మేధాశక్తిని కుంటుపడేటట్లు చేస్తుంది.చిన్న పిల్లలు ఇవి మితం గా ఆడుకోవచ్చు కానీ 30 యేళ్ళు దాటిన మీరు వ్యసనం తో అలా గంటలు గంటలు కూర్చోవడం వల్ల మీ కళ్ళ ఆరోగ్యం మరియు మీ కీళ్ళ ఆరోగ్యాన్ని పణం గా పెట్టవలసి వస్తుంది.

జంక్ ఫుడ్

జంక్ ఫుడ్

30 యెళ్ళ తరువాత కూడా మీకు మీ ఆరోగ్యం పట్ల స్ప్రుహ లేకపోతే ఒబేసిటీ లేదా హ్రుదయ సంబంధిత వ్యాధులు మిమ్మల్ని కబళించ వచ్చు.

అతిగా టీవీ చూడటం

అతిగా టీవీ చూడటం

గంటల తరబడి కనీసం లేవకుండా టీవీ చూడటం ఒక మానసిక రుగ్మత.30 యేళ్ళు దాటాకా మీ ఆరోగ్యం కోసం అలాంటి రుగ్మత లకి దూరం గా ఉండటం మేలు

రాత్రిళ్ళు లేటు గా పడుకోవడం:

రాత్రిళ్ళు లేటు గా పడుకోవడం:

30 యేళ్ళ తరువాతా మీ శరీరం స్థిమిత పడాలి. అందువల్ల నిర్ణీత వేళకి తిని పడుకోవడం చాలా ముఖ్యం ఈ వయసులో నిద్ర లేమి అనేక ఆరోగ్య సంబంధిత కారణాలకి హేతువు.

భోజనం మానెయ్యడం:

భోజనం మానెయ్యడం:

మీరేమీ టీనేజర్ కాదు కదా రోజంతా శక్తివంతం గా ఉండటానికి. పొరపాటున కూడా 30 యేళ్ళు దాటగానే ఒక్కపూట కూడా భోజనం మానొద్దు.

ఆరోగ్యం పట్ల అశ్రద్ధ:

ఆరోగ్యం పట్ల అశ్రద్ధ:

చాలా మంది మహిళలు 30 దాటగానే తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు.ఇది చాలా పొరపాటు. ఆడవారైనా మగవారైనా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

English summary

9 Things A Man Shouldn't Do After 30: Health Tips in Telugu

9 Things A Man Shouldn't Do After 30: Health Tips in Telugu, There are certain things you shouldn't do after 30. What are they and why should one stop doing them? Well, after 30 years of age, certain changes occur in a man's body. Healthy Habits All Indian Men Have
Desktop Bottom Promotion