For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు గ్యాస్ సమస్య తీసుకొస్తున్న ఆహారాలేంటో తెలుసా ?

By Nutheti
|

ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్య సమస్యలు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. ఏం తింటున్నాం.. ఏవి ఆరోగ్యం అన్న విషయం పక్కనపెట్టేసి.. ఏది త్వరగా వండుకోగలిగితే వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరికొందరు.. వండుకునే తీరిక లేక బయటఫుడ్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో కడుపులో గ్యాస్ పెద్ద సమస్యగా మారింది.

శరీరంలో గ్యాస్ ఉత్పత్తి అవ్వడం సాధారణమే అయినా అధికంగా ఉత్పత్తయితే సమస్య మొదలవుతుంది. జీర్ణాశయంలో అధిక మోతాదులో ఆమ్లాలు ఉత్పత్తి కావడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకుండా కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఇది గుండె గొంతు వరకు నొప్పి రావడానికి కూడా దారి తీస్తుంది. కొంతమందిలో తరచుగా, మరికొంతమందిలో రోజూ ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇంకొందరికి భోజనం చేసిన వెంటనే ఈ సమస్య మొదలవుతుంది. అలసు ఈ గ్యాస్ కి కారణమయ్యే ఆహార పదార్థాలేంటో తెలుసుకుని.. వాటికి దూరంగా ఉంటే.. మంచిది. గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు.

యాపిల్

యాపిల్

యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది కూడా గ్యాస్ కి కారణమవుతుంది. యాపిల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో చురుకుగా ఉంటాయి కానీ ఇందులోని పెక్టిన్ అనే కార్బోహైడ్రేట్ మాత్రం గ్యాస్ ను అధిక మోతాదులో ఉత్పత్తి చేస్తుంది.

ఓట్స్

ఓట్స్

అందరూ వేలం వెర్రిగా కొంటున్న ఓట్స్ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో అంతే ఇబ్బందీ కూడా కలుగజేస్తాయి. ఇది శరీరంలోని కొలెస్ర్టాల్ ను తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ గ్యాస్ సమస్యలకు మాత్రం కారణమవుతోంది. ఓట్స్ లో ఉండే సోలబుల్ ఫైబర్ పేగుల్లో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తికి కారణమవుతుంది.

బంగాళదుంపలు

బంగాళదుంపలు

బంగాళదుంపల్లో పిండి పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది. కొలన్ లో బ్యాక్టీరియా క్రియేట్ చేసి తిన్న ఆహారాన్ని జీర్ణం కానివ్వకుండా అడ్డుకుంటుంది. ఇది గ్యాస్ కి కారణమవుతుంది.

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు

పాలలో ఉండే లాక్టోజ్ అంత తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థం కాదు. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. ఒక్కోసారి విరోచనాలకూ దారి తీస్తుంది. పాల ఉత్పత్తుల్లోనూ లాక్టోజ్ ఉండటం వల్ల ఇదే సమస్య వస్తుంది.

శీతల పానీయాలు

శీతల పానీయాలు

కూల్ డ్రింగ్స్ కడుపు ఉబ్బరానికి, గ్యాస్ర్టిక్ కు కారణం అవుతాయి. అనవసరమైన గాలి జీర్ణ వ్యవస్థలో చేరి జీర్ణక్రియను అడ్డుకొంటుంది. దాంతో జీర్ణక్రియ మందగించి గ్యాస్ ను ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి ఇలాంటి పానీయాలను తాగకపోవడం మంచిది. గర్భిణీలు అసలు కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.

ప్రాసెస్డ్ ఫుడ్స్

ప్రాసెస్డ్ ఫుడ్స్

ప్రాసెస్ చేసిన ఆహారాల్లో చక్కెర లాక్టోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి గ్యాస్ కు కారణమవుతాయి. అంతే కాకుండా ఈ ఆహారాల్లో అనారోగ్యకరమైన ఆహారాలు చేర్చి ఉండటం వల్ల జీర్ణక్రియ కూడా సవ్యంగా జరగదు. దీని వల్ల పొట్ట ఉబ్బరంగా ఉంటుంది.

క్యాబేజ్, మొక్కజొన్నలు

క్యాబేజ్, మొక్కజొన్నలు

మొక్కజన్న గింజలు సులభంగా అరగవు. కడుపు నొప్పి మరియు గ్యాస్ కు కారణమవుతాయి. క్యాబేజ్ లో కూడా షుగర్స్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణమవడానికి చాలా కష్టంగా అనిపించి పొట్టలో నొప్పికి కారణమవుతుంది.

చూయింగ్ గమ్

చూయింగ్ గమ్

చూయింగ్ గమ్ నములుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కడుపులోకి గాలి వెళ్తుంది. అంతే కాదు చూయింగ్ గమ్ లో ఎక్కువ షుగర్స్ ఉండటం వల్ల జీర్ణక్రియ లోపించి గ్యాస్ కు కారణమవుతుంది. దీని వల్ల పొట్ట ఉబ్బిపోయి నానా అవస్థలు పడాల్సి వస్తుంది.

స్వీట్స్

స్వీట్స్

స్వీట్స్ లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ చేర్చడం వల్ల ఇది గ్యాస్ కు కారణమవుతుంది. మిఠాయిలు చప్పరించేటప్పుడు ఎక్కవగా గాలిని మింగడం వల్ల గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది.

సోయా గింజలు

సోయా గింజలు

బీన్స్ కూడా గ్యాస్ ఉత్పన్నం చేసే ఆహారాల లిస్టులోకే వస్తాయి. వీటిలో ఉండే రఫినోస్ గ్యాస్ కారకంగా పనిచేస్తుంది. కాబట్టి వీటిని అప్పుడప్పుడు ఆహారంలో చేర్చుకోవడం బెటర్.

ఆరోగ్యానికి మంచి చేసేవే కొన్ని సందర్భాల్లో హానికి కూడా కారణమవుతాయి. కాబట్టి ఎలాంటి ఆహారాన్నైనా పరిమితి మించి తీసుకోకూడదు. ఆరోగ్యానికి మంచిది కదా అని నిత్యమూ తీసుకోకూడదు. గ్యాస్ సమస్యతో బాధపడేవాళ్లు ఈ ఆహారాలకు కాస్త దూరంగా ఉండటం మంచిది.

English summary

Foods That Cause Gas in telugu

Gastric problems are something that we all suffer from. Be it for a newborn or adult, there are many foods that causes gastric problems. Even improper eating habits like swallowing air while chewing can cause gastric problem.
Story first published: Wednesday, November 11, 2015, 11:20 [IST]