For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసం జబ్బులను ఎలా నయం చేస్తుంది: తెలుగు టిప్స్

|

నిమ్మరసం ఎంతో ప్రాచీనమైన సాంప్రదాయక పానీయంగా భావిస్తారు. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు. నిమ్మ కాయలు మన దేశంలో విరివిగా లభ్యమవుతూంటాయి. నిమ్మరసాన్ని మన దేశ వంటలలో రుచికిగాను విరివిగా వాడుతూంటారు.

నిమ్మరసం ఆరోగ్యానికి వివిధ రకాలుగా ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా ఫ్రెష్ లెమన్ జ్యూస్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి వ్యాధినిరోధకత పెంచుతుంది. ఎందుకంటే నిమ్మకాయలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా వుంటుంది.

READ MORE:ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు

కొన్నిరకాల అనారోగ్యాలు నివారించాలన్నా.. వంటకాలకు అదనపు రుచినివ్వాలన్నా.. చింతపండుకు ప్రత్యామ్నాయం వాడాలన్నా.. టక్కున గుర్తొస్తుంది నిమ్మకాయ. విటమిన్‌ 'సి'తో పాటు అదనపు పోషకాలనందించే నిమ్మ మరెన్నో విధాలుగా మేలుచేస్తుంది. మరి అటువంటి నిమ్మరసాన్ని ఎలా ఉపయోగించాలి, ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దామా...

జలబు మరియు దగ్గు తగ్గిస్తుంది:

జలబు మరియు దగ్గు తగ్గిస్తుంది:

గొంతుకు వచ్చే ఇన్ఫెక్షనలకు నిమ్మ మంచి ఔషధం. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతునొప్పి, మంట, మొదలైనవి నివారిస్తాయి. గొంతులో దురద, దగ్గు, బొంగురు పోవడాన్ని ఈ జ్యూస్ అరికడుతుంది

క్యాన్సర్ :

క్యాన్సర్ :

నిమ్మరసంలో 22యాంటీ క్యాన్సర్ కాంపౌండ్స్ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో నిమ్మరసంను చేర్చుకుంటే క్యాన్సర్ గడ్డలను ఏర్పడకుండా నివారిస్తుంది. క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది.

కాలేయ ఆరోగ్యం:

కాలేయ ఆరోగ్యం:

ప్రతి రోజు రెగ్యులర్ డైట్ లో నిమ్మరసం చేర్చుకోవడం వల్ల ఇది గ్రేట్ గా కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

న్యూట్రీషియన్స్:

న్యూట్రీషియన్స్:

నిమ్మరసం విటమిన్స్, సిట్రిక్ యాసిడ్, ఫ్లెవనాయిడ్స్, బికాంప్లెక్స్ విటమిన్స్, క్యాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, మరియు ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది.

బాడీ కెమిస్ట్రీనీ బ్యాలెన్స్ చేస్తుంది:

బాడీ కెమిస్ట్రీనీ బ్యాలెన్స్ చేస్తుంది:

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసడ్స్ శరీరం యొక్క జీవక్రియలను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంను మెటబలైజ్ చేస్తుంది. ఇది శరీరం యొక్క పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

యవ్వనంగా ఉండేలా చేస్తుంది:

యవ్వనంగా ఉండేలా చేస్తుంది:

నిమ్మపండులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ ను శరీరం నుండి తొలగించడానికి బాగా సహాయపడుతుంది. అందువల్ల, మనం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా కనబడుటకు బాగా సహాయపడుతుంది.

హైబిపి:

హైబిపి:

గుండె జబ్బుల సమస్యలున్నవారికి నిమ్మ రసం నీరు, దీనిలోని పొటాషియం కారణంగా ఎంతో బాగా పని చేస్తుంది. అధిక రక్తపోటు, కళ్ళు బైర్లు కమ్మటం, వాంతి వికారాలు వంటివి పోగొట్టి మైండ్ కు శరీరానికి విశ్రాంతినిస్తుంది. నిమ్మరసంలో ఉండే బయోఫ్లేవినాయిడ్లు రక్తనాళాలకు బలం చేకూరుస్తాయి. తద్వారా అంతర్గత రక్తవూసావం కాకుండా నివారిస్తాయి.

ఇమ్యూనిటి పెంచుతుంది:

ఇమ్యూనిటి పెంచుతుంది:

నిమ్మను నిత్యావసరంగానే కాదు.. ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు. నిమ్మరసంలో తేనె కలిపి పుచ్చుకుంటే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. నోట్లో పుండ్లు, పూత.. వంటి సమస్యలకు అద్భుతమైన ఔషధమిది. రక్తంలో కొవ్వు పేరుకొన్నప్పుడు ప్రతిరోజూ తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.

ఫ్యాట్ బర్నర్:

ఫ్యాట్ బర్నర్:

చాలామంది బరువు తగ్గేందుకు ఉదయం వేళ నిమ్మరసంలో తేనె వేసి తాగుతారు. ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది. దీనిలోని సిట్రిక్‌ ఆమ్లం, యాంటీసెప్టిక్‌ సుగుణాలు కడుపులో సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి.

వికారంకు చెక్ పెడుతుంది :

వికారంకు చెక్ పెడుతుంది :

నిమ్మపండు వల్ల మరో అద్భుత ప్రయోజనం ఉంది. నిమ్మ పండును వాసన చూడటం వల్ల వికారం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. జస్ట్ వాసన చూడటం వల్ల మీరు బెటర్ గా ఫీల్ అవుతారు.

రుమటాయిడ్ నయం చేస్తుంది :

రుమటాయిడ్ నయం చేస్తుంది :

నిమ్మలో గొప్ప మూత్ర విసర్జన ప్రేరక గుణాలు కలిగి ఉన్నాయి. ప్రాథమికంగా మూత్ర ఏర్పాటు మరియు శరీరం నుండి అధిక నీటిని తొలగించడానికి సహాయపడుతుంది. నిమ్మరసం యూరిక్ యాసిడ్‌ను పలుచన చేసి, కీళ్లనొప్పులు, గౌట్స్ వంటి రుగ్మతల బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది.

అలర్జీలను తగ్గిస్తుంది:

అలర్జీలను తగ్గిస్తుంది:

నిమ్మరసంలో ఫైటోన్యూట్రియంట్ హెస్పరిటిన్ ఉండటం వల్ల ఇది అలవేటివ్ అలర్జిక్ లక్షణాలను తగ్గిస్తుంది.

బ్రెయిన్ మరియు నరలకు సంబంధించిన జబ్బులను నివారిస్తుంది:

బ్రెయిన్ మరియు నరలకు సంబంధించిన జబ్బులను నివారిస్తుంది:

నిమ్మరతొక్కలో ఉండే పోటెంట్ ఫైటోన్యూట్రీయంట్స్ బ్రెయిన్ సమస్యలకు సంబంధించిన పార్కిన్సన్ డిసీజ్ ను నివారించడంలో సహాయపడుతుంది.

కంటి జబ్బులను నివారిస్తుంది:

కంటి జబ్బులను నివారిస్తుంది:

రీసెంట్ గా జరిగిన పరిశోధనల ప్రకారం కంటి జబ్బులను నివారిస్తుంది. ఇంకా డయాబెటిక్ రెటీనోపతి జబ్బులను కూడా అరికడుతుంది.

యాంటీ వైరల్:

యాంటీ వైరల్:

జలుబు మరియు దగ్గు వంటి ఫ్లూ వైరస్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. టెర్ఫిని లెమనాయిడ్స్ ను నిమ్మరసంలోని యాంటీ వైరల్ ఎఫెక్ట్స్ ఇతర వైరస్ లను తగ్గిస్తుంది.

డయాబెటిస్:

డయాబెటిస్:

కళ్ళ ఆరోగ్యంను మెరుగుపరచడంతో పాటు, డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. నిమ్మరసంలోని హెస్పరిటిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

గాల్ అండ్ కిడ్నీ స్టోన్:

గాల్ అండ్ కిడ్నీ స్టోన్:

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ గాల్ స్టోన్స్, కాల్షియం , కిడ్నీస్టోన్స్ ను కరిగిస్తుంది.

యాంటీ ఏజింగ్:

యాంటీ ఏజింగ్:

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది.

కోలన్ క్యాన్సర్:

కోలన్ క్యాన్సర్:

తేనెలోని యాంటీఆక్సిడెంట్స్ అనామ్లజనకాలతో పోరడాకలిగే శక్తి ఉండి, పెద్ద పేగుకు క్యాన్సర్ కు దారితీసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీనిలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి. అంతే కాదు కడుపులో నులిపురుగులు ఏర్పడకుండా సహాయపడుతుంది.

జీర్ణసమస్యలు:

జీర్ణసమస్యలు:

నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు పరిష్కరించబడుతాయి. అజీర్ణం వలన ఏర్పడే, గుండెమంట, కడుపు ఉబ్బటం, త్రేన్పులు వంటివి రాకుండా వుంటాయి.

టాక్సిన్స్ తొలగిస్తుంది:

టాక్సిన్స్ తొలగిస్తుంది:

ప్రతి రోజూ మనం కాలుష్యం, జంక్ ఫుడ్ తినడం వల్ల టాక్సిన్ ఏర్పడుతాయి. మరి ఈ టాక్సిన్స్ ను తొలగించే గుణం నిమ్మలో పుష్కలంగా ఉండటం వల్ల టాక్సిన్ తొలగించడంతో పాటు ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

దంతాలను మెరిపిస్తాయి.

దంతాలను మెరిపిస్తాయి.

నిమ్మతొక్కతో దంతాల మీద స్ర్కబ్(రుద్దడం)వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. ఇంకా బ్రెష్ మీద నిమ్మరసం పిండుకొని, దానికి కొద్దిగా సాల్ట్ చిలకరించి బ్రెష్(దంతావదానం/పళ్ళు రుద్దుకోవడం)చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మిళమిళలాడుతుంటాయి.

యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది:

యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది:

మీకు పొరపాటున చేయి తెగిన లేదా గాయాలైనా వెంటనే మీరు నిమ్మతొక్కను రుద్దడం వల్ల ఇది గొప్ప యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. అలా రుద్దడం వల్ల కొద్దిగా మంట అనిపించవచ్చు, కానీ మంచి ఫలితాన్ని అంధిస్తుంది.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

ఇన్ఫెక్షన్స్ తో పోరాడే లక్షణాలు నిమ్మలో మెండుగా ఉన్నాయి. ఇది చర్మానికి యాంటీసెప్టిక్ గా పనిచేసి మొటిమలు మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది . అందువల్లే ఇది ఒక బెస్ట్ బ్యూటీ వస్తువుగా చర్మానికి ఉపయోగిస్తారు.

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్ తో పోరాడే లక్షణాలు నిమ్మలో మెండుగా ఉన్నాయి. ఇది చర్మానికి యాంటీసెప్టిక్ గా పనిచేసి మొటిమలు మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది . అందువల్లే ఇది ఒక బెస్ట్ బ్యూటీ వస్తువుగా చర్మానికి ఉపయోగిస్తారు.

స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:

స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:

నిమ్మరసం చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. దీనిలోని విటమిన్ సి చర్మాన్ని సంరక్షించి చర్మ కాంతిని కలిగిస్తుంది. నిమ్మరసం రోజూ తాగితే, ఆరోగ్యం మెరుగుపరచి వయసు కనపడనివ్వకుండా కూడా చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో అత్యధిక సామర్థం కలిగిన గుణాలు ఉన్నాయి. నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు నల్లబడిన చర్మాన్ని తిరిగి నిగారింపు వచ్చేలా చేస్తుంది.

English summary

Healing Powers of Lemons : Telugu tips

Healing Powers of Lemons : Telugu tips. Lemon is one of the cheapest sources of good health available to us. You cannot even count the number of health benefits that lemon has
Desktop Bottom Promotion