For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిరియాలలో ఘాటైన రుచే కాదు.. గమ్మత్తైన హెల్త్ బెన్పిట్స్ కూడా

By Nutheti
|

మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అదీ మీ వంటింట్లోనే ఉంది. అది కూడా నిత్యం వంటచేసినప్పుడల్లా వాడే పోపుల పెట్టెలోనే దాగుంది. పోపుల పెట్టెలో ఉండే నల్ల మిరియాల గురించి మాట్లాడుదాం. క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలువబడే మిరియాలు.. ఘాటుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

READ MORE: మిరియాల వల్ల కగలిగే 7 ప్రమాధకర దుష్ప్రభావాలు

మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానముంది. వీటిని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఆహారంలో రుచిని పెంచడానికి మిరియాల ఘాటు తగలాల్సిందే. వంటల్లోనే కాదు.. ఔషధంగా కూడా మిరియాలను ఉపయోగిస్తారు. ఇవి కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. ఎంతో రుచిని, ఘుమఘుమలను అందించే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

రొమ్ము క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్ నివారించడానికి మిరియాలు బాగా సహకరిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కెరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికారక ప్రీరాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. మిరియాలు తరచుగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సరే కాదు చర్మ, పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుందని స్టడీస్ తేల్చాయి.

ఆకలి పెంచడానికి

ఆకలి పెంచడానికి

ఆకలిగా ఉండటం లేదని చాలామంది ఫీలవుతూ ఉంటారు. ఇలా సమయానికి ఆహారం తీసుకోకపోతే.. పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఒక టేబుల్ స్పూన్ బెల్లంలో అరచెంచా మిరియాల పొడి కలిపి రోజూ తీసుకుంటే.. ఆకలి పెరుగుతుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

మిరియాల పైపొరలో ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని విచ్ఛిన్నం చేసి అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతాయి. ఫలితంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడడంతో పాటు రక్తనాళాల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి కాపాడుతాయి. కాబట్టి మిరియాలు తీసుకోవడం వల్లే ఆరోగ్యమే కాదు.. ఫిట్ గానూ ఉండవచ్చు.

ఒత్తిడి

ఒత్తిడి

ఆందోళన, ఒత్తిడి చాలామందిని వేధించే సమస్య. కాబట్టి మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

మిరియాల్లో అధికంగా ఉండే పెపెరైన్ అనే ఆల్కలాయిడ్ జీర్ణవ్యవస్థలో ఎక్కువమొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలోని ప్రొటీన్లు ఈజీగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్, విరేచనాలు సమస్యలు తగ్గిపోతాయి. కాబట్టి మిరియాలను రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

దగ్గు, జలుబు

దగ్గు, జలుబు

చిన్న పిల్లల్లో లేదా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా దగ్గు, జబులు వస్తూ ఉంటుంది. ప్రతిసారి మందులు వాడటం మంచిది కాదు. అందుకే మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చిగుళ్ల ఆరోగ్యానికి

చిగుళ్ల ఆరోగ్యానికి

ఒక కప్పు నీటిలో మిరియాల పొడి, ఉప్పు.. రెండింటినీ సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఈ పేస్ట్ ని చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చిగుళ్ల ఆరోగ్యం మెరుగవడమే కాదు.. పలు దంత సమస్యల నుంచి బయటపడవచ్చు.

గొంతునొప్పికి

గొంతునొప్పికి

50 గ్రాముల మిరియాల పొడిని తీసుకుని దానికి 600 మిల్లీలీటర్ల నీళ్లు చేర్చి అరగంట మరిగించాలి. ఈ నీటిని వడగట్టి రోజుకి మూడు సార్లు తీసుకుంటే.. వెంటనే ఉపశమనం కలుగుతుంది.

తలనొప్పి

తలనొప్పి

అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే.. తలనొప్పి నుంచి ఈజీగా బయటపడవచ్చు.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

మిరియాలతో చేసిన టీ తాగితే.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లు పుష్కలంగా అందుతాయి. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

విటమిన్ సి

విటమిన్ సి

మిరియాల టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక వ్యవస్థకు చేరుస్తుంది.

కండరాలు, నరాల నొప్పులకు

కండరాలు, నరాల నొప్పులకు

చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే కండరాలు, నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

వాపు తగ్గడానికి

వాపు తగ్గడానికి

మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి లేదా వాపు ఉన్న ప్రాంతంలో కడితే నొప్పి, వాపు తగ్గుతాయి. చర్మవ్యాధులు, గాయాలు ఉన్నప్పుడు మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది.

మొటిమలు

మొటిమలు

మొటిమలు ఎక్కువగా వేధిస్తుంటే.. మిరియాలు యాంటీ బయోటిక్ గా పనిచేస్తాయి. మిరియాలను పొడి చేసి స్ర్కబర్ తో కలిపి ముఖంపై రుద్దడం వల్ల మొటిమలతో పాటు, డెడ్ స్కిన్ తొలగిస్తుంది.

చుండ్రు నివారణకు

చుండ్రు నివారణకు

యువతరాన్ని ఎక్కువగా వేధిస్తున్న సమస్య చుండ్రు. దీన్ని పోగొట్టుకోవడానికి షాపూలకు బదులు మిరియాల ట్రీట్మెంట్ ట్రై చేయండి. పెప్పర్ లోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రు వదిలించడంలో గొప్పగా సహాయపడుతాయి. పెరుగులో ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి కలిపి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరి. కేవలంతో నీటితో క్లీన్ చేసుకోవాలి. షాంపూ వాడకూడదు.

English summary

Amazing Health Benefits Of Black Pepper in telugu

Black pepper is one of the spices that has a strong flavour and aroma. We often add grounded or raw black pepper to our dishes for seasoning. From sprinkling on omelet to adding in tea, black pepper is used for various purposes. Sometimes, black pepper is used as a home remedy to treat health problems like cough, cold and sore throat.
Desktop Bottom Promotion