For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనస్సును ప్రశాంతంగా ఉంచే 8 బెస్ట్ ఫుడ్స్

|

మనస్సు మరియు శరీరం రెండూ ఒకదానికొకటి, పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మనస్సు లేకుండా ఆరోగ్యకరమైన శరీరంను పొందలేరు.

ఉదాహరణకు డాక్టర్ల విషయంలో వారు శారీరకంగాను మరియు మానసికంగాను ఫిట్ గా ఉండటం వల్ల వారు ఆరోగ్యకరంగా భావితస్తారు. అందువల్ల వారు పేషంట్స్ ను కూడా శ్రద్దగా ఓపికగా చూడగలుగుతారు. మరి వారు మెయింట్ చేసే మానసిక, శారీరక ఆరోగ్య స్థితి సాధారణ ప్రజలు కూడా అనుసరించినట్లైతే భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలుండవు.

మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి వారు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోమని సలహాలిస్తుంటారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి ఆహారం చాలా అవసరం. ఈ ఆహారాల గురించి తెలుసుకొన్నట్లైతే మీ శరీరాన్ని అదే విధంగా మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు . మరి ఆ ఆహారాలేంటో కాస్త శ్రద్ద పెట్టి తెలుసుకొనే మనస్సును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి...

1. చేపలు:

1. చేపలు:

చేపల్లో సాల్మన్ మరియు మేకరెల్ రకాల చేపల్లో ఒమేగా 3ఫయాటీఆసిడ్స్ పుష్కలంగా ఉండి , బ్రెయిన్ కు అవసరం అయ్యే సెలీనియం మరియు ట్రిప్టోఫాన్ ను అంధించడం వల్ల బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది .

2. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాలు:

2. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాలు:

యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాలు మనస్సును ప్రశాంత పరచడంలో చాలా గ్రేట్ గా పనిచేస్తాయి . కాబట్టి, రోజులో మీరు తీసుకొనే ఆహారాల్లో యాంటీఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలను కూడా జోడించుకోవాలి .

3. వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్:

3. వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్:

చాలా వరకూ గ్రీన్ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ లో ఎక్కువ శాతంలో విటమిన్స్, ప్రోటీన్స్, మరియు ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి . అందువల్లే ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో చాలా గొప్పగా సహాయపడుతాయి.

4. అవొకాడో:

4. అవొకాడో:

అవొకాడో మోనోసాచురేటెడ్ ఫుడ్స్ . ఇందులో మంచి ఫ్యాట్ ఉన్నట్లు కనుగొన్నారు . ఇది రక్తప్రసరణను క్రమబద్దం చేస్తుంది . దాని వల్ల మనస్సు మరియు శరీరంకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరతాయి. మనస్సును ప్రశాంత పరుస్తుంది.

5. మీ భోజనంలో తృణధాన్యాలు జోడించాలి:

5. మీ భోజనంలో తృణధాన్యాలు జోడించాలి:

తృణధాన్యాలలో ఎక్కువగా న్యూట్రీషియన్ విలువలు కలిగి ఉన్నాయి. కాబట్టి, వీటిని ప్రతి రోజూ తీసుకొనే భోజనం చేర్చుకోవడం ద్వారా మనస్సును ప్రశాంత పరుస్తుంది. శరీరానికి అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది.

6. ఆలివ్ ఆయిల్ :

6. ఆలివ్ ఆయిల్ :

స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ లో గొప్ప న్యూట్రీషియన్ విలువలు కలిగి ఉన్నాయి. ఇది శరీరానికి మాత్రమే కాదు, మనస్సు కూడా చాలా ఉపయోగపడుతాయి. రక్తప్రసరణకు సహాయపడుతాయి.

7. ఉల్లిపాయలు:

7. ఉల్లిపాయలు:

మనస్సును ప్రశాంత పరిచే స్పెషల్ ఆహారాల్లో ఉల్లిపాయలు కూడా ఒకటని చాలా మందికి తెలిసుండకపోవచ్చు. ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలో రక్త ప్రసరణ క్రమబద్దం చేసి మనస్సును ప్రశాంత పరుస్తుంది.

8. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవాలి:

8. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవాలి:

ఉదయం తీసుకొనే అల్పాహారం ఆరోగ్యానికి చాలా అవసరం. అంతే కాదు ఆరోజంతా శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందివ్వడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మనస్సును ప్రశాంత పరచడంలో బ్రేక్ ఫాస్ట్ అత్యంత అవసరం అయినటుంటిది.

English summary

8 Best Foods To Keep Your Mind Calm

Foods are essential for a healthy body as well as for a healthy mind. If you are interested in knowing about the foods that keep your mind calm, then you must pay attention towards the following foods that will help you to keep your mind calm:
Story first published: Monday, May 18, 2015, 14:26 [IST]
Desktop Bottom Promotion